HomeINTERNATIONAL NEWSఓషియన్ గేట్ సబ్ మెరైన్ : ఆ ఐదుగురు బ్రతకటం కష్టం

ఓషియన్ గేట్ సబ్ మెరైన్ : ఆ ఐదుగురు బ్రతకటం కష్టం

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ శకలాలను చూడటానికి వెళ్ళిన ఓషియన్ గేట్ సబ్ మెరైన్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం ఇందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు పోయినట్టే. సబ్ మెరైన్ లో ఐదుగురికి కలిపి గురువారం ఉదయం దాకా సరిపోయేంత ఆక్సిజన్ అందుబాటులో ఉందని ఓషియన్ గేట్ సంస్థ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన గురువారం ఉదయం కల్లా సబ్ మెరైన్ ఆచూకీ లభించని పక్షంలో వారు ప్రాణాలతో ఉండే అవకాశమే లేదు. ఇప్పటికే అమెరికా నావికా దళానికి చెందిన నిపుణుల బృందాలు సముద్రం మొత్తం జల్లెడ వేసి గాలిస్తున్నాయి. అయినా ఓషియన్ గేట్ గురించి చిన్న సమాచారం కూడా సేకరించలేకపోయాయి. అప్పుడప్పుడు సముద్రం నుంచి కొన్ని శబ్ధాలు వస్తున్నాయనీ.. ఆ శబ్దాలు ఓషియన్ గేట్ సబ్ మెరైన్ నుంచే వెలువడుతున్నాయని తాము భావిస్తున్నామనీ.. కానీ దానిని చేరుకోలేకపోతున్నామనీ అమెరికా నేవీ ప్రకటించింది.

పాకిస్తాన్ బిలియనీర్ షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ తో పాటు యాత్ర నిర్వాహకుడు మరియు ఓషియన్ గేట్ సంస్థ ఓనర్ స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నేవీ ఆఫిసర్ పాల్ హెన్రీ ఓషియన్ గేట్ సబ్ మెరైన్ లో ఉన్నారు. కెనడా, అమెరికా నేవీకి సంబంధించిన నిపుణుల బృందాలు సముద్రం మొత్తం గాలిస్తున్నా ఆచూకీ మాత్రం లభించటం లేదు. సబ్ మెరైన్ ఒక్కసారి అదుపుతప్పితే అది వెళ్ళే మార్గం కనుక్కోవటం కష్టం. నావిగేషన్ గనుక మిస్ గైడ్ అయితే అది అదుపుతప్పి సముద్రజలాల్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. అయితే.. అసలు సబ్ మెరైన్ ఎలా అదుపుతప్పింది.. సముద్రం లోతున ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పటి వరకూ ఓషియన్ గేట్ అధికారులు వెల్లడించటం లేదు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని అమెరికా అధికారులు టెన్షన్ పడుతున్నారు. అందులో ఉన్న వాళ్ళు మాత్రం ప్రాణాలతో ఉండే అవకాశం ఒక్క శాతం కూడా లేవని నిపుణులు చెప్తున్నారు.

FOLLOW US

More like this