ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిన విషయం తెలిసిందే. నాటు నాటు పాటతో ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రతి సినిమా అభిమానికీ కనెక్ట్ అయ్యారు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్. ఆస్కార్ దెబ్బకు భారతదేశ సినీ పరిశ్రమపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. అయితే.. ఇదే సమయంలో భారత సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ మాత్రమే అంటూ అప్పటి దాకా ఉన్న పరిస్థితులను తెలుగు సినిమా బద్దలు కొట్టింది. కేవలం బాలీవుడ్ మాత్రమే ఇండియన్ సినిమాకు ఐకాన్ కాలేదనీ.. టాలీవుడ్ లోనూ సౌత్ ఇండియా లోనూ బాలీవుడ్ ను తలదన్నే కంటెంట్ ఉందనీ ఆర్ఆర్ఆర్ చాటి చెప్పింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండియా మొత్తం ఇదే అభిప్రాయానికి వచ్చిందని చెప్పటంలో సందేహం లేదు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ కావటం.. బాలీవుడ్ సినిమాలు బొక్క బోర్లా పడటంతో ఈ అభిప్రాయం మరింత బలపడింది. సరిగ్గా ఇక్కడే బాలీవుడ్ హీరోలు తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చారు. ఇది తెలుగు హీరోలకు మరింత ప్లస్ గా మారింది.
తాజాహా యంగ్ హీరో రామ్ చరణ్ కశ్మీర్ లో జరుగుతున్న జీ7 సమ్మిట్ లో పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. జపాన్ దేశపు ప్రతినిథితో పాటు భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేసి జీ7 వేదికపై మరోసారి ఆర్ఆర్ఆర్ ను గుర్తు చేశాడు రామ్ చరణ్. ఇప్పుడు ఇది బాలీవుడ్ పాలిట శాపంగా మారింది. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ కశ్మీర్ లో జీ7 సగస్సు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ చైనా దేశాల నుంచి అభ్యంతరాలు, హెచ్చరికలూ ఎదురైనా.. తీవ్రవాదుల దాడులు జరుగుతున్నా భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గటం లేదు. అలాంటి సందర్భంలో రామ్ చరణ్ ఈ వేదికపై కనిపించటం బాలీవుడ్ పై విమర్శలకు కారణమైంది. బాలీవుడ్ నుంచి ఒక్క స్టార్ హీరో కూడా కశ్మీర్ లో జరుగుతున్న జీ7 సదస్సులో కనిపించలేదు సరికదా.. కనీసం దీనిపై స్పందించలేదు కూడా. బాలీవుడ్ ఖాన్ త్రయం అయితే.. కశ్మీర్ పేరు చెప్తేనే దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటారే తప్ప కశ్మీర్ మరియు భారత్ కు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడే ధైర్యం చేయరు. ఎందుకంటే.. బహుశా వారికి భారత్ కంటే పాకిస్తాన్ మరియు ముస్లిం దేశాలే ముఖ్యం అయి ఉండవచ్చు.
కశ్మీర్ లో జీ7 సదస్సు విజయవంతం అయితే కశ్మీర్ ఎప్పుడో భారత్ లో అంతర్భాగమైందనీ.. ఇక భారత్ లో కశ్మీర్ సమస్య అనేది లేదనీ ప్రపంచం ముందు భారత్ బల్లగుద్ది చెప్పినట్టు అవుతుంది. ప్రధాని మోడీ… కశ్మీర్ లో అంతా భారత్ కంట్రోల్ లోనే ఉందని చాటి చెప్పటానికే ఈ సదస్సును కశ్మీర్ లో నిర్వహిస్తున్నామని ఎప్పుడో చెప్పారు. యధావిధిగా ఇది పాకిస్తాన్, చైనా దేశాలకు నచ్చదు. అంతే కాదు.. భారత్ పాక్ మధ్య కశ్మీర్ సమస్య పరిష్కారం కావటం చాలా ఇస్లామిక్ దేశాలకు కూడా నచ్చదు సరికదా అమెరికా, యూరప్ దేశాలకు కూడా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు సమస్య పరిష్కారం కావటం రుచించదు. భారత్ ఎప్పుడూ సరిహద్దు తీవ్రవాదంతో సతమతం అవుతూ ఉండాలనేది పైన చెప్పుకున్న దేశాల కోరిక. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. పాకిస్తాన్, చైనా హెచ్చరికలు పట్టించుకునే పరిస్థితి భారత్ లో లేదు. హద్దుదాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ భారత్ అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు తెగించి చెప్పేసింది కూడా. కశ్మీర్ లో ప్రస్తుతం అంతా కంట్రోల్ లోనే ఉందని చెప్పాలంటే దేశవ్యాప్తంగా వీఐపీలు కశ్మీర్ ను సందర్శించాలి.. అక్కడి నుంచి యావత్ ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వాలి. ఆ దిశగా యంగ్ హీరో రామ్ చరణ్ స్టెప్ తీసుకున్నాడు.. కశ్మీర్ లో అడుగుపెట్టి జీ7 సమ్మిట్ కు తన వంతు సహకారం అందజేశాడు. ప్రపంచంలో ఎక్కడా లేని లొకేషన్లు కశ్మీర్ లో ఉన్నాయనీ.. తను నటించే హాలీవుడ్ సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయాలని కండిషన్ పెడతాననీ వేదికపై చెప్పాడు రామ్ చరణ్. ఈ మాట కశ్మీర్ లో శాంతి భద్రతల విషయంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని మనం ఇక్కడ గమనించాలి. కానీ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అని చెప్పుకునే ఒక్కరు కూడా రామ్ చరణ్ లా కశ్మీర్ కు వచ్చే ధైర్యం చేయలేదు ఎందుకో మరి. రీసెంట్ గా పఠాన్ అంటూ దేశభక్తి సినిమా తీసి వెయ్యి కోట్ల వ్యాపారం తన ఖాతాలో వేసుకున్న షారూఖ్ ఖాన్.. కశ్మీర్ గురించి గానీ జీ7 సమ్మిట్ గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరికదా.. తనకేమీ సంబంధమే లేదనట్టు దూరంగా ఉన్నాడు. ఇదే ఇప్పుడు బాలీవుడ్ పై విమర్శలకు కారణమైంది. మొత్తానికి.. బాలీవుడ్ కు ఇండియన్ సినిమా అనేది ఓ వ్యాపారమే తప్ప దేశంపై ప్రేమ కాదు అనేది మరోసారి రుజువైంది. అంటే.. పఠాన్ సినిమాలో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ దేశభక్తి పఠాన్ వంటి సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే అన్నమాట.. ఇక ఇండియన్ ఆర్మీని కించపరుస్తూ అమీర్ ఖాన్ చేసిన లాల్ సింగ్ చడ్డా అనే ఎర్ర చెడ్డీ సినిమా కూడా వ్యాపారం కోసమే తప్ప దేశభక్తి కోసం కాదన్నమాట.. ఫైనల్ గా చెప్పాలంటే.. బాలీవుడ్ జనానికి దేశభక్తి సినిమా అనేది కేవలం వ్యాపారం మాత్రమే.. నిజం ఎప్పుడూ కానే కాదు.