HomeAP NEWSప్రపంచంలో ఎవరికీ లేని అడ్వాంటేజ్ పవన్ కు మాత్రమే..!

ప్రపంచంలో ఎవరికీ లేని అడ్వాంటేజ్ పవన్ కు మాత్రమే..!

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

పవన్ కళ్యాణ్.. ఈ పేరే సెన్సేషన్. ఓ సినిమాలో పవన్ చెప్పినట్టు తనకు తానే పోటీ.. తనతో తనకే పోటీ.. అంతే..! నిన్న రణస్థలంలో జరిగిన జనసేన సభ.. ఇప్పటి వరకు జరిగిన మిగితా సభలకంటే కొంచెం భిన్నంగా అనిపించింది.
సాధారణంగా పవన్ కళ్యాణ్ మీటింగ్ అంటే జనం, ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఈసారి రణస్థలంలో కూడా అదే జరిగింది. కాకపోతే భిన్నం అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే.. నిన్న పవన్ ఫ్యాన్స్ లో కనిపించిన అభిమానం.. అంతకు ముందెన్నడూ చూడలేదేమో అనిపించింది. ఎప్పుడో మధ్యాహ్నం వచ్చారు జనం.. పవన్ సభకు..! కానీ రాత్రి పవన్ వచ్చి మాట్లాడేదాకా ఒక్కళ్ళు కూడా సభ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోలేదు. అదే క్రౌడ్… అంతకంతకూ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఎండా వానా చలి.. ఇవేవీ పవన్ ఫ్యాన్స్ లెక్కచేయరేమో. నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ పవన్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కదు.. ఎందుకనే ప్రశ్నకు ఇదుగో సమాధానం..

సాధారణంగా రాజకీయ నాయకులు లేదా పార్టీల సభలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సభ ఎప్పుడు జరుగుతుందో చాలా ముందుగానే ప్రకటించాలి. సభా స్థలం వద్ద లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేయాలి. ఊర్లలో నుంచి జనాన్ని సభా స్థలానికి తరలించేందుకు స్కూళ్ళను ఒప్పించి స్కూలు బస్సులు.. ఆర్టీసీ బస్సులు.. డీసీఎం వ్యాన్లు.. వాటిలో పెట్రోల్ డీజిల్ ఖర్చులు.. ఇవన్నీ భరించాలి. ఇంతా చేస్తే సభకు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి సభకు రావటానికి జనానికి క్వార్టర్ బాటిళ్ళు బిర్యాణీ పొట్లాలతో పాటు 5 వందల నోటు చేతిలో పెట్టాల్సిందే. ఇంత చేస్తే కానీ ఆ సభ సక్సెస్ కాదు. పార్టీ మీదనో నాయకుడి మీదనో అభిమానంతో వచ్చే జనం చాలా తక్కువ. అది ఎప్పుడైనా.. ఎక్కడైనా..! ఏదో ఆశించి వచ్చే వాళ్ళే 75 శాతం ఉంటారు.. అందులో సందేహమే లేదు. కానీ పవన్ కళ్యాణ్ సభ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఫలానా రోజున ఫలానా చోటులో సభ ఉందని సోషల్ మీడియాలో ఓ చిన్న పోస్ట్ చేస్తే చాలు.. అంతే..!

వాహనాలు అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ సొంత ఖర్చులు పెట్టుకొని బస్సులు, రైళ్ళలో అక్కడికి చేరుకుంటారు కాబట్టి..!
క్వార్టర్ సీసాలు.. బిర్యాణీ పొట్లాలు.. 5 వందల నోట్లు ఇవ్వాల్సిన అవసరమే లేదు.. ఎందుకంటే పవన్ పై అభిమానం సరిపోతుంది కాబట్టి..!
ఊర్లలో తిరిగి జన సమీకరణ కోసం నానా హడావుడి చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. అది పవన్ కళ్యాణ్ సభ కాబట్టి..!

ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కి. ఇది కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమేనేమో. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఓ పొలిటికల్ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయిన చరిత్ర చాలా తక్కువ. ఇది పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉన్న అడ్వాంటేజ్. కానీ ఇంత అదృష్టంలో కూడా పవన్ ఎక్కడో దురదృష్టంతో పీడించబడ్డాడు ఇప్పటి వరకూ.

అదేమిటంటే.. “బాబ్బాబూ నాకు ఓటేయండి.. నేను మీకు అది ఇస్తాను.. ఇది చేస్తాను.. ఆ పథకం పెడతాను.. ఈ స్కీమ్ పేరుతో డబ్బులు ఇస్తాను..” ఇలాంటి లక్షణాలు పవన్ లో లేవు. అసలు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలే ఇవి. అందుకే చాలా మంది పవన్ గురించి రాజకీయం తెలియని మనిషి అని అంటుంటారు. కానీ ఎన్నికల్లో ఓట్లు పడాలంటే ఆ లక్షణాలే కావాలి. పథకాల హామీలు ఇవ్వాలి.. అమ్మా అక్కా అన్నా చెల్లీ ఓటు వేయండి అని బ్రతిమిలాడాలి.. ఇంటింటికీ తిరుగుతూ నాకే ఓటేయాలంటూ గడ్డం పట్టుకొని బతిమిలాడాలి. అప్పుడే ఓట్లు పడేది. ప్రస్తుతం పవన్ మారినట్టు కనిపిస్తోంది. ప్రతి సభలోనూ తనను ఒక్క చోటనైనా గెలిపిస్తే ఇది చేసేవాడిని కదా.. అది ఆపేవాడిని కదా.. కానీ నన్ను గెలిపించకపోతిరి.. నేనేం చెయ్యాలే.. అంటూ మాట్లాడటం కనిపిస్తోంది. సో.. పవన్ రాజకీయ నాయకుడిగా పరివర్తన చెందుతున్నాడన్నమాట. అది మంచిదే..! ఎందుకంటే ఎన్నికల సమయంలో ఫ్యాన్ ఓటర్ల రూపంలోకి మారిపోతారు.. ప్రలోభాలకు ఆకర్షితులు అవుతారు. కాబట్టి అభిమానాన్ని ఆ ప్రలోభాలు ఆ క్షణంలో పక్కన పెట్టేలా చేస్తాయి.
ప్రపంచంలో అధికార మార్పిడి ఎక్కడ జరిగినా పెద్ద మార్పులే వస్తాయి. ఆ అధికారం నిస్వార్థ రాజకీయ నాయకుల చేతికి వెళ్తే.. అది కొత్త చరిత్ర అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న సింగపూర్ వెనుక.. దేశ అభివృద్ధి మాత్రమే కలగా సుదీర్ఘ కాలం నిస్వార్థంతో పనిచేసిన లీ క్వాన్ యూ శ్రమ ఉంది. అలాంటి వ్యక్తులు అరుదుగా పుడతారు. జనం అధికారం ఇస్తే చరిత్రనే మార్చేసి కొత్త చరిత్ర లిఖిస్తారు. జీరో బడ్జెట్ రాజకీయాలు.. అవినీతి రహిత పాలన అంటూ నిత్యం జపం చేసే పవన్ కళ్యాణ్ కూడా అలాంటి చరిత్ర సృష్టించగలడేమో. ఈసారి బహుశా పవన్ కళ్యాణ్ చేతికి అధికారం దక్కుతుందేమో. కింగ్ అవుతాడో.. కింగ్ మేకర్ అవుతాడో.. తెలియదు కానీ.. పవన్ ఇంతకు ముందు కంటే మంచి ఫలితాలనే దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూద్దాం.. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు..! ఎవరు ఏ పరిస్థితికైనా చేరుకోవచ్చు..!! ఓడలు బండ్లు.. బండ్లు ఓడలైన పరిస్థితి క్రితం సారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిందే కదా. జస్ట్ వెయిట్ ఆండ్ సీ.. అంతే..!!!

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...