HomeNATIONAL NEWSనోరు జారి కాంగ్రెస్ కొంప ముంచిన మల్లికార్జున ఖర్గే

నోరు జారి కాంగ్రెస్ కొంప ముంచిన మల్లికార్జున ఖర్గే

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవు. ఇది తెలిసి కూడా ఆవేశపడితే రిజల్ట్ ఎప్పుడూ నెగిటివ్‌గానే వస్తుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ విషయంలో గత రెండు దశాబ్దాలుగా ఇదే నిజమవుతోంది కూడా. కానీ, అలాంటి ఏ ఘటన నుంచీ ఆ పార్టీ నేతలు పాఠాలు నేర్చినట్టు కనిపించడం లేదు. తిరుగులేని గెలుపు ఖాయం అనుకున్న చోట కూడా నోరు జారి ఫలితాలను అనుభవిస్తూనే ఉన్నారు. గతంలో మోడీపై మౌత్ కా సౌదాగర్ అని సోనియా, చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్, చాయ్ వాలా మణిశంకర్ అయ్యర్ చేసిన సెటైరికల్ విమర్శలు రివర్స్ ఐపోయాయి. కానీ, వాటి నుంచి ఆ పార్టీ నేతలు నేర్చిన పాఠం ఏంటో నేటికీ అర్ధం కాదు. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ లీడర్లు అదే తప్పులు చేస్తున్నారు. తాజాగా కన్నడ బ్యాటిల్‌ లోనూ అలాంటి సాహసానికే పోయి విమర్శలను ఎదుర్కొంటున్నారు. అదికూడా ఎవరో కాదు.. సాక్షాత్తూ ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలబురిగిలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఖర్గే.. ప్రధాని మోడీ విషపు పాము అని, ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే ఒక్కసారి ముట్టుకోవాలని, అప్పుడు మీరు శాశ్వతంగా నిద్రపోతారంటూ సెటైరికల్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కన్నడనాట కాంగ్రెస్‌ను మైనస్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఖర్గే వ్యాఖ్యలు బీజేపీకి ఓ బ్రహ్మాస్త్రంగా మారాయి. గతంలో సోనియా గాంధీ మౌత్ కా సౌదాగర్ వ్యాఖ్యలతో ఏం జరిగిందో.. ప్రస్తుతం ఖర్గే వ్యాఖ్యలకు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని, కాంగ్రెస్ మరింత లోతుకు కూరుకుపోతోందని, కాంగ్రెస్‌లో నైరాశ్యం కనిపిస్తోందంటూ కమలనాథులు ఎదురుదాడికి దిగుతున్నారు.
ఖర్గే మనుసులో విషం ఉందని, ఇది ప్రధాని మోడీ, బీజేపీ పట్ల పక్షపాత ధోరణి అని, రాజకీయంగా తమతో పోరాడలేక, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం బస్వరాజ్ బొమ్మై అన్నారు. ప్రధాని మోడీని ప్రపంచం మొత్తం గౌరవిస్తోందని, సీనియర్ నాయకుడు అయిన ఖర్గే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏం చెప్పాలనుకున్నారని, ఆయన దేశానికి క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదం కావడం, ఫలితం రివర్స్ అవుతుందని గ్రహించిన ఖర్గే తన కామెంట్‌పై యూటర్న్ తీసుకున్నారు. తాను ప్రధాని మోడీని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించలేదని, బీజేపీ సిద్ధాంతం పాములాంటిదని చెప్పడమే తన ఉద్దేశ్యం అన్నారు. తాను మోడీని వ్యక్తిగతంగా ఎప్పుడూ ఇలా అనలేదని, వారి సిద్ధాంతం పాము లాంటిదని మాత్రమే చెప్పానని, దాన్ని తాకాలని చూస్తే మీ మరణం ఖాయం అని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. కానీ, ఈ వివరణకు కమలం పార్టీ కరగలేదు. కాంగ్రెస్‌పై ఎదురుదాడి కంటిన్యూ చేస్తూనే దెబ్బకు దెబ్బ అన్నట్టుగా అదే తరహా విమర్శ చేసింది.
గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలనే బీజేపీ ప్రచార సాధనాలుగా ఉపయోగించుకుని దెబ్బకొట్టింది. 2007లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అల్లర్లను ఉద్దేశిస్తూ మోడీపై ‘‘మౌత్ కా సౌదాగర్’’ అంటే మరణాల వ్యాపారి అని, 2019లో ‘‘చౌకీదార్ చోర్ హై’’ అంటూ ప్రచారం చేసింది. ఐతే ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీనే దెబ్బకొట్టాయి. ఆ విమర్శల్ని బీజేపీ తిప్పికొట్టి, ప్రజల్లో సానుభూతి వచ్చేలా మలచుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల ముందు మోడీ ప్రచారం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ‘‘చాయ్ వాలా’’ అంటూ హేళన చేశారు. ఆ ఎన్నికల్లో దీన్నే ప్రచారం అస్త్రంగా మార్చుకున్న బీజేపీ ‘‘చాయ్ పే చర్చ’’ పేరుతో ప్రచారాన్ని నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి వచ్చింది.
2017 గుజరాత్ ఎన్నికల ముందు ఇదే మణిశంకర్ అయ్యర్ మరోసారి మోడీని ఉద్దేశిస్తూ ‘‘నీచ్ ఆద్మీ’’ అంటూ పిలిచారు. దీన్ని కుల వివక్షగా మార్చి బీజేపీ ఆ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించింది. 2019 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ మోడీకి వ్యతిరేకంగా ‘‘చౌకీదార్ చోర్ హై’’ అంటూ కామెంట్స్ చేశాడు. దీనికి విరుగుడుగా బీజేపీ ‘‘మే బీ చౌకీదార్’’ అంటూ ప్రచారం నిర్వహించి మరోసారి కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. 2022 గుజరాత్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత ఖర్గే మోడీని ‘‘రావణుడి’’తో పోల్చాడు. ఇది కూడా బీజేపీకి లాభించింది గుజరాత్ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఖర్గే తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా.. బీజేపీ చేయాల్సిందంతా ఇప్పటికే చేసేసింది. ఈ వ్యాఖ్యల ఫలితం ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...