HomeFILM NEWS"నా ఆఫీస్ ముందు మజ్జిగ పంచుతున్నా" : తమన్ ట్వీట్ వైరల్

“నా ఆఫీస్ ముందు మజ్జిగ పంచుతున్నా” : తమన్ ట్వీట్ వైరల్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. తరచూ ట్రోలింగ్ కు గురవుతూ ఉంటాడు. తమన్ నుంచి ఏ కొత్త మ్యూజిక్ ట్రాక్ వచ్చినా అది కాపీ చేసిందేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించటం మామూలైపోయింది. తమన్ ఇచ్చిన ట్రాక్ దేని నుంచి కాపీ చేశారోనని జనం వెతికి వెతికి మరీ ఒరిజినల్ ట్రాక్ సంపాదించి దాన్ని పాపులర్ చేసి తమన్ ను ట్రోల్ చేస్తుంటారు. తమన్ కు సంబంధించిన చాలా పాటల విషయంలో ఇది జరిగింది. తమన్ ఆ పాటలకు కాపీ కొట్టాడా లేక యాధృచ్ఛికంగా వాటి మధ్య పోలికలు ఉన్నాయా అనేది అర్థం కాని విషయం. కానీ జనాలు మాత్రం తమన్ బ్రో మళ్ళీ కాపీ కొట్టేశాడనే ఊదరగొట్టేస్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా తమన్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం ప్రాజెక్టు నుంచి తమన్ ను తప్పించేశారనేది ఆ పోస్ట్ సారాంశం. రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమా గ్లింప్స్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఉన్న మ్యూజిక్ ఓ ఇంగ్లిష్ సినిమా నుంచి తమన్ కాపీ చేశాడంటూ ట్రోలర్స్ మళ్ళీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇలా తమన్ ను వరుసగా జనాలు ఆడిపోసుకుంటుంటే.. ఒక్కసారైన స్పందించని తమన్.. ఈ సారి మాత్రం ట్వీట్ ద్వారా స్పందించాడు.

నా ఆఫీస్ దగ్గర మజ్జిగ పంచిపెడుతున్నాను.. కడుపు మంటకు ఇది చాలా బాగా పని చేస్తుంది.. మజ్జిగ, అరటిపండు కడుపు మంటకు బాగా పనిచేస్తాయి.. అంటూ ట్వీట్ చేశాడు తమన్. తనను విమర్శించే వాళ్ళకు కౌంటర్ గా తమన్ ఈ ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది. తమన్ చేసిన ఈ ట్వీట్ ట్విటర్ లో ట్రెండ్ అవుతోంది. గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ను తీసేశారన్న వార్తలు నిజం కాదని ఈ ట్వీట్ తో తెలుస్తోంది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో మూడో సినిమాగా గుంటూరు కారం సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన శ్రీలీల, పూజా హెగ్డే నటించబోతున్నట్టు సినిమా యూనిట్ చెప్పింది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

FOLLOW US

More like this