HomeINTERNATIONAL NEWSమోడీ పాపువా న్యూ గినియా పర్యటన : బైడెన్, జిన్ పింగ్ కు కోలుకోలేని దెబ్బ

మోడీ పాపువా న్యూ గినియా పర్యటన : బైడెన్, జిన్ పింగ్ కు కోలుకోలేని దెబ్బ

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

స్థానిక రాజకీయం, అంతర్జాతీయ రాజకీయం ఒక్కటి కాదు.. ఇక్కడ గెలవాలంటే విమర్శలూ, వ్యూహాలకు పదునుపెడితే సరిపోతుంది. అంతర్జాతీయంగా గెలవాలంటే మాత్రం అంతకుమించి ఆలోచనలు చేయాలి. అదికూడా పొరుగున చైనా లాంటి కంత్రీ కంట్రీ ఉన్నప్పుడు ఆ ఆలోచనలు అంతకుమించే ఉండాలి. ఇందులో ఏమాత్రం తేడాకొట్టినా ఫలితం దేశాన్నే ప్రమాదంలో పడేస్తుంది. ఈ విషయం ప్రధాని మోడీకి చాలా బాగా తెలుసు. మోడీ ప్రత్యర్ధులు ఈ విషయాన్ని ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే వాస్తవం అనేది గత కొద్ది యేళ్ళుగా భారత విదేశాంగ విధానం నిరూపిస్తూ వస్తున్నది. ఇటీవలి కాలంలో చైనాతోముప్పు పెరుగుతున్న కారణంగా సరిహద్దుల్లో భద్రత పెంచుతున్న మోడీ సర్కార్.. త్రివిధ దళాల బలోపేతంపై దృష్టి పెడుతూనే డ్రాగన్‌కు ఎక్కడ, ఎప్పుడు, ఎలా చెక్ పెట్టాలనేదానిపై వర్క్‌ఔట్ చేస్తోంది. కానీ, అనుకున్నదే తడవుగా యాక్షన్‌లోకి దిగిపోడానికి ఇది లోకల్ రాజకీయం కాదు.. సమయం, సందర్భం కూడా కలిసిరావాలి. జీ7 సదస్సు కోసం జపాన్ వెళ్లిన మోడీకి ఇప్పుడు అలాంటి అవకాశమే దొరికింది.
ప్రధాని మోడీ హిరోషిమా పర్యటన దగ్గర నుంచి పాపువా న్యూ గినియా ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ వరకు టార్గెట్ అంతా డ్రాగన్ కంట్రీనే. మరీ ముఖ్యంగా ఇండో-పసిఫిక్‌లో ఆ దేశ యాక్షన్‌కు చెక్ పెట్టాలనేదే లక్ష్యంగా మోడీ వైఖరి కనిపించింది. నిజమే.. భారత భద్రత పరంగా ఇండో-పసిఫిక్‌లో బీజింగ్‌ ఆధిపత్యాన్ని అడ్డు కోకుంటే ఎప్పటికైనా చిక్కులు తప్పవు మరి. ఇందులో భాగంగానే హిరోషిమాలో శాంతి సందేశం ఇచ్చిన వెంటనే పాపువా న్యూ గినియా ఫ్లైట్ ఎక్కేశారు భారత ప్రధాని. పాపువా న్యూ గినియాకు వెళ్లిన భారత తొలి ప్రధాని మోడీనే. ఈ క్రమంలోనే మోడీపై ఉన్న అభిమానంతో తమ దేశ సంప్రదాయాలను బ్రేక్ చేస్తూ కనీవినీ ఎరుగని రీతిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో దేశానికి చేరుకున్న మోడీకి దేశ ప్రధానికి జేమ్స్ మరాపే స్వాగతం పలికారు. మోడీ పాదాలకు నమస్కారం చేసి ఆత్మీయతను చాటుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో ప్రధాని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ఐతే, పాపువా న్యూ గినియా ప్రధాని ఇంతలా అభిమానం చూపించడానికి కారణం ఆ దేశానికి భారత్ అందించిన సాయమే. ప్రపంచాన్ని కోవిడ్ వణికించిన సమయంలో పాపువా న్యూ గినియా కూడా అల్లాడిపోయింది. తీవ్ర ఆరోగ్య సంక్షోభాన్ని చవిచూసింది. ఆ సమయంలో భారత్ ఇతోధికంగా సాయమందించింది. కొవిడ్-19 వ్యాక్సిన్లను భారీగా పంపించింది. అప్పటి నుంచి పాపువా న్యూ గినియా మన దేశాన్ని ఆరాధిస్తోంది. అందుకే మోడీకి ఆ దేశంలో ఆత్మీయ స్వాగతం లభించింది. వాస్తవానికి.. పాపువా న్యూగినియా దేశానికి ఒక సంప్రదాయం ఉంది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన నాయకుడికైనా స్వాగత ఉత్సవాన్ని నిర్వహించదు. కానీ భారత ప్రధాని మోడీ కోసం ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టింది. రాత్రి 10 గంటల తర్వాత మోడీ.. పాపువా న్యూ గినియా లో అడుగుపెట్టారు. ఐనా మోడీకి స్వాగత ఉత్సవాన్ని ఆ దేశం అద్భుతంగా నిర్వహించింది.
ప్రపంచ వేదికపై భారత నాయకత్వాన్ని కొనియాడారు పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే. ఇండియా అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు చెప్పిన మరాపే.. అగ్ర దేశాలు అధికారం కోసం ఆడుతున్న ఆటలో తాము బాధితులమయ్యాం అని వాపోయారు. ఇదే సమయంలో మోడీని ఉద్దేశిస్తూ మీరు గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహిస్తున్నారనీ, అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వెన్నంటి ఉంటామనీ ప్రకటించారు. ఈ ప్రకటన బీజింగ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చేదే. ఎందుకంటే ప్రపంచ పెద్దన్నగా ఎదిగేందుకు కుట్రలనే నమ్ముకున్న బీజింగ్.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో కింగ్‌గా మారి గ్లోబల్ సౌత్‌ లీడర్‌గా అవతరించాలని కలలు కంది. ఈ ప్రాంతంలో ఆధిపత్యం సాధిస్తే అమెరికా, భారత్‌ను ముప్పుతిప్పలు పెట్టడంతో పాటుగా వాణిజ్యపరంగానూ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని లెక్కలు కట్టింది. ఈ విషయంలో కొంత మేర విజయం సాధిస్తోంది కూడా. పసిఫిక్ రీజియన్‌లోని పలు దేశాలకు అప్పులిస్తూ తన ఉచ్చులోకి దించే ప్రయత్నాలు చేసింది.
ఈ పరిస్థితులకు కారణం అగ్రరాజ్యం అమెరికానే. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తిరుగు లేని సైనిక శక్తి అమెరికా. ఈ పవర్‌ ఉందనే ఇన్నాళ్లు ఇండో-పసిఫిక్‌ రీజియన్ దేశాలను అగ్రదేశం ఏ మాత్రం పట్టించుకోలేదు. శతాబ్దాలు గడుస్తున్నా.. ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో అమెరికా అధ్యక్షులు ఇప్పటివరకు కాలు మోపలేదు. దీన్ని ఆసరాగా తీసుకునే.. డ్రాగన్‌ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. ఆయా దేశాల్లో మౌలిక వసతులు పేరుతో పాగా వేసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని గుర్తించి అమెరికా.. ఈ పరిస్థితులకు చెక్ పెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పాపువా న్యూ గినియాలో పర్యటిస్తానని ప్రకటించారు. సుమారు 18 దేశాలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా పాపువా న్యూ గినియా పర్యటనకు బైడెన్ సిద్ధమయ్యారు. కానీ, ఆర్ధిక ఇబ్బందుల నేపధ్యంలో ఆపర్యటనను బైడెన్ క్యాన్సిల్ చేసుకోవాల్సివచ్చింది. ఒకవేళ బైడెన్ పాపువా న్యూ గినియాలో పర్యటించినా ఇప్పుడు మోడీకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఆయనకు దక్కేది కాదు. దీనికి చాలానే కారణాలున్నాయి. అగ్ర దేశాలు అధికారం కోసం ఆడిన ఆటలో తాము బాధితులం అయ్యామని తాజాగా పాపువా న్యూ గినియా ప్రధాని చేసిన కామెంట్ అమెరికాను ఉద్దేశించే.
మొత్తంగా.. ప్రధాని మోడీ పాపువా న్యూ గినియా పర్యటన జిన్‌పింగ్‌కు దిమ్మదిరిగే కౌంటర్ లాంటిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్‌లోనూ పసిఫిక్ దీవులకు భారత్ అందించే ఆపన్న హస్తంలో ఏమాత్రం తేడా ఉండదని ప్రకటించడం ద్వారా చైనాను ఆ పరిశరాలకు కూడా వెళ్లకుండా చేయడంలో మోడీ విజయం సాధించినట్టే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఒక్కమాటలో సైనిక పరంగా స్ట్రాంగ్‌గా ఉండికూడా చైనాను నిలువరించడంలో బైడెన్ విఫలమైన చోట మోడీ విజయం సాధించి చూపించినట్టే కనిపిస్తోంది. మరి మోడీ పర్యటనపై బీజింగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...