అద్భుతమైన విదేశాంగ విధానం.. అంతర్జాతీయ పాలసీతో భారత్ ను మరో ఎత్తుకు తీసుకెళ్ళిన ప్రధాన మంత్రి మోడీ మరియు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీసుకున్న తాజా నిర్ణయం.. అంతర్జాతీయ వార్తల్లో ప్రధాన శీర్షికగా మారింది. 74 సంవత్సరాలుగా భారత్ లో పాతుకుపోయిన “యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్” ప్రతినిథులను వెంటనే ఆఫీసులు ఖాళీ చేసేసి తమ దేశాలకు వెళ్ళిపోవాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం మరియు విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. “మీ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే ఉద్దేశం భారత్ కు లేదు. మీరు వెంటనే మీ అధికారిక కార్యాలయాన్ని ఖాళీ చేసి.. దాన్ని కశ్మీర్ ప్రభుత్వ అధికారులకు అప్పజెప్పి.. మీమీ దేశాలకు వెళ్ళిపొండి వెంటనే..!” అనేది ఈ ఆదేశాల సారాంశం. ఈ ఆదేశాలతో ఐక్య రాజ్య సమితి ఉలిక్కిపడింది. భారత్ తీసుకున్న నిర్ణయానికి ఎదురు చెప్పలేక నోరు మూసుకుంది. ఇంతకీ ఏమిటి ఈ UNMOGIP..? ఏంటి దీని పూర్వోత్తరాలు..? ఓ సారి చూద్దామా..!
భారత్ పాకిస్తాన్ విభజన అనంతరం ఏర్పడిన కశ్మీర్ సమస్యను పరిష్కరించే బాధ్యతను ఐక్యరాజ్య సమితికి అప్పజెప్తూ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ తీసుకున్న నిర్ణయం పుణ్యమానీ ఏర్పడిన ఓ అవసరం లేని సంస్థనే “ఈ యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్”. నిత్యం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉందో గమనిస్తూ దాన్ని ఐక్యరాజ్య సమితికి రిపోర్ట్ చేయాలి ఈ అధికారులు. 74 యేళ్ళ క్రితం ఏర్పాటు చేసిన ఈ సంస్థ అప్పటి నుంచి ఇప్పటి దాకా పనిచేస్తూనే ఉంది. కానీ ఆ పని వల్ల భారత్, పాకిస్తాన్, యూఎన్ఓ లకు ఎలాంటి ఉపయోగం లేదు ఒక్క అమెరికాకి తప్ప. ఎందుకంటే.. ఈ సంస్థ ప్రతినిథులు ఇక్కడి అమెరికా గూఢచారులకు కావాల్సిన సమాచారం ఇస్తూ.. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు అనుకూలంగా రిపోర్టులు పంపిస్తుంటారు. ఈసంస్థ వల్లనే భారత్ పాక్ సరిహద్దుల్లో ఏం జరుగుతోందో తెలుసుకునే అమెరికా.. దాన్ని తమకు కావాల్సినట్టుగా మార్చేసి భారత్ ను బద్నాం చేస్తా ఉంటుంది ప్రపంచం ముందు. 74 యేళ్ళుగా జరుగుతున్న తతంగం ఇది. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా ఈ సంస్థ ప్రతినిథులు భారత్ కు వ్యతిరేకంగా అమెరికా సైన్యం, సీఐఏకు సమాచారం అందజేసి భారత్ ను ఓటమి పాలు చేయాలని ప్రయత్నించారు. ఇన్నేళ్ళుగా ఈ సంస్థ ఇన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నా ఏ ప్రభుత్వమూ వీళ్ళను ఆపలేకపోయింది సరికదా.. దున్నపోతులను మేపినట్టు మేపింది.. కట్టుదిట్టమైన భద్రత మధ్య..!
ఇది చాలదన్నట్టు ఈ సంస్థ ప్రతినిథులు తాజాగా భారత ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. తమకు జీతం, అలవెన్సులు సరిపోవటం లేదనీ.. తమకు కేటాయిస్తున్న బడ్జెట్ పెంచాలని కోరుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మెమో పంపారు. దీంతో మోడీ ప్రభుత్వం ఈ విషయమై లోతుగా ఆలోచించి.. సరైన నిర్ణయం తీసుకుంది. దీంతో దిక్కుతోచని ఆ సంస్థ ప్రతినిథులు వీసాలు రెడీ చేసుకుంటున్నారు. ఈ విషయమై అటు ఐక్యరాజ్య సమితి కూడా ఒక్క మాట మాట్లాడలేకపోయింది. ఎందుకంటే.. 74 యేళ్ళుగా భారత్ లో ఉన్న ఈ సంస్థ.. ఇప్పటికీ కశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోయింది కాబట్టి. ఇక ముందు కూడా ఈ సంస్థ వల్ల ఆ పని జరగబోయేది లేదు కాబట్టి. సో.. 74 సంవత్సరాల క్రితం పుట్టిన కురుపు.. రాచపుండుగా మారి భారత్ ను పీడిస్తున్న తరుణంలో.. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని నామరూపాలు లేకుండా చేసేసింది. ఖచ్చితంగా ఇది భారత్ కు మంచిదే. ఇక ఇంటర్నేషనల్ మీడియా దీనిపై మన విదేశాంగ శాఖ మంత్రివారిని ప్రశ్నిస్తే.. అది వాళ్ళ ఖర్మ..! ఎందుకంటే.. జైశంకర్ ఇచ్చే సమాధానాలు బహుశా వాళ్ళను ఓ వారం రోజుల పాటు నిద్రలేకుండా ఇబ్బందులకు గురి చేస్తాయి.