పాకిస్తాన్ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. డాలర్ నిల్వలు అడుగంటిపోయిన ప్రస్తుత తరుణంలో విదేశీ మారక ద్రవ్యం కోసం పాకిస్తాన్ ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తోంది. అప్పు కోసం ఆ దేశం చేయని ప్రయత్నం లేదు. చివరకు విదేెశాల్లో ఉన్న తమ ప్రభుత్వ భవనాలనూ.. ఇతర ఆస్తులను ఆమ్మేస్తోంది పాకిస్తాన్. ఎలాగోలా ఈ రోజు గడిస్తే చాలు అనే స్థితికి చేరుకుంది పాకిస్తాన్ కరువు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ డాలర్ల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుందని తెహ్రీక్ ఇ తాలిబన్ ఇన్ పాకిస్తాన్(టీటీపీ) ఆరోపిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమైందనీ.. త్వరలోనే పాకిస్తాన్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనీ ఈ సంస్థ అంతర్జాతీయ మీడియాతో చెప్తోంది.
తన వద్ద అను అణ్వాయుధాలను సౌదీ ప్రభుత్వానికి విక్రయించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిథులు సంప్రదింపులు జరుపుతున్నారనీ.. రాత్రికి రాత్రి కార్గో విమానాల ద్వారా పాకిస్తాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ అన్నీ సౌదీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనీ టీటీపీ ప్రతినిథులు ఆరోపిస్తున్నారు. అయితే.. రాబోయే కరువును దృష్టిలో పెట్టుకొని కొద్ది నెలల క్రితమే పాకిస్తాన్ తన వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నీ సౌదీకి అమ్మేసిందన్న వార్తలు కూడా గతంలోనే వినిపించాయి. అణ్వాయుధాలు మొత్తం తమకు అప్పగిస్తే అప్పుల ఊబి నుంచి బయటపడేస్తామని పాకిస్తాన్ కు సౌదీ ఆఫర్ ఇచ్చిందనీ.. ఈ ఒప్పందం జరిగిన కొద్ది రోజులకే అణ్వాయుధాలు ఎప్పుడో సౌదీకి తరలించబడ్డాయనీ ఇదివరకు చెప్పుకున్నారు. తాజాగా టీటీపీ చేస్తున్న ఆరోపణలపై పాక్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.