ఆదిపురుష్ సినిమా మరి కొద్ది గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే.. ఆదిపురుష్ కు పోటీగా ది ఫ్లాష్ కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. భారత్ లో కూడా ఆదిపురుష్, ది ఫ్లాష్ ఒకేసారి విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఇదే టాలీవుడ్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. మార్వెల్ సీక్వల్ సినిమాలు వచ్చీ రాగానే ఎంతటి విధ్వంసం సృష్టిస్తాయో మనకు తెలిసిందే. 2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్.. కొద్ది రోజుల క్రితం వచ్చిన అవతార్ 2 సినిమాలు భారత్ లో వంద కోట్ల కలెక్షన్లు దండుకున్నాయి. ఇప్పుడు ది ఫ్లాష్ అంతకు మించి అన్నట్టుగా రాబోతోంది. మరి హాలీవుడ్ సినిమాతో ఆదిపురుష్ ను పోటీగా రిలీజ్ చేయటం ఎందుకు అన్న ప్రశ్నలు కూడా వినిపించాయి. కానీ.. అడ్వాన్స్ బుకింగ్ లను బట్టి ది ఫ్లాష్ పై ఆదిపురుష్ వందరెట్లు విజయం సాధించిందని అర్థమవుతోంది. ఆదిపురుష్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ విలువ వంద కోట్లను దాటేసింది. ఇక ది ఫ్లాష్ కు భారత్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి చూస్తే 5 కోట్లకు కాస్త అటూ ఇటూగా ఉంది అంతే.
వరల్డ్ వైడ్ ఆదిపురుష్ సినిమా 7 వేల థియేటర్లలో విడుదల కాబోతున్నది. భారత్ లో 3300కు పైగా థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ అవుతుండగా.. ఓవర్సీస్ లో 2 వేల థియేటర్లలో, ఏపీ తెలంగాణలో 1100 థియేటర్లలో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 7 వేల థియేటర్లలో ఆదిపురుష్ విడుదల కానుంది. ఫస్ట్ డే వంద కోట్ల కలెక్షన్లు సాధిస్తే కనుక ఇది సరికొత్త రికార్డు అవుతుంది. ఫస్ట్ డే తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఇక సినిమా ప్రపంచ రికార్డులు తిరగరాయటం ఖాయమే. మరి కొద్ది గంటల్లో ఆదిపురుష్ సంగతి తెలిసిపోనుంది.