HomeNATIONAL NEWSభారత్ కీలక నిర్ణయం : "రా" చీఫ్ గా రవి సిన్హా

భారత్ కీలక నిర్ణయం : “రా” చీఫ్ గా రవి సిన్హా

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

భారత నిఘా విభాగం రీసెర్చ్ ఆండ్ అనాలసిస్ వింగ్(రా) అధిపతిగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. 1988 బ్యాచ్ కు చెందిన రవి సిన్హా చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన అధికారి. ప్రస్తుతం క్యాబినెట్ స్పెషల్ సెక్రెటరీ పదవి తో పాటు రా లోనే ఆపరేషన్స్ వింగ్ కు చీఫ్ గా రవి సిన్హా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రా చీఫ్ గా వ్యవహరిస్తున్న సుమంత్ కుమార్ గోయల్ జూన్ 30న రిటైర్ కాబోతున్నారు. అయితే.. గోయల్ ఇదివరకే రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆయన పదవీ కాలం 3 సార్లు పొడగించారు. ఈ సారి మాత్రం పదవీ కాలాన్ని పొడగించకుండా రా కు రవి సిన్హాను చీఫ్ గా నియమిస్తూ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రవి సిన్హా రా చీఫ్ గా రెండేళ్ళ పాటు పదవిలో ఉండనున్నారు. రెండు దశాబ్ధాలకు పైగా నిఘా విభాగంలో పని చేస్తున్నాడు రవి సిన్హా.

రా లో జరిగే ప్రతి చిన్న అంతర్గత విషయాలపైన రవి సిన్హాకు మంచి పట్టు ఉందని చెప్తారు. అంతర్గతంగా సున్నితమైన అంశాలపై ఎలా వ్యవహరించాలో రవి సిన్హాకు చాలా బాగా తెలుసని కూడా చెప్తారు. భారత సరిహద్దు దేశాల్లో జరిగే అంతర్గత విషయాలతో పాటు కశ్మీర్, ఈశాన్య భారత దేశ ప్రాంతాల్లో జరిగే రహస్య కార్యకలాపాల గురించి కూడా రవి వద్ద మంచి సమాచారం ఉంటుందట. రా కోసం రహస్యంగా వివిధ ఐడెంటిటీలతో విదేశాల్లో పని చేసే ఏజెంట్లు చాలా మంది ఉంటారు. వారికి సంబంధించిన విషయాలు కొన్ని సార్లు రా వద్ద కూడా ఉండవు. వారిని నియమించిన వారికి మాత్రమే అలాంటి విషయాలు తెలుస్తాయి. ఆ ఏజెంట్లు కూడా వాళ్ళు సేకరించిన సమాచారాన్ని వారిని నియమించిన వారికి మాత్రమే అందజేస్తారు. భారత్ కు కావాల్సిన రహస్య సమాచారాన్ని సేకరించటంలోనూ.. సమాచారాన్ని విశ్లేషించటంలోనూ మేధావులైన అధికారులకు మాత్రమే రా లో స్థానం ఉంటుంది. అయితే.. రవి సిన్హా గురించి ఎక్కడా పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. ప్రభుత్వం కూడా రవి సిన్హా గురించి చాలా వివరాలు గోప్యంగానే ఉంచింది.

ప్రతి దేశానికీ నిఘా వ్యవస్థ అనేది ఉంటుంది. అమెరికాకు సీఐఏ.. పాకిస్తాన్ కు ఐఎస్ఐ.. ఇజ్రాయెల్ కు మొస్సాద్.. రష్యాకు కేజీబీ.. ఇలానే భారత్ కు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్. ఈ నిఘా సంస్థలు పని చేసే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. అంతర్గత రహస్య సమాచారం కోసం ఈ నిఘా సంస్థలో పనిచేసే ఏజెంట్లు నిత్యం పనిచేస్తూనే ఉంటారు.. వారి పై అధికారులతో సమాచారాన్ని పంచుకోవటంతో పాటు.. కొన్ని సార్లు మిగతా దేశాల నిఘా సంస్థలతో కూడా కలిసి పనిచేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా బలమైన నిఘా వ్యవస్థగా ఇజ్రాయెల్ కు చెందిన మొసాద్ కు పేరుంది. అమెరికా, రష్యా నిఘా సంస్థలను కూడా మించిపోయిన మొసాద్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డ్రగ్, వెపన్ మాఫియాను కూడా కంట్రోల్ చేయగలిగేంత స్థాయిలో బలంగా ఉంది.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...