రీల్స్ చేస్తే లక్ష బహుమతి.. ఇది నిజమే.. తెలంగాణ సర్కార్ అఫీషియల్ గా ఈ అనౌన్స్ మెంట్ చేసింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విటర్ ప్లాట్ ఫామ్ లలో రీల్స్ చేసి పోస్ట్ చేస్తే వాటిలో ది బెస్ట్ రీల్ చేసిన వారిని సెలెక్ట్ చేసి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు ఇస్తామని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అనౌన్స్ చేసింది. కాకపోతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాకుండా కేవలం హైదరాబాద్ అభివృద్ధి గురించి మాత్రమే ఈ రీల్స్ చేయాలి. 60 సెకన్లలో తెలంగాణ రాజధానిని చూపిస్తూ ఆసక్తికరంగా రీల్స్ చేస్తే వాటిలో ది బెస్ట్ రీల్ ను ఎంపిక చేస్తారు. అయితే.. ఆ వీడియోను @DigitalMediaTS హాష్ ట్యాగ్ తో పోస్టు చేయాలి. దీని వల్ల హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి సులభంగా ప్రజలకు అర్థం అవుతుందనీ.. ఇది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుంది అనేది కాన్సెప్ట్ అన్నమాట.
రీల్స్ ను dir_dm@telangana.gov.in కు మెయిల్ కూడా చేయొచ్చు. ఈ కాంటెంస్ట్‌కు సంబంధించి ఇంకేమైన వివరాలు కోసం.. https://it.telangana.gov.in/contest/ వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే కాంటెస్ట్ కు సంబంధించిన ఫుల్ డీటైల్స్ తెలుసుకోవచ్చు. అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఇది నిజంగా బంపర్ ఆఫర్. ఇంకేం.. అమ్మాయిలూ రెచ్చిపోండి.. లక్ష ప్రైజ్ మనీ తో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయిపోయే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఏప్రిల్ 30వ తేదీ లోగా మంచి కాన్సెప్ట్ తో రీల్స్ చేసి పంపించేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మరి.