HomeAP NEWSఏపీలో పీక్స్ కు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఫైట్

ఏపీలో పీక్స్ కు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఫైట్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కొత్తేం కాదు. ఈ అంశంపై స్టేట్ అయినా సెంట్రల్ అయినా అధికార పార్టీపై విపక్షాలు ఆరోపణలు కూడా సర్వసాధారణం. గతంలో పెగాసస్ ఎపిసోడ్‌ కేంద్రంలోనూ, ఏపీ లోనూ పెను ప్రకంపనలే సృష్టించింది. కట్‌చేస్తే.. ఇప్పుడు ఏపీలో మరోసారి అదే ట్యాపింగ్ పంచాయితీ రచ్చ రచ్చ చేసేస్తోంది. ఇందుకు కారణం అధికార పార్టీపై సొంత నేతల ఎదురుదాడే. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కోటంరెడ్డి, ఆనం తమపై ఫోన్ ట్యాపింగ్ జరిగిందనీ, అదికూడా జగన్ సర్కారే చేయించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడే స్టేట్ పాలిటిక్స్‌ షేక్ అవ్వడం మొదలైంది. ఐతే, ఈ ఆరోపణలను అధికార పార్టీ కొట్టిపారేసింది. కాకపోతే ఇదే సమయంలో రెబల్ నేతలపై విమర్శలు చేసింది. ఇక్కడే సీన్ మరో లెవెల్‌కు చేరింది.
తాను చేసిన ట్యాపింగ్ ఆరోపణలపై వైసీపీ విమర్శలకు కోటంరెడ్డి ఇచ్చిన కౌంటర్లే ఇవి. “ఎప్పుడొస్తారో రండి.. ఎన్ని కేసులు పెడతారో డిసైడ్ చేసుకోండి” అంటూ ట్యాపింగ్ ఆరోపణలకు మించి అధిష్టానంపైనా, తనను విమర్శించిన నేతలపైనా విరుచుకుపడిపోయారు. ట్యాపింగ్ ఆరోపణలతోనే ఆగిపోననీ, పార్టీని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. తన గొంతును ఆపాలనుకుంటే ఎన్‌కౌంటర్ చేయడం ఒక్కటే ఆప్షన్ అంటూ చెలరేగిపోయారు. అయితే, కోటంరెడ్డి ఈ రేంజ్‌లో చెలరేగిపోయిన తర్వాత వైసీపీ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది? ఆ వెంటనే కాకాణి రంగంలోకి దిగారు. వస్తూ వస్తూనే కోటంరెడ్డిపై కౌంటర్లు షురూ చేశారు. కోటరెడ్డిపై జరిగింది ఫోన్ ట్యాపింగ్‌ కాదు.. ముమ్మాటికీ మ్యాన్ ట్యాపింగే అంటూ పరోక్షంగా టీడీపీ టార్గెట్ చేశారు.
నిజానికి.. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను టీడీపీలో చేరడానికి చేస్తున్న ఆరోపణలుగానే వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. కోటంరెడిని చంద్రబాబు పావులా వాడుకుంటున్నారని, ఆయన భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారని, బాబు ఉచ్చులో కోటంరెడ్డి పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే అది ఫోన్ ట్యాపింగ్ కాదు, మ్యాన్ ట్యాపింగ్ అనే వాదన వినిపిస్తున్నారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వైసీపీ సర్కార్‌ ఎలా ముందుకెళ్లబోతోందనే చర్చపైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి కాకాణి. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రభుత్వం చెబుతోందనీ, జరగని దాన్ని జరిగినట్టు చెపుతుంటే, దానిపై విచారణ ఏముంటుందని అన్నారు. ఆధారాలుంటే కోటంరెడ్డే వాటిని కేంద్రానికి పంపించాలన్నారు. లేదంటే కోర్టుకైనా వెళ్లొచ్చనీ.. కోర్టుకి వెళ్తే అది ట్యాపింగా, రికార్డింగా అనేది తేలిపోతుందన్నారు. తన కామెంట్లతో పరోక్షంగా టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు.
మరోవైపు.. వైసీపీలో రెబల్ రచ్చను టీడీపీ ఇంకోలా విశ్లేషిస్తోంది. వైసీపీలో అసమ్మతివాదులు బాగా పెరిగిపోయారని వారంతా ఏకమై ప్రభుత్వాన్ని కూల్చటం ఖాయమంటోంది. ప్రతీ జిల్లాలోను ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్‌పై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని దానికి ప్రత్యక్ష ఉదాహరణే కోటంరెడ్డి, ఆనం వంటి నేతల వ్యతిరేకత గళాలని చెబుతోంది. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదని సాక్షాత్తు కోటంరెడ్డి చెప్పిన మాటలేనని ఆ పార్టీ నేత ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. 35మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీలో ఇమడలేకపోతున్నారని పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కోటంరెడ్డి అన్న వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లాలో రాజుకున్న ఈ నిరసన సెగలు ప్రతీ జిల్లాకు పాకుతాయని నెల్లూరు నుంచి కృష్ణాజిల్లాకు నిరసనలు పాకాయని.. ఇక అసహనంతో ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా బయటపడతారంటున్నారు. సరే.. ప్రతిపక్ష నేత కాబట్టి పత్తిపాటి ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పటికీ.. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇందుకు కారణం నెల్లూరు వైసీపీకి పెట్టనికోట కావడమే.
2014 ఎన్నికల నుంచీ నెల్లూరుపై వైసీపీ చెరగని ముద్ర వేసింది. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలిన 2 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. దీంతో వైసీపీ కంచుకోటగా నెల్లూరు జిల్లా ఆవిర్భవించింది. అదే ఊపును 2019 ఎన్నికల్లో 10సీట్లను కైవసం చేసుకొని నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. దీంతో మళ్లీ బలమైన కంచుకోటగా నెల్లూరు మారింది. అలాంటి కంచుకోటలో ఆనం, కోటంరెడ్డి లాంటి నేతలు రెబల్స్‌గా మారడం అధికార పార్టీపై ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన నేతలపై ఎదురుదాడికి దిగడం కూడా నెగిటివ్ అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల ప్రకంపనలు మాత్రం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...