HomeINTERNATIONAL NEWSపుతిన్ ను కలిసిన ప్రిగోజిన్ : తిరుగుబాటుపై కాంప్రమైజ్

పుతిన్ ను కలిసిన ప్రిగోజిన్ : తిరుగుబాటుపై కాంప్రమైజ్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

రష్యా సైన్యానికీ, పుతిన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన రష్యన్ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్.. ఎట్టకేలకు తన తిరుగుబాటు చర్యను ఉపసంహరించుకున్నట్టు రష్యా ప్రకటించింది. రష్యా అధికార ప్రతినితి దిమిత్రి పెస్కోవ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. జూన్ 29న పుతిన్, ప్రిగోజిన్ కలిసి చర్చించుకున్నారనీ.. పుతిన్ కోసం యుద్ధం చేయటానికి ప్రిగోజిన్ సైన్యం సిద్ధంగా ఉన్నదన్న విషయాన్ని ప్రిగోజిన్ చెప్పాడనీ పెస్కోవ్ పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య ఎలాంటి శతృత్వం ఇప్పుడు లేదనీ.. ఉక్రెయిన్ పై పోరాడేందుకు వాగ్నర్ సైనికులు సిద్ధంగానే ఉన్నారనీ చెప్పడు. మేం ఎప్పుడూ రష్యా సైనికులమే.. రష్యా కోసం ప్రాణాలిచ్చేందుకు మేం సిద్ధం.. ఉక్రెయిన్ తో పోరాడేందుకు కూడా మేం సిద్ధం అని పుతిన్ ముందు ప్రిగోజిన్ చెప్పాడని వెల్లడించారు. దీంతో రష్యాలో నెలకొన్న అంతర్యుద్ధం ముగిసినట్టే.

సుమారు 5 వందల రోజుల క్రితం ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టగా.. ఈ యుద్ధం మొదలైన కొద్ది రోజులకే రష్యా సైన్యానికి తోడుగా వాగ్నర్ గ్రూప్ రంగంలోకి దిగింది. అత్యంత శక్తివంతమైన మరియు క్రూరమైన సైనికుల గ్రూప్ గా వాగ్నర్ కు పేరుంది. క్రూరమైన నేరాలు చేసిన వాళ్ళను జైళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చి వారికి సైనిక శిక్షణ ఇచ్చి మరింత క్రూరంగా తయారు చేసి వాళ్ళతో వాగ్నర్ గ్రూప్ ను తయారు చేశారని చెప్పుకుంటారు. రష్యాతో పాటు మరి కొన్ని దేశాల్లో వాగ్నర్ గ్రూప్ సైనికులు ఉన్నారు. పుతిన్ చెప్పిన పనిని అత్యంత రహస్యంగా పూర్తి చేసి పెట్టి పుతిన్ కు గానీ పుతిన్ ప్రభుత్వానికి గానీ ఏరకమైన మచ్చ రానివ్వకుండా నేరం తమపై వేసుకొని పనిచేస్తారు ఈ సైనికులు.

కొద్ది రోజుల క్రితం రష్యాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు ఈ వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్. ఉక్రెయిన్ మరియు ఉక్రెయిన్ మద్దతు దేశాలకు ఇది శుభవార్తగా అనిపించింది.. కానీ అంతలోనే బెలారస్ దేశ అధ్యక్షుడు లుకషెంకో ప్రిగోజిన్ ను బుజ్జగించి తిరుగుబాటు ఉపసంహరించేలా చేశాడు. ప్రిగోజిన్ లేదా పుతిన్ ఎవరో ఒక్కరే ప్రాణాలతో ఉంటారు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యాఖ్యానించగా.. అమెరికా ఇంటలిజెన్స్ కూడా పుతిన్ ను ప్రిగోజిన్ చంపేస్తాడు లేదా అధ్యక్ష పదవి నుంచి దించేస్తాడని అంచనా వేసింది. కానీ ప్రిగోజిన్ మరియు వాగ్నర్ సైన్యాన్ని కట్టడి చేయటంలో పుతిన్ విజయవంతమయ్యాడు.

FOLLOW US

More like this