HomeINTERNATIONAL NEWSచైనాను వణికిస్తున్న ఐఎన్ఎస్ వగీర్ ప్రత్యేకతలు ఇవే

చైనాను వణికిస్తున్న ఐఎన్ఎస్ వగీర్ ప్రత్యేకతలు ఇవే

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ఐఎన్ఎస్ వగీర్.. ఇండియన్ ఆర్మీ కిల్లర్ ఫిష్‌గా ముద్దుగా పిలుచుకుంటున్న సబ్‌మెరైన్ ఇది. వగీర్‌ అంటే ఇసుక సొరచేప. నిశ్శబ్ధంగా, నిర్భయంగా పని చేయడం దీని ప్రత్యేకత. అందుకే ఈ డెడ్లీ సబ్‌మెరైన్‌కు వగీర్ అని నామకరణం చేశారు. ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. పోయిన ఏడాది డిసెంబర్ 20న భారత నౌకాదళానికి దాన్ని అప్పగించారు. ప్రస్తుతం నేవీలో నాలుగు కలవరి శ్రేణి సబ్‌మెరైన్‌లు ఉన్నాయి. శత్రువుల కంట పడకుండా సంచరించగల ఆధునిక టెక్నాలజీ వగీర్‌లో ఉంది. అందుకే ఇది సముద్రజలాల్లో భారత సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. భారత నౌకాదళంలో 1973లో తొలిసారి వగీర్‌ను తీసుకొచ్చారు. మూడు దశాబ్దాల పాటు సేవలందించిన ఆ జలాంతర్గామిని 2001లో డీకమిషన్ చేశారు. ఆ తరువాత మరింత అధునాత వగీర్ కోసం 2020 నవంబరులో కొత్త ప్రాజెక్ట్ చేపట్టారు. అతి తక్కువ సమయంలో భారత్‌లో నిర్మించిన తొలి జలాంతర్గామి ఇదేనని నేవి చెబుతోంది.
మరోవైపు.. వగీర్ అత్యుత్తమ సెన్సార్‌లు కలిగి ఉందని నేవీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. నౌక విధ్వంసక ఆయుధాలైన వైర్-గైడెడ్ టార్పెడోలు, శత్రు నౌకాదళాన్ని అంతం చేసే ఉపరితల క్షిపణులు వగీర్‌లో ఉన్నాయి. వగీర్ శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌లు స్టెల్త్ మిషన్ కోసం బ్యాటరీలను త్వరగా ఛార్జ్ చేసేలా డిజైన్ చేశారు. అంతేకాదు, స్పెషల్‌ ఆపరేషన్స్‌కి ఈ సబ్‌ మెరైన్‌ కమాండోలను కూడా లాంచ్‌ చేయగలదు. ఆత్మరక్షణ కోసం అడ్వాన్స్‌డ్ టార్పెడో డికాయ్ సిస్టమ్‌ కూడా ఉందని భారత నేవీ చెబుతోంది. వగీర్ సబ్‌మెరైన్‌ ఇంటెలిజెన్స్‌ అందించడానికి, నిఘా వేసేందుకు ఉపయోగపడుతుంది. గూఢచర్యమైనా, యుద్ధంలో అయినా వగీర్‌ను ఎదుర్కోవడం దాదాపుగా అసాధ్యం. శత్రు దేశాల సబ్‌ మెరైన్‌లను పసిగట్టడమే కాకుండా వాటిని నాశనం చేసే సత్తా వగీర్ సొంతం. సింపుల్‌గా సింగిల్ లైన్‌లో చెప్పాలంటే డ్రాగన్ దగ్గరున్న యువాన్ వాంగ్ లాంటి స్పై షిప్‌ల ఆటలు వగీర్ ముందు ఏమాత్రం సాగవు.
ఇక.. ప్రాజెక్ట్-75 కింద కలవరి శ్రేణిలో ఆరో జలాంతర్గామి నిర్మాణం వేగంగా జరుగుతోంది. దీన్ని ఫ్రెంచ్ కంపెనీ డిజైన్ చేసింది. భారత సముద్ర జలాల్లో భద్రతను మరింత పెంచడానికీ, భారతదేశ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి కూడా వగీర్ బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందని నేవి అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇండియన్ నేవీ దగ్గర ప్రస్తుతం పదహారు డీజిల్‌తో నడిచే సబ్‌ మెరైన్‌లు ఉన్నాయి. అలాగే, ఏటీవీ ప్రోగ్రామ్ కింద నాలుగు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ మిసైల్‌ సబ్‌మెరైన్స్‌‌ను నిర్మించాలని భావిస్తున్నారు. ఈ క్లాస్‌లో మొదటి నౌక ఐఎన్‌ఎస్ అరిహంత్ 2014లో సేవలోకి ప్రవేశించింది. ఇందులో మొత్తం ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ బోట్లు ఉన్నాయి. వీటిని ఇండియాలోనే తయారు చేశారు. అరిహంత్-క్లాస్‌ సబ్‌మెరైన్‌లు 110 మీటర్ల పొడవు, 11 మీటర్ల బీమ్‌తో ఉంటాయి. నీటిలో 24 నాట్స్‌ వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి ఉపరితలంపైకి రాకుండా 50 రోజుల వరకు నీటిలోనే ఉండగలవు. దీని వెపన్స్‌ సిస్టమ్‌.. టార్పెడోలను అలాగే సబ్‌మెరైన్స్‌ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగలవు. మొత్తంగా.. హిందూమహాసముద్రంలో డ్రాగన్‌ను నిలువరించేలా ఇండియన్ నేవీ వేస్తున్న అడుగులు చైనాకు షాకిచ్చేవే.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...