HomeNATIONAL NEWSవైరల్ న్యూస్ : మోడీకి నోబెల్ పీస్ ప్రైజ్ !?

వైరల్ న్యూస్ : మోడీకి నోబెల్ పీస్ ప్రైజ్ !?

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

నోబెల్ పీస్ ప్రైజ్.. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారానికి నామినేట్ కావడమే ఓ చరిత్ర. ఇక సొంతం చేసుకున్నవారి పేరు హిస్టరీలో నిలిచిపోతుంది. అలాంటి నోబెల్‌ పీస్ ప్రైజ్ ఈసారి భారత ప్రధాని మోడీకి దక్కబోతుందనే చర్చ జోరందుకుంటుంది. దీనికి కారణం నార్వే నోబెల్ కమిటీ సభ్యులు ఇస్తున్న హింట్సే. ఇటీవల భారత్‌లో పర్యటించిన కమిటీ సభ్యులు ప్రపంచ అత్యున్నత పురస్కారం మోడీకి కాక మరెవరికి అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇదే ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కారణమైంది.
పెద్దన్న హోదా అంటే నచ్చనివారిని పబ్లిక్‌గా విమర్శించడం, మెచ్చేవారిని పక్కన పెట్టుకోవడం కాదు. ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం. ఆ పని చేయడంలో అమెరికా ఎప్పుడో విఫలమైంది. పైగా ఉక్రెయిన్-రష్యాలను తన్నుకుచావండని ఎంకరేజ్ చేసి ప్రపంచం మొత్తానికీ శాపంగా మారింది. అదే అమెరికా స్థానంలో ఇండియా ఉంటే ఏం జరిగుండేదో అనే చర్చ ఇటీవలికాలంలో జోరుగా సాగుతోంది. దీనికి కారణం భారత విదేశాంగ విధానాలే. ప్రపంచ ఉద్రిక్తతలపై ప్రధాని మోడీ నిత్యం చెప్పే మాట ఒక్కటే డైలాగ్ అండ్ డిప్లమసీ. వీటితో మాత్రమే ప్రపంచ శాంతి లభిస్తుందని చాలా సందర్భా ల్లో మోడీ ప్రకటించారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధంపైనా అంతర్జాతీయ వేదికలపై ఇదే అంశాన్ని ప్రస్తావించి ప్రపంచ దేశాల అటెన్షన్ సాధించారు. గతేడాది సమర్‌కండ్‌లో జరిగిన ఎస్‌సీఓ సమ్మిట్‌లో ఏకంగా పుతిన్‌తో సమావేశంలోనే ఇది యుద్ధ యుగం కాదన్న మోడీ కామెంట్‌కు ప్రపంచమే సెల్యూట్ చేసింది. ఆ క్షణం నుంచి అమెరికా స్థానంలో భారత్ ఉండుంటే ప్రపంచానికి ఈ పరిస్థితి వచ్చుండేది కాదనే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ శాంతి పురస్కారం నోబెల్ వార్తలతోనూ మరోసారి అలాంటి చర్చలే షురూ అయ్యాయి.
ఇటీవలే నోబెల్ బహుమతి కమిటీ బృందం నార్వే నుంచి భారత్‌కు వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే ఈ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ప్రధాని మోడీ లాంటి శక్తివంతమైన నేతకు ప్రపంచంలో శాంతిని నెలకొల్పే అద్భుతమైన సామర్థ్యం ఉందని కితాబు ఇచ్చారు. మోడీ లాంటి నేత శాంతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించగలరని నమ్ముతున్నట్లు అస్లే టోజే అన్నారు. నోబెల్ శాంతి బహుమతి విషయంలో ఇండియా నుంచి అధిక సంఖ్యలో నామినేషన్లు అందుతున్నాయన్నారు. ప్రపంచంలోని ప్రతిదేశ అగ్రనేతలు శాంతి కోసం అవసరమైన కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారత ప్రధాని మోడీ లాంటి వ్యక్తిపై ప్రపంచ వ్యాప్తంగా నమ్మకం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడంలో మోడీ కీలకపాత్ర పోషిస్తారు, ఆయనకు ఆ సత్తా ఉందని అస్లే టోజే కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద యుద్దాలను సైతం మోడీ తన నాయకత్వ ప్రతిభ, విశ్వసనీయతతో ఆపడానికి ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు.. యుద్ధం ముఖ్యం కాదని భవిష్యత్తు అంతా శాంతితో ఉండాలని రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాల అధినేతలతో ప్రధాని మోడీ చర్చలు జరిపారని అస్లే టోజే గుర్తుచేశారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. ఇండియాను చూసి ప్రపంచ దేశాలు ఎంతో నేర్చుకోవాలని, త్వరలోనే భారత్ సూపర్ పవర్‌గా అవతరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అస్లే టోజే ఈ వ్యాఖ్యలతోనే నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోడీ గట్టిపోటీ ఇస్తారన్న చర్చ మొదలైంది. అయితే, నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్.. మోడీకి నోబెల్ అందుకునే అర్హత ఉందని హింట్స్ ఇవ్వడానికి ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత వైఖరి ఒక్కటే కారణం కాదు. ప్రపంచానికి మోడీ సర్కార్ అంతకుమించి ఎంతో సాయం చేసింది. ప్రపంచం శాంతిని, స్నేహాన్ని కోరుకోవడంలో ప్రధాని మోడీ ఎప్పుడూ ముందుంటారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో పడనీయకుండా కాపాడారు. అదే సమయంలో చాలా దేశాలకు కోవిడ్ టీకాలు అందించి ఆపద్భాంధవుడిగా నిలిచారు. ఇక ప్రకృతి వైపరీత్యాలతో విలవిల్లాడిన దేశాలకు కూడా తన మన అనే బేధాలు లేకుండా కొండంత అండగా నిలిచారు. ఇటీవల తుర్కియేకు చేసిన సాయమే దీనికి ఉదాహరణ. ఇలా ప్రపంచ శాంతి కోసం నిత్యం కృషి చేస్తున్న లీడర్‌గా అంతర్జాతీయంగా మోడీ మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
భారత ప్రధాని మోడీని నోబెల్ వరిస్తుందా లేదా అనేది కాస్త పక్కనపెడితే.. ఈ ప్రతిష్టాత్మక పురస్కారంపై మరో దేశాధినేత కన్నేసినట్టు కనిపిస్తోంది. గతేడాది ఎస్‌సీఓ సమ్మిట్‌లో ప్రధాని మోడీ ఇది యుద్ధ యుగం కాదన్న తర్వాత.. తనకు అలవాటులేని శాంతి రాగం అందుకున్నారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. ఎలాంటి ప్రయోజనం లేకుండా జిన్‌పింగ్‌ ఏ పనీ చేయరనే అపవాదు ఉంది. అలాంటి వ్యక్తి ప్రపంచ శాంతికి కృషి చేస్తానని ప్రకటించడం ఏంటన్నదే అసలు ప్రశ్నంతా. వాస్తవానికి.. అంతర్జాతీయంగా జిన్‌పింగ్‌‌కు మంచి గుర్తింపు లేదు. కోవిడ్ తర్వాత చైనా అంటే ఓ డేంజర్ కంట్రీ అనేంతగా పరిస్థితులు మారిపోయాయి. దీనికితోడు తైవాన్‌తో పాటూ పొరుగు దేశాలపై కవ్వింపులు కూడా ఎక్కువయ్యాయి. ఫలితంగా చైనాకు ప్రపంచ విలన్‌గా గుర్తింపు వచ్చింది.దీని ప్రభావం క్రమంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్థపైనా పడుతోంది. ఇలాంటి సమయంలో జిన్‌పింగ్ తన పీస్ కామెంట్లతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో ఏళ్లుగా బద్ధ శత్రువులుగా ఉంటున్న సౌదీ అరేబియా, ఇరాన్‌ మధ్య దౌత్య సంబంధాలు తిరిగి పట్టాలెక్కేలా జిన్‌పింగ్ పావులు కదిపారు. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతికి కృషి చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిణామాల ద్వారా ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న ఏకైక లీడర్‌గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే, సౌదీ అరేబియా, ఇరాన్‌ను కలిపినంత ఈజీగా ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి చెక్ పెట్టడం సాధ్యం కాదు. ఇదే సమయంలో ఈ రెండు అంశాలతోనే జిన్‌పింగ్ ప్రపంచ శాంతి స్థాపకులు అయిపోరు. నోబెల్ శాంతి పురస్కారం వరకూ వెళ్లే సీన్ అసలే ఉండకపోవచ్చు.
జిన్‌పింగ్‌‌ పీస్ డ్రామాను కాస్త పక్కనపెడితే.. మోడీకి నోబెల్ ఛాన్సెస్ మెండుగా ఉన్నాయనే వార్త కాషాయ శ్రేణుల్లో కావాల్సినంత జోష్ నింపుతోంది. అయితే, ఈ వార్తలపై ప్రతిపక్ష పార్టీలు మాత్రం మోడీకి నోబెల్ అందుకునే అంత సీన్ లేదని విమర్శిస్తున్నాయి. అయితే, గతంలోనూ మోడీకి నోబెల్ డిమాండ్లు బలంగా వినిపించాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో, పేదరికాన్ని తగ్గించడంలో అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో మోడీ చేసిన కృషికి ప్రతిష్టాత్మక అవార్డు పొందే అర్హత ఉందని చాలా మంది వాదించారు. ఇక.. 2018లో అంతర్జాతీయ సహకారానికి, ప్రపంచ ఆర్ధిక వృద్ధిని పెంపొందించడానికి చేసిన కృషికి ప్రతిష్టాత్మక సియోల్ శాంతి బహుమతి మోడీని వరించింది. అప్పటికి 28 సంవత్సరాలలో ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడిగా మోడీ నిలిచారు.
ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని 2002లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌, 2009లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అందుకున్నారు. 2001లో ఐక్యరాజ్యసమితి, ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, 2012లో యూరోపియన్ యూనియన్, 2014లో భారత బాలలహక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌‌లను ప్రతిష్టాత్మక శాంతి బహుమతి వరించింది. మదర్ థెరిసా మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. ఇక అన్ని అనుకూలిస్తే.. ఈ ఏడాది భారత పీఎం మోడీ కూడా నోబెల్‌ శాంతి పురస్కారం అందుకుంటారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే భారత కీర్తి విశ్వవ్యాప్తం కావడంతోపాటూ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థానంలో ఇండియా నిలుస్తుందనే చర్చ జరుగుతోంది. మరి నిజంగానే మోడీని నోబెల్‌ శాంతి బహుమతి వరిస్తుందేమో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...