HomeTELANGANAఎవనికి దేవుడు ? : మోడీపై కేటీఆర్ సెటైర్లు

ఎవనికి దేవుడు ? : మోడీపై కేటీఆర్ సెటైర్లు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని మోడీని ఏకిపారేసే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. మరోసారి మోడీపై విమర్శలు, సెటైర్లతో చెలరేగిపోయారు. గురువారం ములుగు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన కేటీఆర్.. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రాంతానికి రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా పక్షపాతం చూపిస్తున్నారంటూ మోడీ సహా కేంద్ర మంత్రులపై ఆరోపణలు చేశారు. నీతి ఆయోగ్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల కోసం నిధులు ఇవ్వాలని చెప్పినా మోడీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ప్రశంసలు తప్ప పైసలు ఇవ్వని ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. తెలంగాణ పథకాలు అద్భుతం అని చెప్తారు కానీ నిధులు అడిగితే మాత్రం కేంద్ర మంత్రులు నోరు విప్పరన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ పై కేటీఆర్ సెటైర్లు వేశారు. మోడీ కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాడంటూ కిషన్ రెడ్డి పొగిడేస్తున్నాడనీ.. అదే నిజమైతే మోడీకి నోబుల్ పురస్కారం ప్రకటించాలంటూ తెలంగాణ అసెంబ్లీ నుంచి తీర్మానం చేస్తామని అన్నారు. బుర్ర తక్కువ కిషన్ రెడ్డి మోడీని దేవుడు అంటూ ఆకాశానికెత్తేస్తాడనీ.. మోడీ అదానీకి మాత్రమే దేవుడనీ అన్నారు. ఇక బండి సంజయ్ కు మెదడులో గుజ్జు లేదనీ.. ఈరోజు ఏ వారం.. ఏ దేవుడు అనే లొల్లి తప్ప మరో విషయం తెలియని పిచ్చివాడనీ సెటైర్లు వేశారు కేటీఆర్. ములుగు జిల్లా ఘనపురంలో తహశీల్దార్ భవనానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, సింగరేణి కాలనీ, దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం ప్రారంభం.. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఇంకా పలువురు టీఆర్ఎస్ నేతలు పర్యటించారు.

FOLLOW US

More like this