మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ తర్వాత జూలై 7న గుజరాత్ హైకోర్టులో దీనిపై రాహుల్ పిటిషన్ దాఖలు చేయగా.. సూరత్ కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనిపై విచారించాల్సింది ఏమీ లేదంటూ పిటిషన్ ను కొట్టేసింది. దీనిపై ఇప్పుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ న్యాయవస్థపై తమకు నమ్మకం ఉందనీ.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి విధించబడిన శిక్షపై స్టే దొరుకుతుందనే నమ్మకం ఉందనీ వ్యాఖ్యానించాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించాడు. అయితే.. ఈ సారి రాహుల్ కు ఊరట లభించవచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది.
2019లో కర్ణాటక పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మోడీ అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళంతా దొంగలే అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించాడు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు దాఖలు చేశాడు. కేసును విచారించిన గుజరాత్ లోని సూరత్ మెజిస్ట్రేట్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. న్యాయమూర్తి హేమంత్ పి ప్రచ్ఛక్ రాహుల్ ముందే తీర్పు చదివి వినిపించి.. పై కోర్టుకు వెళ్ళటానికి నెల రోజుల గడువు ఇస్తూ జైలు శిక్షను నిలుపుదల చేశారు నెల రోజుల పాటు. మెజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ తాజాగా జూలై 7న రాహుల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. రాహుల్ వాదనతో పాటు నా వాదన కూడా వినాలంటూ పూర్ణేశ్ మోడీ కూడా పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు కనుక విచారణకు నిరాకరిస్తే.. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేయటానికి అర్హత కోల్పోతాడు.