గత కొద్ది రోజులుగా నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని కనిపించటం.. సడన్ గా ఇద్దరూ కలిసి మాయమైపోతుండటం.. తరచుగా జరుగుతుండటంతో వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ రూమర్స్ వినిపించాయి. అయితే.. అవేమీ రూమర్స్ కావనీ.. తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ ఫైనల్ గా ఉన్న విషయం చెప్పేసింది తమన్నా. విజయ్ వర్మతో లవ్ స్టోరీ-2 సెట్స్ లో ఉన్నప్పుడే ప్రేమ మొదలైందంటూ క్లారిటీ ఇచ్చింది. అప్పటి నుంచి అతనంటే చాలా ఇష్టం ఏర్పడిందనీ.. విజయ్ తో ఉన్నంత సేపూ సంతోషం తప్ప మరేమీ ఉండదనీ చెప్పుకొచ్చింది తమన్నా.
హ్యాప్పీడేస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఆ తర్వాత మంచి మంచి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. తెలుగులో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో నటించిన తమన్నా.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా మారింది. లేటెస్ట్ గా వచ్చిన ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాలో హాట్ హాట్ సీన్లతో రెచ్చిపోయిన తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులో చేరింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో తన లవ్ స్టోరీని రివీల్ చేసింది తమన్నా. విజయ్ వర్మ కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు.