ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థం గురువారం వారి నివాసం ఆంటీలియాలో జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులు, బాలీవుడ్ నటుల మధ్య అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ముకేష్, నీతా అంబానీల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నిశ్చితార్థం పూర్తైన తర్వాత జరిగిన వేడుకల్లో ముకేష్ అంబానీ మిగితా వారితో కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. భార్య నీతా అంబానీతో పాటు ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలతో కలిసి ముకేష్ స్టెప్పులేస్తున్న వీడియోను వారి కుటుంబ సభ్యులో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రపంచ కుబేరులలో 8వ స్థానంలో ఉన్న ఓ పేద్ద వ్యాపార వేత్త.. బిలియన్ డాలర్లకు అధిపతి అయినా.. కొడుకు పెళ్ళిలో చిన్న పిల్లాడిలా ముకేష్ మరియు ఆయన భార్య డాన్స్ చేయటం చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్, రన్వీర్ సింగ్, దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ చిన్నప్పటి నుంచే స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారి వివాహ బంధానికి చేరువైంది. వీరి వివాహ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.