సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ప్రభాస్ కొత్త సినిమా సలార్ గురించి ఓ కొత్త అప్డేట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన కన్నడ స్టార్ యష్.. సలార్ లో ఓ చిన్న గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రిక్వెస్ట్ మేరకు యష్ సలార్ లో గెస్ట్ రోల్ చేయటానికి ఒప్పుకున్నాడని వార్త. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో యష్ ను స్టార్ గా నిలిపింది ప్రశాంత్ నీలే కాబట్టి.. ప్రశాంత్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన యష్.. ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోటానికి రెడీ అయ్యాడట. ఇక సలార్ సినిమా నుంచి మరో అప్డేట్ కూడా గట్టిగానే వినిపిస్తోంది.
ఏప్రిల్ 2న సలార్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయటానికి హొంబలే టీమ్ సన్నాహాలు చేస్తున్నారట. భారీ యాక్షన్ సన్నివేశాలు.. థ్రిల్లింగ్ సీన్లతో ఇంట్రస్టింగ్ గా ట్రైలర్ ఉండబోతోందని టాక్. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాధేశ్యామ్ సినిమాతో డీలా పడిన ప్రభాస్ ఫ్యాన్స్.. సలార్ సినిమా కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.