HomeINTERNATIONAL NEWS"ప్రాజెక్ట్ చీతా" : ఆ పులులు చనిపోతాయని సౌతాఫ్రికాకు ముందే ఎలా తెలుసు ?

“ప్రాజెక్ట్ చీతా” : ఆ పులులు చనిపోతాయని సౌతాఫ్రికాకు ముందే ఎలా తెలుసు ?

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

కునో నేషనల్‌ పార్క్‌లో చీతాల మనుగడ సాధ్యమేనా అనేది.. ప్రాజెక్ట్‌ చీతాను కేంద్రం ప్రారంభించిన కొత్తలో చాలామంది మేధావులు వ్యక్తం వేసిన ప్రశ్న.కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును సవాల్‌గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా దాదాపు వంద కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. సౌతాఫ్రికా, నమీబియా నుంచి భారత్‌కు రప్పించిన 20 చీతాలను నెలల పాటు పర్యవేక్షించి.. కునోలోకి వదిలింది. కానీ, అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో.. నెల వ్యవధిలోనే రెండు చీతాలు కన్నుమూశాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన వాటిలో సాషా అనే ఆడ చీతా మార్చిలో కిడ్నీ వ్యాధితో మృతి చెందగా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిలో ఉదయ్ అనే మగ చీతా.. ఇటీవలే మృతిచెందింది. ఈ రెండు మరణాలు కేవలం నెలరోజుల గ్యాప్‌లోనే జరిగాయి. ఆ రెండూ ఇన్‌ఫెక్షన్‌లతోనే కన్నుమూశాయని అటవీ అధికారులు ప్రకటించారు. అయితే, ఈ పరిస్థితిపై సౌతాఫ్రికా అటవీ శాఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌ కునో నేషనల్‌ పార్క్‌లో చీతాల మృతిని ముందుగానే ఊహించామని ప్రకటించింది దక్షిణాఫ్రికా. ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టినప్పుడు మరణాల రేటు ఉంటుందని మేం గతంలోనే అంచనా వేశామని దక్షిణాఫ్రికా అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ వివరించింది. పెద్ద మాంసాహార జంతువులను ఒకచోటు నుంచి మరొక చోటుకు తరలించి వాటిని జాగ్రత్తగా చూసుకోవడమనేది సహజంగానే చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొంది. ప్రస్తుతం క్లిష్టమైన దశ సాగుతుందని.. చీతాలకు గాయాలు, మరణాలు, ప్రమాదాలు.. ఇవన్నీ ప్రాజెక్టులో భాగమే అని తెలిపింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతలన్నీ పెద్ద ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయి. ప్రతి రోజూ రెండుసార్లైనా వాటిని నిశితంగా పరిశీలించాలి. వాటి ప్రవర్తన, కదలికలు, శరీర స్థితిని దూరం నుంచి అంచనా వేయాలి. ఇలా చేయడం వల్ల చిరుతల ఆరోగ్య పరిస్థితి గురించి అంచనాకు రాగలం అని వివరించింది.
దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతలన్నీ పెద్ద ఎన్‌క్లోజర్‌లలో ఉన్నాయి. ప్రతిరోజూ రెండుసార్లు వాటిని నిశితంగా పరిశీలిస్తారు. అవి అడవి చిరుతలు కాబట్టి, వాటి ప్రవర్తన, కదలికలు, శరీర స్థితిని దూరం నుండి అంచనా వేయాల్సి ఉంటుందని సౌతాఫ్రికా చెబుతోంది. కూనో లాంటి పెద్ద ఫారెస్ట్‌లో వాటిని మానిటర్ చేయడం కష్టమైన పనిగా అభివర్ణించింది. ఇదే సమయంలో చీతాల మరణాలు మరింత పెరిగే ప్రమాదం కూడా ఉందని అంచనా వేసింది. సౌతాఫ్రికా నుంచి ఇలాంటి రియాక్షన్ వచ్చిన తర్వాత చీతాల మనుగడపై పలు విశ్వేషణలు తెరపైకి వస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ 2014 నుంచి బందీలో ఉన్న 19వందల 67 చీతాలపై చేసిన పరిశోధనలో చీతాలు అంతరించిపోడానికి కారణం మూత్రపిండాల వైఫల్యమే అని తేలింది. బోనులో లేదా నియంత్రిత వాతావరణంలో నివసించే చీతాలు అధిక ఒత్తిడికి గురవుతాయని, అది వాటి మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందని పరిశోధన నిర్ధారించింది. దీంతో కూనో నేషనల్ పార్క్‌లో ఉండే చీతాలు ఎంతవరకూ సేఫ్ అనే చర్చ మొదలైంది.
ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలు మన వాతావరణానికి అలవాటు పడేందుకు కునో నేషనల్ పార్క్‌లో వదిలే ముందు నెలరోజులపాటు క్వారంటైన్‌ జోన్‌లో ఉంచారు. తదుపరి దశలో ఈ చీతాలను క్వారంటీన్ జోన్ వెలుపల నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తిరిగేలా వదిలారు. తద్వారా అవి అడవి జంతువులు, వేట మొదలైన వాటికి అలవాటు పడతాయి. ఇక..
కునో నేషనల్ పార్క్ అటవీ అధికారుల అధ్యయనం ప్రకారం ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోతున్నాయని తెలుస్తోంది. పైగా ఇక్కడి పార్కు చుట్టూ సమీపంలో గ్రామాలు ఉండటంతో చీతాలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాయి. దీనివల్ల అవి తరచూ సమీప గ్రామాల్లోకి వెళ్తున్నాయి. వాటిని పట్టుకోవడం అటవీ అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఇతర జంతువులతో కూడా అవి త్వరగా కలిసిపోలేకపోతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఎండలు మండిపోతుండడం కూడా చీతాల మరణానికి కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే పులి జాతికి చెందిన జంతువుల్లో అనూహ్య మార్పులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అవి ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఆఫ్రికా వాతావరణానికి భిన్నంగా మధ్యప్రదేశ్ వాతావరణం ఉండటంతో చీతాలు మనలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7వేల చీతాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానాలో ఉన్నాయి. 1950లలో చీతా అంతరించిపోయినట్లు భారత్ ప్రకటించింది. ఆ సమయంలో దేశంలో ఒక్క చీతా కూడా లేదు. ఇంత పెద్ద మాంసాహార జంతువును ఒక ఖండం నుంచి మరో ఖండం అడవుల్లోకి తీసుకురావడం ఇదే తొలిసారి. మరి మిగిలిన చీతాలయినా ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రాణాలతో బయటపడతాయేమో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...