తరచూ వివాదాల్లో ఇరుక్కునే బాలీవుడ్ నటి కంగన రనౌత్ ట్విటర్ అకౌంట్ సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. చాలా రోజుల గ్యాప్ తర్వాత కంగన అకౌంట్ సస్పెన్షన్ అయిపోయి మళ్ళీ యాక్టివ్ అయ్యింది. అకౌంట్ యాక్టివ్ అయిన వెంటనే కంగన ఫస్ట్ ట్వీట్ చేసింది. మళ్ళీ మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది అంటూ ఫస్ట్ ట్వీట్ చేసిన కంగన.. ఆ తర్వాత మరో ట్వీట్ లో తన రాబోయే సినిమా గురించి వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం కంగన ఎమర్జెన్సీ అనో మరో కాంట్రవర్సియల్ కథతో బాలీవుడ్ ను పలకరించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా పిక్చరైజేషన్ పూర్తి అయిపోయిందనీ.. అక్టోబర్ 20, 2023లో తన సినిమా రిలీజ్ కానుందనీ అప్డేట్ ఇచ్చింది కంగన.
చాలా రోజుల తర్వాత ట్విటర్ లో కనిపించిన కంగనకు స్వాగతం చెప్తూ చాలా మంది బాలీవుడ్ జనాలు కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టారు. ఇక ఆమె అభిమానులు కంగనను మళ్ళీ ట్విటర్ లో చూడటం చాలా హ్యాప్పీగా ఉందంటూ రీట్వీట్లు చేసేస్తున్నారు. కంగన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమర్జెన్సీ సినిమా కోసం నిజంగానే బాలీవుడ్ జనాలతో పాటు క్రిటిక్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పూర్తి చేయటానికి డబ్బులు అవసరమై తన సర్వస్వం అమ్మేయాల్సి వచ్చిందని రీసెంట్ గా కంగన స్టేట్మెంట్ ఇచ్చింది.