HomeSPORTSరెజ్లర్ల ఆందోళనలో బిగ్ ట్విస్ట్ : ఉద్యోగంలో చేరిన సాక్షి మలిక్

రెజ్లర్ల ఆందోళనలో బిగ్ ట్విస్ట్ : ఉద్యోగంలో చేరిన సాక్షి మలిక్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ఢిల్లీ రెజ్లర్ల నిరసనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీక్రెట్ మీటింగ్ తర్వాత ఊహించని విధంగా ఈ ఆందోళన నుంచి రెజ్లర్ సాక్షి మలిక్ తప్పుకుంది. ఆమె యధావిధిగా తన ఉద్యోగంలో చేరినట్టు రైల్వేశాఖ చెప్పింది. సాక్షి మలిక్ విధుల్లో చేరినట్టు నార్తర్న్ రైల్వే అధికారులు వెల్లడించారు. బ్రిజ్ భూషణ్ పై అందరికంటే బలమైన ఆరోపణలు చేసింది సాక్షి మలికే. బ్రిజ్ భూషణ్ తనకు తండ్రితో సమానం అని చెప్పే సాక్షి మలిక్.. తనను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించాడని ఆరోపించటం సంచలనంగా మారింది. ఆమెతో పాటు సంగీత ఫొగాట్, భజరంగ్ పునియా మరో ముగ్గురు రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారంతా బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ వెంటనే అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నవారే. కానీ వీళ్ళు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేవిధంగా ఒక్క ఆధారం కూడా లేదు. బ్రిజ్ భూషణ్ మాత్రం తనపై కేసు వేసి ఆధారాలు కోర్టులో సమర్పించాలని.. రుజువైతే నేనే రోడ్డుపై ఉరి వేసుకుంటానని చాలెంజ్ చేశాడు.


అయితే.. ఇందులో ఎవరికీ తెలియని ఓ కొత్త కోణం ప్రచారంలోకి వచ్చింది. సాక్షి మలిక్ సహా అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళంతా వచ్చే ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారుల లిస్టులో లేరు. ఒకప్పుడు వీళ్ళు భారత్ తరఫున ఒలింపిక్స్ లో పాల్గొని మెడల్స్ తెచ్చిన వాళ్ళే అయినప్పడికీ భారత రెజ్లింగ్ సమాఖ్య ఈసారి వీళ్ళ కంటే మెరుగైన ప్రతిభ కలిగిన వేరే వాళ్ళను నేషనల్ టీమ్ లోకి సెలెక్ట్ చేసింది. దీంతో తమ భవిష్యత్తు ఇక ఇక్కడితో ముగిసినట్టే అని అర్థం చేసుకున్న రెజ్లర్లు.. ఇందుకు కారణమైన బ్రిజ్ భూషణ్ పై కక్ష కట్టి లేని ఆరోపణలు చేస్తూ రోడ్డెక్కారు. బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తొలగించేలా చేసి కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత మళ్ళీ తాము ఒలింపిక్స్ జాబితాలో పేరు చేర్చుకోవచ్చు అనేది వీళ్ళ పన్నాగం. ఒలింపిక్స్ టీమ్ లో లేకపోతే మార్కెట్లో వీళ్ళతో కోట్లు విలువ చేసే ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఆ అగ్రిమెంట్లను రద్దు చేసుకుంటాయి. దీని వల్ల వీరంతా కోట్లు నష్టపోవటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లేవు కాబట్టి రోడ్డున పడాల్సి వస్తుంది. ఇదే వీళ్ళ ఆందోళనకు కారణం అని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. బ్రిజ్ భూషణ్ నేర చరిత్ర ఉన్నవాడే అయినప్పటికీ అతడికి బలమైన రాజకీయ పలుకుబడితో పాటు మాఫియాతో బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్తారు. అయితే.. తన బలం మొత్తాన్ని తన రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగిస్తాడే తప్ప.. ఇలా లైంగిక వేధింపులకు పాల్పడే అవకాశాలు లేవని అతడి సన్నిహితులే వాదిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి దింపేసి మళ్ళీ ఒలింపిక్స్ లిస్టులో పేరు సంపాదించి తమ మార్కెట్ కాపాడుకోవాలన్నదే ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వాళ్ళ ఉద్దేశ్యమనీ.. నిజానికి బ్రిజ్ భూషణ్ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ ఎదుర్కోలేదనీ కొంత మంది వాదన.


రెజ్లర్ల పర్సనల్ అజెండాతో జరుగుతున్న ఆందోళన వల్ల ప్రతిపక్షాలకు ఓ అస్త్రం దొరికినట్టైంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళన బురదను ప్రధానమంత్రి మోడీతో పాటు బీజేపీకి అంటించాలని గట్టిగా ప్రయత్నించాయి. రైతు సంఘాల సమాఖ్య నాయకుడు రాకేష్ టికాయత్ తో పాటు మోడీ రెబల్స్ అంతా కలిసి విషయాన్ని పెద్దది చేసే ప్రయత్నాలు ఉధృతం చేశారు. దేశానికి ఒలింపిక్ పథకాలు సాధించిన క్రీడాకారులను భారత ప్రభుత్వం హింసకు గురి చేస్తోందంటూ ప్రపంచం ముందు భారతదేశ పరువు పోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన అమిత్ షా 2 రోజుల క్రితం ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి మొత్తానికి ఈ ఆందోళన పర్వం ముగిసేలా చేసినట్టు కనిపిస్తోంది. వీళ్ళకు అమిత్ షా సద్దిచెప్పాడో బుజ్జగించాడో హెచ్చరించాడో తెలియదు కానీ.. సాక్షి మలిక్ ఆందోళన విరమించి తన పని తాను చూసుకునేందుకు వెళ్ళిపోవటం ఊహించని పరిణామమే. తాను ఆందోళన విరమించలేదంటూ సాక్షి మలిక్ ట్విటర్ ద్వారా ప్రకటించినా.. ఇక ఆమె దీనికి దూరంగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. 40 రోజులుగా జరుగుతున్న ఆందోళనలో ఈ పరిణామం చోటు చేసుకోవటం ఊహించనిదే.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...