HomeINTERNATIONAL NEWSభారత్ పై అణుబాంబు వేయటానికి సిద్ధమైన పాకిస్తాన్

భారత్ పై అణుబాంబు వేయటానికి సిద్ధమైన పాకిస్తాన్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

2019 పుల్వామా టెర్రర్ అటాక్ తర్వాత గుంటనక్కలాంటి పాకిస్తాన్ చావుతెలివితేటలు వాడిందట. భారత్‌పై ఏకంగా అణ్వస్త్రాన్నే గురి పెట్టిందట. ఈ విషయాన్ని అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో తన పుస్తకంలో పేరాలు పేరాలు రాశారు. ఐతే, పాకిస్తాన్‌కు భారత్‌పై అణ్వస్త్రాన్ని గురిపెట్టేంత ధైర్యముందా? పాక్ నిజంగా ఆ పని చేస్తే మన ఆర్మీ మాత్రం ఎందుకూరుకుంటుంది? ఇండియా దగ్గరున్న అణ్వస్త్రాలు పాకిస్తాన్‌పై విరుచుకుపడవా? ఇలా లెక్కకుమించిన ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఐతే, అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో రాసిన ఆత్మకథలో అసలేముంది? భారత్‌-పాకిస్తాన్ అణు యుద్ధాన్ని తామే ఆపామన్న వాదనల్లో నిజమెంత?
సర్జికల్ స్ట్రైక్స్‌.. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీటిపై ఆధారాలేవంటూ చేసిన వ్యాఖ్యలతో దేశ రాజకీయం మొత్తం ఈ అంశంపైనే నడిచింది. సరే ఆ వివాదానికి రాహుల్ ముగింపు పలికారనుకుంటే.. ఇప్పుడు అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో మరో కొత్త వాదన తెరపైకి తెచ్చారు. తన ఆత్మకథలో ఏకంగా భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్నే ఆపేశామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సర్జికల్ స్ట్రైక్స్ అంశం మరోసారి మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారిపోయింది. అయితే, అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రాసిన పుస్తకంలోని అన్ని అంశాలూ నిజమేనా? సర్జికల్ దాడుల తర్వాత పాకిస్తాన్‌ భారత్‌పై అణ్వస్త్రాన్ని గురిపెట్టిందా? లేదంటే తన పుస్తకం నెవర్ గివ్ ఏ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్ సేల్స్‌ పెంచుకునేందుకే స్ట్రాటజీనే మైక్ పాంపియో ఫాలో అయ్యారా? భారత్‌పై పాకిస్తాన్ అణు కుట్ర అంశంలో ఇంకా చాలానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాటన్నింటికీ సమాధానాలు వెతికేముందు. మైక్ పాంపియో తన పుస్తకంలో ఏం రాశారో తెలుసుకోవాలి.
మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్, సీఐఏ చీఫ్‌గా పనిచేసిన మైక్ పాంపియో తాజాగా ‘నెవర్ గివ్ ఏ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. వరల్డ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఈ పుస్తకం ఓ సంచలనంగా మారింది. ఇందుకు కారణం ఈ పుస్తకంలో పాంపియో రాసుకొచ్చిన అంశాలే. వాటిలో ఫస్ట్ ప్లేస్ భారత్, పాకిస్తాన్ న్యూక్లియర్ వార్‌ది. భారత్-పాక్ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితులు వచ్చినప్పుడు అమెరికా అడ్డుకుందని మైక్ పాంపియో తన పుస్తకంలో తెలిపారు. 2019లో పాకిస్థాన్ భారత్‌పై అణు దాడి చేసేందుకు సిద్ధమైందనీ, అమెరికా జోక్యం వల్ల ఆగిపోయిందని పేర్కొన్నారు. నిజానికి 2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్ తీవ్రవాదులు పుల్వామాలో భారత జవాన్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేశారు. ఆ ఘటనలో 40మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి బదులుగానే ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ రంగంలోకి దిగింది. పాక్ భూభాగంలోని బాలకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఎంతో మంది ముష్కరులను మట్టుబెట్టింది. ఇది జరిగిన తర్వాతే పాకిస్తాన్‌ మన దేశంపై అణ్వస్త్రాన్ని గురిపెట్టిందని పాపింయో తన పుస్తకంలో ప్రస్తావించారు.
సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాక్ భారత్‌పై అణు యుద్ధానికి సిద్ధమవుతోందని, బదులు చెప్పేందుకు తాము కూడా సన్నద్ధం అవుతున్నామని అప్పటి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తనతో చెప్పినట్లు పాంపియో పుస్తకంలో తెలిపారు. ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ మధ్య సమావేశం కోసం హనోయిలో ఉన్నప్పుడు భారత్, పాక్ మధ్య నెలకొన్ని అత్యంత ఉద్రిక్తత పరిస్థితుల గురించి తనకు తెలిసిందని పాంపియో చెప్పారు. భారత్‌పై న్యూక్లియర్ దాడికి పాక్ సిద్ధపడిందని, దానికి బదులుగా అంతకు మించిన దాడికి సిద్ధంగా ఉన్నామని భారత ఉన్నత అధికారి ఒకరు తనకు చెప్పారని పాంపియో వెల్లడించారు. జాతీయ భద్రతా సలహాదారులు, దౌత్యవేత్తలు, ఉన్నత అధికారులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తాను నాయకత్వం వహించానని పాంపియో తన పుస్తకంలో వెల్లడించారు. ఈ విషయంపై పాక్ లీడర్, ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వాతో తాను చర్చించినట్లు పాంపియో తెలిపారు. అయితే అది నిజం కాదని బాజ్వా చెప్పారని, భారతే తమపై దాడికి అణ్వాయుధాలను మోహ రిస్తున్నారని తాము అనుకుంటున్నట్లు బాజ్వా తనతో చెప్పినట్లు పాంపియో వెల్లడించారు. భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తగ్గించడానికి కొన్ని గంటల సమయం పట్టిందన్నారు పాంపియో. అణు దాడికి దిగొద్దని రెండు పక్షాలను ఒప్పించినట్లు తన పుస్తకంలో చెప్పారు. సింపుల్‌గా సింగిల్ లైన్‌లో చెప్పాలంటే తన చొరవతోనే భారత్, పాక్ మధ్య అణు యుద్ధం జరగకుండా ఆగిపోయిందని చెప్పారు.
ఇంతవరకూ బాగానే ఉంది. మైక్ పాంపియో చెప్పినట్టు ప్రపంచం ముందు తనకు జరిగిన అవమానంతో పాకిస్తాన్ అణు కుట్రలు చేసిందే అనుకుందాం. కానీ, భారత్ దగ్గర అణు సత్తా లేదా? పాక్ దాడి చేస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? అప్పటి ఇమ్రాన్ సర్కార్ మనపై ఒక్క బాంబు విసిరితే.. వరల్డ్‌ మ్యాప్ నుంచి ఆ దేశాన్ని తుడిచేసేంత సత్తా మన ఆర్మీకి లేదా? ఇవన్నీ పాకిస్తాన్, దాని ఆర్మీకి తెలియవా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక్కడే మైక్ పాంపియో చెప్పిన అంశాలు సింక్ అవ్వడం లేదు. నిజానికి.. అగ్రరాజ్యం అమెరికాకు యుద్ధాలను పనికట్టుకుని కెలకడమే తప్ప ఆపే అలవాటు లేదు. ప్రస్తుత ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్నే తీసుకుంటే మొదట్లోనే ఇరు దేశాలను కాంప్రమైజ్ చేసే అవకాశం ఉండి కూడా పెంటగాన్ ఆ దిశగా అడుగులేయలేదు. ఇదే సమయంలో.. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటిస్తూ వాంటెడ్‌గానే సుదీర్ఘ యుద్ధానికి కారణమైంది. ఇంత సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్, రష్యాలకంటే అమెరికానే ఎక్కువగా మాట్లాడింది. తమది అగ్రరాజ్యం అని గొప్పలుపోడానికి చేసే పిచ్చి ప్రయత్నాలే తప్ప.. యుద్ధాన్ని నిలువరించడానికి ఇప్పటికీ ఆ దేశం చేసిన ప్రయత్నాలు నిల్. అలాంటి అమెరికా భారత్, పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నిలువరించిందంటే నమ్మడం కాస్త కష్టంగానే ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నిజానికి.. పుల్వామా ఘటన సమయంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ ఉన్నారు. ఈయనకున్న టెంపరేంటో ప్రపంచం మొత్తానికీ తెలుసు. ఏ చిన్న దేశానికి కొన్ని డాలర్లు సాయంగా విసిరే సినా అంతకు డబుల్‌ ఖర్చుపెట్టి ప్రచారం చేసుకునే తీరున్న నేతలు అమెరికా రాజకీయ నాయకులు. అందులోనే ట్రంప్ అధ్యక్ష సీట్‌లో ఉండా ఇలాంటి ఓ పరిణామం జరిగిందంటే తామే అణు యుద్ధాన్ని ఆపిన ట్టు ఏ రేంజ్‌లో ప్రచారం జరిగి ఉండాలి? పోనీ ఇతర దేశాల అంతర్గత విషయాలు పైకి చెప్పకూడదనే ఉద్దేశంతోనే చెప్పలేదనుకుందామన్నా ఆ అలవాటు కూడా అమెరికాకు లేదు. సొంత వ్యవహారాలు చక్క దిద్దుకోలేకపోయినా.. ఇతర దేశాల అంతర్గత విషయాలపై నోరుపారేసుకోవడం ఆ దేశానికి అలవాటే. దీంతో భారత్, పాక్ అణుయుద్ధాన్ని ఆపామన్న మైక్ పాంపియో కామెంట్స్ నిజం కాకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా నెవర్ గివ్ ఏ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్ సేల్స్‌‌ను పెంచుకునే ప్రయత్నాల్లోనే ఇలాంటి అంశాలు జోడించి ఉండొచ్చన్న చర్చ అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతోంది.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...