ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనవరిలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 19న హైదరాబాద్ రానున్న మోడీ.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్నారు. అంతే కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించటంతో పాటు కాజీపేట రైల్వే కోచ్ ఓవరాలింగ్ వర్క్ షాప్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన పూర్తి వివరాలను కేంద్రం విడుదల చేసింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తుంది. కేవలం 4 గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు.
ఇక రాజకీయ కోణంలో చూస్తే.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంతో ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉంది వాతావరణం. ప్రధాని పర్యటనను తెలంగాణ బీజేపీ క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. మరో పది రోజుల్లో ప్రధాని పర్యటన ఉండగా.. ఇందుకు బీజేపీ నేతలు సన్నాహాలు మొదలు పెట్టేశారు.