HomeTELANGANAషర్మిళ సెల్ఫ్ గోల్.. పోయి పోయి కేసీఆర్ తోనా "వెర్రి" రాజకీయం..!

షర్మిళ సెల్ఫ్ గోల్.. పోయి పోయి కేసీఆర్ తోనా “వెర్రి” రాజకీయం..!

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

రాజకీయాల్లో రాణించాలంటే పోరాటం ఒక్కటే మార్గం కాదు.. ప్రజా సమస్యలపై అవగాహన.. ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేయగల బుర్ర.. సమయానికి తగినట్టు వ్యవహరించగలిగిన సమయస్ఫూర్తి.. చాణక్యుడిని మించిన రాజనీతి.. ఇలా అన్నీ కలిస్తేనే ఆ నాయకుడు రాణించగలడు. కానీ ఈ విషయం పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళకు పెద్దగా తెలిసినట్టు లేదు. గత రెండు రోజులుగా షర్మిళ చేస్తున్న రాజకీయాలు.. దాని పర్యవసానాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. కేసీఆర్ అంటే రాజకీయ ఉద్ధండుడు.. మహా మహా మేధావులనే మట్టి కరిపించిన చాణక్యుడు. ఆయన కంటే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తినే రాజకీయంగా సున్నా చేసిన రాజకీయ మేధస్సు కేసీఆర్ కు సొంతం. అలాంటి వ్యక్తిని ఎదుర్కునేందుకు ఇలాంటి మార్గమా షర్మిళ ఎన్నుకున్నది.. అనిపిస్తున్నది. రాజన్న బిడ్డ అనే ఓ డిగ్రీ తప్ప ఆమెకు తెలంగాణలో రాజకీయం చేయడానికి ఉన్న అర్హతలేమిటో తనను తాను ప్రశ్నించుకుంటే ఆమెకే అర్థం అవుతుంది. కనీసం వార్డు సభ్యురాలిగా గెలవక ముందే తెలంగాణకు ముఖ్యమంత్రిని అయి తీరతానని ప్రకటించిన నాడే ఆమె ఆలోచనా ధోరణి అర్థమైనా.. రాను రాను పాదయాత్ర పేరిట ప్రజల్లో కనిపించి కాస్త పరిణతి సాధించింది అనిపించింది. కానీ.. తాజాగా జరుగుతున్నది చూస్తుంటే.. ఇన్ని రోజులు గడిచినా ఆమె రాజకీయ పరిజ్ఞానం శూన్యం అనే చెప్పాల్సి వస్తోంది.
పార్టీ ప్రకటన చేస్తూనే రాష్ట్రవ్యాప్త పాద యాత్రను కూడా ప్రకటించిన షర్మిల ఆ దిశగా అడుగులు వేశారు. బీఆర్ఎస్ అధినేతను టార్గెట్ చేస్తూనే ఆయా నియోజకవర్గాల్లో లోకల్ ఎమ్మెల్యేలను సైతం లక్ష్యం చేసుకుంటూ జనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ జర్నీలో పలు సందర్భాల్లో ఆమెను పోలీసులు అడ్డుకోవడం, ఆమె కాన్వాయ్‌పై రాళ్లదాడి లాంటి అంశాలు వైఎస్సార్టీపీకి తెలంగాణ పార్టీ ఫ్లేవర్ వచ్చిందనీ, జనంలో కావాల్సిన గుర్తింపుతోపాటూ బీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉన్నవారి మద్దతు కూడా సాధ్యమైందనే చర్చ జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే షర్మిల పాదయాత్ర ఆ పార్టీకి అవసరమైన మైలీజీని తెచ్చిపెట్టింది. అయితే, ఈ తరహా యాక్షన్ అన్ని సందర్భాల్లో వర్క్‌ఔట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఒక్కోసారి బూమరాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఇది హైదరాబాద్ లోటస్ పాండ్‌ దగ్గర జరిగిన రచ్చకు సంబంధించిన విజువల్. షర్మిల యాక్షన్ బూమరాంగ్ అయ్యిందనే చర్చ ఈ ఘటనతోనే మొదలైంది. నిన్నమొన్నటివరకూ పాదయాత్రలో అవినీతి ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన షర్మిల.. తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్, పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో గులాబీ సర్కార్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నంచేస్తున్నారు. ఇందులో భాగంగానే సిట్ కార్యాలయంలో వినతి పత్రం ఇస్తానంటూ బయల్దేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై చేయి చేసుకున్నారు. లోట‌స్‌పాండ్ దగ్గర చోటు చేసుకున్న ఈ ప‌రిణామాలే ష‌ర్మిల‌, ఆమె తల్లి విజ‌య‌మ్మ‌కు నెగెటివ్ ప్ర‌చారం తీసుకొస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో అసలేం జరిగిందనే దానిపై జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత షర్మిల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.షర్మిల, విజయమ్మల క్లారిటీలను కాస్త పక్కనపెడితే.. షర్మిల వ్యవహార శైలిపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె అనే ఏకైక అర్హతతో ఏం చేసిన చెల్లుతుందనే భావన షర్మిలలో కనిపిస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాను చెప్పేది మాత్రమే చెల్లుబాటు కావాలనుకునే నైజంతో షర్మిల వెంట పెద్దగా చెప్పుకోదగిన నాయకులు ఎవరూ మిగల్లేదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ద్వితియ, తృతియ శ్రేణి నాయకులతోనే ఇప్పటికీ పార్టీని నడిపిస్తున్నారు. వైఎస్సార్ కుమార్తెగా, ఏపీ సీఎం జగన్ సోదరిగానే షర్మిలకు గుర్తింపు ఉంది. ఇప్పుడు స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని తెచ్చుకోకుండానే వివాదాలతో దోస్తీ చేయాలనుకునే ధోరణి ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలకు కారణం అవుతుందని షర్మిల గ్రహించటం లేదంటున్నారు విశ్లేషకులు. ఈ పరిణామాలన్నీ రాజకీయంగా షర్మిలకు లేని పోని ఇబ్బందులు తెచ్చే ప్రమాదం లేకపోలేదంటున్నారు.
షర్మిలను పోలీసులు అడ్డుకున్న క్రమంలో ఆమెను బ్రతిమాలే ప్రయత్నం చేసినా మొండిగా వ్యవహరించడమే ఇప్పటివరకూ బయటకొచ్చిన వీడియోల్లో కనిపించింది. ఇక్కడే షర్మిలది సెల్ఫ్ డిఫెన్స్ కాదు.. సెల్ఫ్ గోల్ మాత్రమే అనే చర్చ మొదలైంది. పొలిటికల్ అటెన్షన్ డ్రా చేసే ప్రయత్నమే అనే చర్చ జోరందుకుంది. తెలంగాణలో వైటీపీకి లీడర్లే కాదు.. కేడర్ కూడా లేదు. భారీగా ఖర్చు చేసే పరిస్థితి అంతకంటే లేదు. అందుకే షర్మిల వివాదాలనే నమ్ముకున్నారనే చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసే బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు కూడా షర్మిలకు, వైఎస్సార్టీపీకి దూరంగా ఉంటున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాదయాత్ర సమయంలో షర్మిలను పోలీసులు అడ్డుకుంటే ఇతర విపక్ష పార్టీల మద్దతు దొరికేది. కానీ, షర్మిల విజయమ్మ తాజా యాక్షన్‌కు మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించలేదు. కానీ, ఆమె మాత్రం ఎనీ వేర్ సింగిల్ హ్యాండ్ అనేలానే దూకుడుగా వెళుతున్నారు. మరి ఈ దూకుడు వైఎస్సార్టీపీ అధి నేత్రికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...