తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలన్న రెజ్లర్లకు ఊహించని విధంగా మద్దతు పెరుగుతోంది. తమ మెడల్స్ ను గంగలో కలిపేస్తామంటూ వెళ్ళిన రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీరికి మద్దతుగా ఛత్తీస్ ఘడ్ లో నక్సల్స్ పోస్టర్లు వెలిశాయి. వెంటనే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలంటూ నక్సల్స్ పోస్టర్ల ద్వారా డిమాండ్ చేస్తున్నారు. నక్సల్స్ పోస్టర్లు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. అటు ఢిల్లీలో కూడా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి శాంతించిన రెజ్లర్లు.. కేంద్ర ప్రభుత్వానికి 5 రోజుల గడువు ఇచ్చారు బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయటానికి. అప్పటికీ అరెస్టు చేయని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేయటంతో పాటు తాము సాధించిన ఒలింపిక్ మెడల్స్ ను గంగలో కలిపేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై 2 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కానీ.. ఇప్పటి వరకూ రెజ్లర్ల ఆరోపణలు బలపరిచే విధంగా ఒక్క సాక్ష్యం కూడా తమకు లభించలేదనీ.. కనీసం సాక్ష్యాలను బ్రిజ్ భూషణ్ నాశనం చేసేందుకు ప్రయత్నించినట్టు కూడా ఎక్కడా ఆధారాలు లభించలేదనీ పోలీసులు కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్ కూడా మొదటి నుంచీ ఒక్కటే మాట చెప్తున్నాడు. ఎవరైతే తనపై ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తనపై కేసు ఫైల్ చేయించి విచారణ చేయించాలనీ.. తమ వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు పోలీసులకు అప్పగించాలనీ బ్రిజ్ భూషణ్ చెప్తున్నాడు. తాను నేరం చేసినట్టు నిరూపణ అయితే తానే స్వయంగా ఉరి వేసుకుంటానంటూ చాలెంజ్ చేస్తున్నాడు బ్రిజ్ భూషణ్.
2015 లో టర్కీ పర్యటనకి వెళ్ళినప్పుడు మహిళా రెజ్లార్ల మీద లైగింక దాడి జరిగిందని అది కూడా బ్రిజ్ భూషణ్ చేశాడు అని ఆరోపిస్తున్నారు రేజ్లర్లు. కానీ 2015 లో బ్రీజ్ భూషణ్ టర్కీ వెళ్ళలేదు అని అతని పాస్పోర్ట్ లో ఎలాంటి స్టాంపింగ్ లేదు అని ఇమ్మిగ్రేషన్ శాఖ చెప్తున్నది. ఒక వేళ బ్రిజ్ భూషణ్ కనుక టర్కీ వెళ్లి ఉంటే అతని పాస్పోర్ట్ లో ఎంట్రీ స్టాంప్ ఉండాలి.. కానీ అలాంటిది ఏమీ లేదు. ఢిల్లీ పోలీసులు విచారణ లో బ్రిజ్ భూషణ్ 2015 లొ టర్కీ వెళ్ళలేదు అని అధికారిక రికార్డ్ ని సేకరించారు. 2016 లో మంగోలియా దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు బ్రిజ్ భూషణ్ మమ్మల్ని లైంగికంగా వేధించాడు అని ఫిర్యాదు చేశారు మహిళా రేజ్లార్లు కానీ 2016 లో బ్రిజ్ భూషణ్ మంగోలియా వెళ్ళలేదు మరియు ఆతని పాస్పోర్ట్ లో ఎలాంటి ఎంట్రీ లేదు .ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి ‘ మేరీ కోమ్ ‘ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విచారణ కమిటీ 2016 లో బ్రిజ్ భూషణ్ మంగోలియా పర్యటనకి వెళ్ళలేదు అని తేల్చి చెప్పింది. రెజ్లర్లు బలమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ వారి ఆరోపణలకు బలం చేకూర్చే ఒక్క ఆధారం కూడా లేకపోవటం గమనార్హం.