సినిమా రంగంలో నోబుల్ ప్రైజ్ గా భావించే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రేసులో జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా దూసుకెళ్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ క్రిటిక్స్ చాయ్స్.. ఇలా డజన్ కు పైగా అవార్డులు కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ కన్ఫర్మ్ అయినట్టు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు హాలీవుడ్ సినిమా క్రిటిక్స్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్టు ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్లలో కథనాలు కనిపిస్తున్నాయి. ఎన్నో అవార్డులను కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా.. చివరి మైలు రాయి ఆస్కార్ ను కూడా సొంతం చేసుకుందనే వార్తలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్.. కాదు కాదు.. టాక్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ వరల్డ్.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను చాటి.. ఇటు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ను కూడా హవా కొనసాగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం ట్రెండింగ్ ఇండియన్ హీరోస్ గా మారిపోయారు. జేమ్స్ బాండ్ నెక్స్ట్ సిరీస్ లో రామ్ చరణ్ బాండ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడన్న వార్తలు గతంలోనే విన్నాం. ఇక ఎన్టీఆర్ ముందు కొన్ని హాలీవుడ్ సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయనేది తెలిసిన విషయమే. ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్.. ఆ ఆస్కార్ ను కూడా భారత్ కు పట్టుకొచ్చేస్తే.. తెలుగు ప్రేక్షకుల చిరకాల కల నెరవేరినట్టు అవుతుంది. బాలీవుడ్ పై తెలుగు సినిమా ఆధిపత్యం చేసే అవకాశం కూడా వస్తుంది.