HomeINTERNATIONAL NEWSఆశారాం బాపూ గురించి చాలా మందికి తెలియని నిజాలు

ఆశారాం బాపూ గురించి చాలా మందికి తెలియని నిజాలు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఈ రోజు ఉదయం కోర్టు ఆశారాం బాపూ అనే దొంగ బాబాకు జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే. 2013లో సూరత్ కు చెందిన ఓ మహిళ ఆశారాం బాపూ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు 2014లో చార్జి షీట్ దాఖలు చేసిన పోలీసులు ఏడుగురిని సాక్షులుగా చేసి విచారణ చేపట్టగా.. చాలా పరిణామాల తర్వాత 2018లో జోధ్ పూర్ కోర్టు జీవితకాల కారాగార శిక్ష విధించింది. మళ్ళీ కొన్ని పరిణామాల తర్వాత నేడు ఆశారాంకు శిక్ష ఖరారైంది. శిక్షకు గురైన ఆశారాం ఆస్తులపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.
1941లో పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో పుట్టిన ఆశారాం అసలు పేరు అసుమల్ హర్పలానీ. 1947 తర్వాత అహ్మదాబాద్ లో స్థిరపడింది ఆశారాం కుటుంబం. 1960లో లీలాషా అనే ఆధ్యాత్మిక గురువు వద్ద శిష్యుడిగా చేసిన ఆశారాం.. ఆ తర్వాత సబర్మతి నది ఒడ్డున సొంత ఆశ్రమాన్ని నిర్మించటం.. ఆ తర్వాత ఏకంగా 400 ఆశ్రమాలు నిర్మించే స్థాయికి చేరుకోవటం చాలా వేగంగా జరిగిపోయాయి. ఉచిత అన్నదానాలు.. ఆశ్రమాలతో కోట్లాది మంది భక్తులను సంపాదించుకున్న ఆశారాం పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఒక్క గుజరాత్ లోనే కాదు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఆశ్రమ భ‌వనాలు, వాటి పేరిట ట్రస్టులు, వాటి అకౌంట్లలో కోట్లాది రూపాయలు ఉన్నాయి. విదేశాల్లో కూడా ఆస్తులు కూడబెట్టాడు ఆశారాం. ఒక్క గుజరాత్ లోని ఆస్తుల విలువే 10 వేల కోట్ల పైమాటే. అంటే మొత్తం ఆస్తుల విలువ కనీసం లక్ష కోట్లు ఉండొచ్చని అంచనా.
ఆశారాం పెద్ద మాఫియా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆశారాం కేసు విచారణ జరుగుతున్నన్ని రోజులూ ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. కేసు విచారణ సమయంలో సాక్ష్యం చెప్పేందుకు వచ్చే వాళ్ళలో చాలా మంది అయితే కనిపించకుండా పోయేవాళ్ళు.. లేదంటే సడన్ గా మరణించేవారు. ఇదంతా ఆశారాం మాఫియానే చేస్తుందని ఆరోపణలు వచ్చినా రుజువులు దొరకలేదు. దేశవ్యాప్త నెట్ వర్క్ నిర్మించుకున్న ఆశారాం.. చాలా నేరాలకు పాల్పడేవాడు. కానీ బయటకు రాలేదు సరికదా.. ఎవ్వరికీ అనుమానం కూడా కలగలేదు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి సహా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఫేక్ బాబాను నమ్మి సందర్శించే వాళ్ళు. నేటితో ఈ కేసు ముగిసింది.. ఎట్టకేలకు ఆశారాం శిక్షకు గురయ్యాడు.

FOLLOW US

More like this