పుష్ప ది రైజ్ తో పాన్ ఇండియా రేంజ్ లో రికార్డుల మోత మోగించాడు అల్లు అర్జున్. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా భారీ కమర్షియల్ హిట్టే. పుష్ప కూడా వసూళ్ళ వర్షం కురిపించి.. టాలీవుడ్ రేంజ్ ను ఇండియా మొత్తం తెలిసేలా చేసింది. పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కొత్త షెడ్యూల్ విశాఖపట్నంలో జరుగుతుండగా.. ఇందు కోసం బన్నీ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విమానంలో వైజాగ్ చేరుకున్నాడు. బన్నీకి విశాఖలో భారీ స్వాగతం లభించింది. అల్లు ఆర్మీ వైజాగ్ లో తెగ హంగామా చేసింది. ఎయిర్ పోర్టు దగ్గర అల్లు ఫ్యాన్స్ చేసిన హడావుడి మామూలుగా లేదు. ఎయిర్ పోర్టు వద్ద బన్నీని రిసీవ్ చేసుకున్న ఫ్యాన్స్.. బన్నీ బస చేసే హోటల్ దాకా ర్యాలీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం అల్లు ఫ్యాన్స్ గ్రూప్స్ లో ట్రెండ్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ కు వైజాగ్ సెంటిమెంట్ ఉంది. అంటే.. తన సినిమాలో విశాఖపట్నం సిటీని చూపిస్తే చాలు.. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అని బన్నీ నమ్ముతాడు. కనీసం ఒక్క షెడ్యూలైనా వైజాగ్ లో ఉండేలా ప్లాన్ చేస్తారు. కనీకం పాటలైనా వైజాగ్ లో షూట్ చేసేలా చూసుకుంటాడు బన్నీ. అంతలా వైజాగ్ సెంటిమెంట్ ను నమ్ముతాడు. వైజాగ్ లో కనిపించిన అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ఇంతకు ముందు కంటే కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది.