వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించటం లేదన్న తెలంగాణ ప్రభుత్వం లేఖతో ఒక్కసారిగా మళ్ళీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసిన వెంటనే.. గవర్నర్ తమిళిసై దీనిపై హైకోర్టులే పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. కరోనా ప్రభావం ఉన్నందున తెలంగాణలో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించటం లేదని చెప్పటాన్ని హైకోర్టు తోసిప్చుచ్చింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు ప్రజలను కూడా అనుమతించాలని చెప్పింది.
రాష్ట్రంలో కోవిడ్ ప్రభావం ఉన్నందున రిపబ్లిక్ డే నిర్వహించటం సాధ్యం కాదంటూ జనవరి 13న తెలంగాణ అడ్వొకేట్ జనరల్ తెలంగాణ గవర్నర్ కు లేఖ రాశారు. రాజ్ భవన్ లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ పై అసంతృప్తితో ఉన్న గవర్నర్ తమిలిసై సౌందర రాజన్ ఈ అంశంపై హైకోర్టులో పిల్ దాఖలు చేయటంతో.. హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఆంక్షలు ఎక్కడ ఉన్నాయి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. గణతంత్ర దినోత్సవం అనేది ముఖ్యమైన జాతీయ పండగ అనీ.. దీనిని ఘనంగా నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
