అవార్డులు రికార్డులతో మోత మోగిస్తున్న తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్.. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. సినిమా రంగంలో గోల్డెన్ గ్లోబ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాంటి అవార్డును దక్కించుకొని భారత సినిమా ఘనతను ప్రపంచానికి చాటిచెప్పిన ఆర్ఆర్ఆర్ టీమ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం చాలా గొప్పది. మీ సినిమాతో ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారు. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, ఎన్టీఆర్, రామ్ చరణ్, కాలభైరవ ఇతర సినిమా యూనిట్ కు నా అభినందనలు. అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియన్ సినిమా తరఫున ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. కన్నడ సినిమా కాంతారతో పాటు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో ఉంది.