HomeINTERNATIONAL NEWSపాకిస్తాన్ ప్రజల నెత్తిన మరో పిడుగు

పాకిస్తాన్ ప్రజల నెత్తిన మరో పిడుగు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ఏ దేశంలో అయినా రాజకీయాలు ఎలా ఉండకూడదో పాకిస్తాన్‌ను చూసి అర్ధం చేసుకోవచ్చు. ఆ దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజల ఆకలి తీర్చలేని పరిస్థితికి ప్రభుత్వం చేరిపోయింది. కానీ, ఇవేవీ అక్కడి రాజకీయాలను ప్రభావితం చేయడంలేదు. అధికారంలో ఎవరున్నా ఇప్పటికిప్పుడు పాక్ ప్రజల కష్టాలు, కన్నీళ్లు తీరే సీన్ ఎలాగో లేదనుకున్నారో ఏమోకానీ.. అక్కడి పాలకులు అగ్రరాజ్యాల్లో కూడా కనిపించని రాజకీయాన్ని నెరపుతున్నారు. అప్పట్లో షెహబాజ్ షరీఫ్ అండ్ కో ఇమ్రాన్‌ సర్కార్‌ను అర్ధాంతరంగా గద్దె దించేస్తే.. ఇప్పుడేమో వచ్చే ఎన్నికల్లో షరీఫ్ సర్కార్‌ను సాగనంపేందుకు పీటీఐ అధినేత ఇమ్రాన్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార, విపక్షాలు దేశాన్నీ, పాక్ ప్రజలను కష్టాలనుంచి ఎలా గట్టెక్కించాలనే దానిపై కలిసి పనిచేయాలి. అలా జరిగితే అది పాక్ రాజకీయం ఎలా అవుతుంది? అందుకే జనం ఎలాపోతే ఏంటి, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. అన్నట్టుగా అక్కడి పాలకుల వైఖరి కనిపిస్తోంది.
నిజానికి.. పాకిస్తాన్ ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్ట్‌తో ముగుస్తుంది. అప్పటి నుంచి 90 రోజుల్లోగా సార్వత్రిక ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది. ఆ గడువుకు ముందే ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మిగతా పీటీఐ సభ్యుల రాజీనామాలను కూడా అంగీకరిస్తే.. జాతీయ అసెంబ్లీ నుంచి ఇమ్రాన్ ఖాన్‌ పార్టీ పూర్తిగా వైదొలిగినట్లవుతుంది. నిజానికి.. ఇమ్రాన్‌ ఖాన్‌ ఇలా ఒకేసారి ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అక్టోబరులో జరిగిన జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ 7 స్థానాల్లో పోటీ చేసి ఆరు చోట్ల విజయం సాధించారు. ఇదేం లెక్క అనుకోకండి ఎందుకంటే పాకిస్థాన్‌ ఎన్నికల్లో ఒక వ్యక్తి ఎన్ని చోట్ల నుంచైనా పోటీ చేయవచ్చు. ఐతే, ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే మాత్రం మనలాగే ఏ స్థానాలను వదులుకుంటారో ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇమ్రాన్‌ఖాన్ చేస్తానంటోంది కూడా అదే. ఐతే, ఆగస్ట్‌ నెలతో అసెంబ్లీ గడువు ముగిసే వేళ.. ఉపఎన్నికలు నిర్వహించడం ఒకెత్తయితే.. వాటన్నింటిలో ఇమ్రాన్ ఒక్కరే పోటీ చేయాలని డిసైడ్ అవ్వడం మరో ఎత్తు. ఆర్ధిక సంక్షోభ పరిస్థితుల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్న ఈ ఉప ఎన్నికలు అవసరమా అధ్యక్షా? అనేది కోట్లాది మంది పాకిస్తానీయుల ప్రశ్న.
మార్చి 16న జరిగే ఉప ఎన్నికల స్థానాలు తమ పార్టీ సిట్టింగ్‌వే కావడంతో తన గెలుపు సులభమని ఇమ్రాన్ ఖాన్ అంచనా. అన్నిచోట్లా తానే గెలిచి రాజకీయ సంక్షోభానికి తెరతీసి ముందస్తు ఎన్నికలు జరిగేలా ఒత్తిడి తీసుకురావాలన్నది ఇమ్రాన్ ఖాన్ ఎత్తుగడ. కానీ, అసలు చిక్కంతా ఇక్కడే ఉంది. ఇమ్రాన్‌ ఖాన్ అన్ని సీట్లలోనూ గెలిచి రాజకీయ సంక్షోభానికి దారి తీస్తే నష్టపోయేది మళ్లీ కోట్లాది పాకిస్తానీలే. అసలే ఆర్ధిక పతనంలో ఉన్న పాకిస్తాన్‌కు రాజకీయంగా కూడా స్థిరత్వం లేకపోతే ఇప్పుడున్న షెహబాజ్ షరీఫ్ సర్కార్‌ సైతం చేతులెస్తేయాల్సిందే. దేశాన్ని గట్టెక్కించడానికి ఐఎంఎఫ్‌ లాంటి సంస్థల సాయాన్నే కోరాలో.. లేక రాజకీయంగా ఇమ్రాన్‌ఖాన్‌తో తలపడాలో తెలీక దేశాన్ని గాలికొదిలేసే పరిస్థితే తలెత్తుతుంది. ఇప్పుడేదో దేశాన్ని ఆర్ధికంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కాదు. కానీ, ఆ కొద్దిపాటి ప్రయత్నాలు కూడా రాజకీయ సంక్షోభంతో చేయలేరనేది జగమెరిన సత్యం. ఈ చిన్న లాజిక్‌‌ ఇమ్రాన్ ఖాన్ ఎలా మిస్ అవుతున్నారో అర్ధం కావట్లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే ఇమ్రాన్‌ తీసుకున్న నిర్ణయంలో పక్కా రివేంజ్ పొలిటికల్ స్ట్రాటజీనే తప్ప మరో అంశం లేదంటున్నారు.
పాకిస్తాన్ ఆర్ధిక మంత్రి అంతా దైవాదీనం అంటారు.. విదేశాంగ మంత్రేమో ప్రజల కష్టాలు పక్కనపెట్టి డాన్సులేస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు.. ప్రధానమంత్రి గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చాం అంటూ భవిష్యత్ గురించి పట్టించుకోరు.. ప్రతిపక్ష నేత అధికార పార్టీపై రివేంజ్‌ స్ట్రాటజీలు ప్లాన్ చేస్తారు. ఇలా డర్టీ పాలిటిక్స్‌ ఎలా చేయాలో అన్ని సూత్రాలు వారికి తెలుసు కానీ.. దేశాన్ని కష్టాలసుడిగుండం నుంచి బయటపడేసే ఆలోచన మాత్రం ఎవ్వరూ చేయరు. సింపుల్‌గా సింగిల్‌ లైన్‌లో చెప్పాలంటే పాకిస్తాన్ పాలకులు దేశాన్ని గట్టెక్కించడం ఏమో కానీ దివాలాకు దగ్గర చేయడంలో మాత్రం పక్కా పొలిటికల్ స్ట్రాటజీ అమలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఒక్కమాటలో ఇలాంటి పాలకులు ఉన్నంత కాలం పాకిస్తాన్ పరిస్థితి ఇంతే.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...