నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్నదంటూ నిన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మీడియాలో రకరకాల కథనాలు రాగా.. తాజాగా ఈ మాజీ భార్యాభర్తలిద్దరూ విడాకులపై స్వయంగా స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో వీరి విడాకుల గురించి క్లారిటీ ఇచ్చారు. నిన్నటి నుంచి వినిపిస్తున్న వార్తలు నిజమేననీ.. తామిద్దరం ఒకరితో ఒకరు ఉండలేకనే పరస్ఫర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామంటూ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
నీహారిక ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు ఈ రోజు మధ్యాహ్నం కనిపించింది. విడాకులు నిజమే.. మేమిద్దరం పరస్ఫర అంగీకారంతోనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాము.. ఇప్పటి దాకా నాకు వెన్నంటే సహకరించిన నా కుటుంబ సభ్యులకు నా కృతజజ్ఞతలు.. ఇకపై నా వ్యక్తిగత జీవితంలో నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను.. నా నిర్ణయాన్ని గౌరవించి నాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు.. ఈ విషయంలో నాకు ప్రైవసీ కావాలని కోరుకుంటున్నాను.. అంటూ నీహారిక పోస్ట్ చేసింది.
ఇక జొన్నలగడ్డ చైతన్య కూడా విడాకుల విషయంపై ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. చైతన్య కూడా విడాకుల గురించి నీహారిక చెప్పిందే చెప్పాడు. పరస్ఫర అంగీకారంతోనే విడిపోయామనీ.. ఈ విషయంలో తమకు ప్రైవసీ కావాలని కోరుకుంటున్నాననీ పోస్ట్ చేశాడు. 2020లో నీహారిక, చైతన్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీళ్ళిద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా నీహారిక ఒంటరిగానే కనిపిస్తుంది. చాలా రోజులుగా వినిపిస్తున్న వీళ్ళిద్దరి విడాకుల వార్త.. ఇప్పుడు నిజమైంది.