HomeTELANGANAప్రీతి కేసులో సంచలన విషయాలు.. సైఫ్ కు 14 రోజుల రిమాండ్

ప్రీతి కేసులో సంచలన విషయాలు.. సైఫ్ కు 14 రోజుల రిమాండ్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మెడికో ప్రీతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ వరంగల్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల తర్వాత సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించారు పోలీసులు. సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఆరోపణలు రావటంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు పలు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రీతి, సైఫ్ ఫోన్లను పరిశీలించగా వాట్సాప్ గ్రూప్ చాటింగ్ లో ఇద్దరి మధ్య వివాదం జరిగిందని తెలిసింది. ఒకే రోజు ప్రీతిని సైఫ్ పదే పదే వేధింపులకు గురి చేసినట్టు పోలీసులకు తెలిసింది. అయితే.. ప్రీతి కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
ప్రీతిని సైఫ్ చాలా కాలంగా వేధిస్తున్నాడనీ.. దీనిపై లోకల్ ఏసీపీకి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదనీ సమాచారం. హోం మంత్రి మహమూద్ ఆలీ అండదండలు సైఫ్ కు పుష్కలంగా ఉన్నాయనీ.. అందుకే పోలీసులు సైఫ్ ను ఏమీ చేయలేకపోయారనీ తెలుస్తోంది. ప్రీతి ఆత్మహత్యా యత్నానికి ముందు రోజు కూడా పోలీసులకు దీనిపై కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు కనీసం పట్టించుకోకపోవటంతో అవమాన భారంతోనే ప్రీతి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తోటి విద్యార్థులు చెప్తున్నారు. ప్రీతి తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవటం లేదంటూ ప్రీతి ముందు బాధను వ్యక్తం చేశాడని చెప్తున్నారు. ఇప్పుడే పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

FOLLOW US

More like this