HomeTELANGANAపోడు భూముల పంపిణీకి సిద్ధమైన తెలంగాణ సర్కార్

పోడు భూముల పంపిణీకి సిద్ధమైన తెలంగాణ సర్కార్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

తెలంగాణలో పోడు భూముల వివాదానికి తెర దించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. త్వరలోనే పేదలకు పోడు భూములు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే చేపడతామని ప్రభుత్వం గతంలో ప్రకటించి విరమించుకుంది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ సర్వేలు చేపట్టాలన్నా సర్వేయర్లు తక్కువ మంది ఉండడంతో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇదిలా ఉంటే పొడు భూముల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సర్వేయర్ల కొరత సర్కారుకు ఆశనిపాతంలా మారింది.. కొద్దిరోజుల క్రితం పోడు భూముల సమస్య కేంద్రం పరిధిలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.. మళ్లీ కొద్దిరోజుల తరువాత రాష్ట్ర ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరిస్తుందని, పోడు భూముల సమస్యపై కమిటీని నియమించింది ప్రభుత్వం… కానీ ఈ కమిటీ అటవీ హక్కుల చట్టానికి విరుద్ధంగా ఉండడంతో కమిటీ ఎలాంటి పనులు చేయకూడదని కోర్టు స్టే విధించింది.
రాష్ట్రంలో అటవీ భూములకు హక్కు పత్రాలు కావాలని 4 లక్షల 14 వేల దరఖాస్తులు అందాయి.. గతంలో దాదాపు 90 వేల మందికి పట్టాలు ఇచ్చారు.. ఇప్పటికే దాదాపు లక్షకు పైగా పాత దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే పాత, కొత్త దరఖాస్తులు కలుపుకొని 4 లక్షలకు పైగా పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమయింది. సుమారు 12 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.. ఫిబ్రవరి నెలాఖరులో పోడు భూముల పంపిణీ చేపడతామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కంటే… అటవీ హక్కు చట్టంలోని నిబంధనల మేరకు ఏర్పాటు చేసిన గ్రామ స్థాయి, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు పోడు భూముల సమస్య పరిష్కరించవచ్చు.. గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసిన కమిటీలో 2 / 3 వ వంతు గిరిజన మహిళలు ఉండాలి. ఆ కమిటీ గ్రామంలో ఉన్న పోడు భూములు స్వభావం..? ఎంత మంది గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు..? వారి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో..? చూసి ఆ గ్రామ కమిటీపై ఉన్నత స్థాయి కమిటీలకు రిఫర్ చేసి… గిరిజనులకు పట్టాలు ఇప్పించవచ్చు… కానీ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా కమిటీలు ఏర్పాటు చేసి… సమస్యను మరింత జఠిలం చేయాలని ప్రభుత్వం చూస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
గ్రామ, సబ్ డివిజనల్, డివిజన్, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటులో భాగంగా గ్రామ సర్పంచ్, ఆ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన పెద్దలతో పాటు.. వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న రెవెన్యూ, సర్వే సిబ్బంది, అటవీశాఖ అధికారులతో సదరు దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే హక్కుల ఉత్తర్వులు జారీ చేయాలి. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లోని గిరిజన రైతులు, ఫారెస్ట్​అధికారుల మధ్య తరచూ యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కూడా వరుసగా ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నారు. పంటల సీజన్ వచ్చిన ప్రతిసారీ పంటలు సాగు చేయడానికి వచ్చిన తమపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి, అరెస్ట్ చేస్తున్నారని ఆదివాసులు వాపోతున్నారు.
పోడు భూములకు పట్టాలు ఇస్తామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించి చెప్పిన నేపథ్యంలో… పట్టాలు ఎప్పుడు ఇస్తారోనని గిరిజనులు ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే మూడు సార్లు కమిటీ భేటీ అయింది.. భేటీలు కావడం తప్ప… పంపిణీ తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ నెలలో పంపిణీ చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.. అయితే ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో… వేచి చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...