ఒక మంచి మాస్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా గ్యాప్ తర్వాత మైఖేల్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మైఖేల్ ట్రైలర్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూస్తే ఈ సారి సందీప్ కిషన్ భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడని అనిపిస్తోంది. డైరెక్టర్ రంజిత్ జైకోడి.. ఫుల్ లెంత్ యాక్షన్ సినిమాగా మైఖేల్ ను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మైఖేల్ లో భారీ తారగణమే ఉంది. మోస్ట్ ఎంటర్టైనింగ్ నటుడు విజయ్ సేతుపతితో పాటు, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌషిక్ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ట్రైలర్ చూస్తే హీరోయిన్ కోసం హీరో చేసే పోరాటమే అసలు కథ అని అర్థమవుతోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో డైరెక్టర్ రంజిత్ మైఖేల్ ను తెరకెక్కించాడు. ట్రైలర్ మొత్తం యాక్షన్, రొమాన్స్ మాత్రమే ఉంది. ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో బాలయ్య బాబు రిలీజ్ చేయగా, తమిళంలో జయం రవి, మలయాళంలో నవీన్ పాలీ రిలీజ్ చేశారు. డైరెక్టర్ రంజిత్ ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం సందీప్ కిషన్ దశ మారిపోవటం పక్కా. ట్రైలర్ ను చూస్తే సినిమా హిట్ కొట్టేలాగానే కనిపిస్తోంది.