HomeINTERNATIONAL NEWSసింగపూర్ ఉరి వేసిన తంగరాజు సుప్పయ్య జీవితంలోని చేదు నిజాలు

సింగపూర్ ఉరి వేసిన తంగరాజు సుప్పయ్య జీవితంలోని చేదు నిజాలు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

సింగపూర్.. అభివృద్ధి చెందిన దేశం మాత్రమే కాదు. కఠిన చట్టాలు చేయడం, వాటిని అంతే కఠినంగా అమలు చేయడంలోనూ ముందుండే దేశం. చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత అన్నిదేశాల్లో ఉండాల్సిందే. దాన్నెవరూ కాదనరు. కానీ, ప్రపంచం వద్దంటున్నా పట్టించుకోకుండా అమలు చేసిన ఓ శిక్ష మాత్రం ఇప్పుడు సింగపూర్ కు విమర్శలను తెచ్చిపెడుతోంది. కేవలం గంజాయి స్మగ్లింగ్ చేసిన నేరారోపణపై భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తిని సింగపూర్ దేశం ఉరిశిక్ష వేసి అమలు చేసింది. ఇంతకీ.. ఎవరు ఈ తంగరాజు సుప్పయ్య.. అసలేం జరిగింది..
తంగరాజు సుప్పయ్య.. పుట్టిపెరిగింది సింగపూర్‌లోనే అయినా భారత సంతతికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం తంగరాజు వయసు 46 సంవత్సరాలు. 2014లో గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలతో సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఉరి శిక్ష పడే చివరి క్షణం వరకూ తంగరాజును కాపాడుకోడానికి అతడి ఫ్యామిలీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి మొదలు ప్రపంచ దేశాలన్నీ సింగపూర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చాయి. కానీ, ఆ దేశం తంగరాజును ఉరితీసేంత వరకూ నిద్దురపోలేదు. చివరికి ముందుగా ప్రకటించినట్టుగానే తంగరాజును ఉరికొయ్యకు వేలాడదీసి చేతులు దులిపేసుకుంది. ఇక్కడే సింగపూర్ చట్టాలపై చర్చ మొదలైంది. తంగరాజు సుప్పయ్య నింజంగానే గంజాయి స్మగ్లింగ్ చేశాడా? ఒకవేళ అదే నిజమనుకుంటే ఈ మాత్రానికే ఉరి శిక్ష వేస్తారా? లాంటి ప్రశ్నలు ప్రపంచం మొత్తాన్నీ తొలిచేస్తున్నాయి.
దశాబ్దాల క్రితమే తంగరాజు కుటుంబం భారత్ నుంచి సింగపూర్ వలస వెళ్లిపోయింది. చిన్నప్పుడే తంగరాజుకు చెడు వ్యసనాలు అలవాటయ్యాయి. 12 ఏళ్ల వయసులోనే గాంజాయి తీసుకోవడం మొదలు పెట్టాడు. మాదక ద్రవ్యాల నేరానికి సంబంధించి 14 ఏళ్ల వయసులోనే శిక్ష అనుభవించాడు. తంగరాజు జీవితంలో చాలా భాగం జైలుకు వెళ్లిరావడంతోనే సరిపోయింది. డ్రగ్స్ తీసుకోవడం లేదని నిర్ధారించేందుకు ప్రతివారం యూరిన్ రిపోర్ట్స్‌ ఇవ్వాలన్న కండిషన్‌పై తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇలాంటి హిస్టరీ ఉన్న వ్యక్తి గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టయితే న్యాయపోరాటాలు కలిసొచ్చే అవకాశాలు చాలా తక్కువ.
తంగరాజు సుప్పయ్య విషయంలో ఇదే జరిగిందనే చర్చ జరుగుతోంది. ఇక.. తంగరాజు కేసు విషయానికి వస్తే.. దాదాపు కేజీ గంజాయిని సింగపూర్‌లో అక్రమ రవాణాకు పాల్పడ్డాడన్నది తంగరాజుపై ఉన్న ప్రధాన అభియోగం. కానీ, దీని వెనుక ఉన్న కథ మాత్రం సింగిల్‌ లైన్‌లో ముగిసేది కాదు.
2013లో మలేషియాకు చెందిన మోగన్ వాలో అనే వ్యక్తి ఉద్యోగం కోసం సింగపూర్ వచ్చాడు. మినీ మార్ట్‌లో ఉద్యోగం ఉందని సెల్వా అనే వ్యక్తి ద్వారా తెలుసుకుని ఆ సంస్థ నెంబర్ సంపాదించాడు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి భాష భారతీయుడిలా ఉండటంతో అతని నెంబర్‌ను ఇండియా అని సేవ్ చేసుకున్నాడు. ఇదే సమయంలో సెల్వా అనే వ్యక్తి మలేసియా నుంచి సింగపూర్‌కు ఓ పార్సిల్ డెలివరీ చేయమని మోగన్ వాలోను కోరాడు. బదులుగా 900 డాలర్లు ఇచ్చాడు. కట్‌చేస్తే.. ఆ పార్శిల్‌లో గంజాయి ఉందని సెంట్రల్ నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. ఆ నేరాన్ని అంగీకరించిన మోగన్ వాలో.. సెల్వా అనే వ్యక్తి ఇండియా అనే వ్యక్తికి ఆ పార్సిల్ డెలవరీ చేయమని చెప్పినట్టు సింగపూర్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్‌తోపాటూ తన ఫోన్‌లో ఇండియా అని సేవ్ చేసుకున్న ఫోన్ నంబర్‌నూ ఇచ్చాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ నంబర్ తంగరాజు సుప్పయ్యది. కానీ, గంజాయి స్మగ్లింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని వాదించాడు తంగరాజు. అప్పట్నుంచి సింగపూర్ న్యాయస్థానాల్లో ఈ కేసు నలుగుతూనే ఉంది. చివరికి 2018లో తంగరాజుకు ఉరిశిక్ష విధించాలని తీర్పు వచ్చింది. తనకు ఏపాపం తెలియదంటూ తంగరాజు చేసిన న్యాయపోరాటాలు ఫలించలేదు. 2019లో అతను పెట్టుకున్న అప్పీల్ పిటిషన్‌ను కూడా అప్పీల్ కోర్టు కొట్టేసింది.
తంగరాజు కేసు విషయంలో సింగపూర్ తొందరపడిందనే చర్చ జరుగుతోంది. ఉరిశిక్ష అమలును నిలిపివేయాలంటూ తంగరాజు కుటుంబం వేడుకున్నా సింగపూర్ ప్రభుత్వం, న్యాయస్థానాలు కరుణించలేదు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు తంగరాజుకు సరైన అవకాశం కల్పించలేదని అతడి కుటుంబం కూడా విమర్శిస్తోంది. దర్యాప్తు సమయంలో తమిళ అనువాదకుడిని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కల్పించకపోవడాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తోంది. తంగరాజు కేసు దర్యాప్తులో సింగపూర్ ప్రభుత్వం తొందరగా వ్యవహరించిందని హక్కుల సంఘాలు కూడా విమర్శలు గుప్పించాయి. ఐనా సరే సింగపూర్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను అమలు చేసింది. తంగరాజును ఉరితీయబోతున్నామంటూ వారం రోజుల ముందు కుటుంబానికి వర్తమానం పంపిన జైలు అధికారులు.. తాజాగా అతడిని ఉరికంబానికి వేలాడదీశారు.
గంజాయి రవాణా వివాదంలో ఓ వ్యక్తిని ఉరితీయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో సింగపూర్ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి హక్కుల సంఘం కూడా తప్పుపట్టింది. ఉరిశిక్ష నిలిపివేయాలని పదేపదే విజ్ఞప్తి చేసింది. తంగరాజు ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని యూరోపియన్ యూనియన్ డిమాండ్ చేసింది. బ్రిటన్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ కూడా తంగరాజుకు మద్దతుగా గళం వినిపించారు. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ కమిషన్ ఆన్ డ్రగ్ పాలసీలో రిచర్డ్ బ్రాన్సన్ సభ్యుడిగా ఉన్నారు. ఈ డ్రగ్ కేసుతో తంగరాజుకు ఎలాంటి సంబంధం లేదని.. అయినా ఉరిశిక్ష విధించడం హక్కులను కాలరాయడమేనని వాదించారు. ఓ అమాయకుడ్ని సింగపూర్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుందని విమర్శించారు. ఎన్నో అంశాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న సింగపూర్ ఇలాంటి కొన్ని విధానాలతో విమర్శలపాలవుతుందని రిచర్డ్ బ్రాన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవానికి.. చాలా దేశాలు గంజాయి వాడకాన్ని పరిమిత మోతాదులో వాడేందుకు అనుమతి ఇస్తున్నాయి. రీసెంట్‌గా జర్మనీ సైతం అదే పని చేసింది. కానీ, సింగపూర్ మాత్రం గంజాయితోపాటూ డ్రగ్స్ రవాణా విషయంలో మిగిలిన దేశాలకంటే కఠిన చట్టాలను అమలు చేస్తోంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తుంది. ఉరిశిక్ష మాత్రమే సింగపూర్‌లో డ్రగ్స్‌ను కట్టడి చేయగలదని ఆ దేశ సర్కార్ నమ్ముతోంది. డ్రగ్ ట్రాఫికింగ్‌తో పాటు మొత్తం 33 నేరాలకు సింగపూర్‌లో మరణశిక్ష అమలులో ఉంది. పొరుగునే ఉన్న మలేసియా మాదక ద్రవ్యాల నేరాల్లో ఉరిశిక్షను పక్కన పెట్టినా సింగపూర్ మాత్రం తన విధానాన్ని మార్చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా హక్కుల కార్యకర్తలు ఎంత మొత్తుకుంటున్నా సింగపూర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అందులో భాగంగానే తంగరాజును ఉరితీసింది. ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటొంది. ఏదేమైనా తంగరాజు విషయంలో మాత్రం అతడికి న్యాయపోరాటం చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఉరితీయడం సరికాదంటోంది ప్రపంచం.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...