HomeINTERNATIONAL NEWS"దేశ జనం చచ్చినా సరే..!" : కిమ్ సంచలన నిర్ణయం

“దేశ జనం చచ్చినా సరే..!” : కిమ్ సంచలన నిర్ణయం

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

కిమ్ జాంగ్ ఉన్.. నియంతలకు కేరాఫ్ అడ్రస్. డర్టీ నిర్ణయాలకు నిలువెత్తు నిదర్శనం. పగపడితే ప్రతీకారం తీర్చుకునేవరకూ అస్సలు నిద్రపోరు.. ఆ ప్రయత్నంలో దేశం ఏమైపోయినా, జనం ఎలా చచ్చినా పట్టించుకోరు. నార్త్ కొరియాలో ఇప్పుడు జరుగుతోంది కూడా అదే.. ఆ దేశంలో ఏ సూపర్ మార్కెట్‌కెళ్లినా ఖాళీ రోలే దర్శనమిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆహార ఉత్పత్తుల దిగుమతులు పడిపోయి అదికాస్తా క్రమంగా ఆహార సంక్షోభం వైపు తీసుకెళుతోంది. ఇప్పుడా పరిస్థితులు ఏకంగా ఆకలి చావులవరకూ వెళుతున్నాయి. ఐనా కిమ్ లక్ష్యాలన్నీ అణు పరీక్షలు, అత్యాధునిక మిస్సైళ్ల ప్రయోగాలపైనే ఉన్నాయి. సౌత్ కొరియా, జపాన్, అమెరికా లాంటి దేశాలకు తన బలగాన్నీ, బలుపునూ చూపించడానికే కిమ్ ఆసక్తి చూపుతున్నారు తప్ప.. దేశ ప్రజల ఆకలి తీర్చే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన కిమ్.. ఎం చేద్దాం, ఆహార సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుదాం అని చర్చలు షురూ చేశారు. అయితే, నార్త్ కొరియాలో జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది.ఆహార సంక్షోభం కిమ్ సర్కార్‌కి కొత్తేం కాదు. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో విధించిన సరిహద్దు నియంత్రణలు, దుర్భర వాతావరణ పరిస్థితులు, అమెరికా ఆంక్షలు అక్కడి పరిస్థితిని పూర్తిగా దిగజార్చాయి. అయితే, నార్త్ కొరియాలో ఏం జరిగినా ఆ విషయాలు బయటి ప్రపంచానికి తెలీవు. అందుకే కిమ్ రాజ్యంలో ఆకలి పరిస్థితులను దక్షిణ కొరియా బయటపెట్టింది. ఆహార కొరతపై హెచ్చరికలు జారీ చేసిన దక్షిణ కొరియా.. యూనిఫికేషన్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆహార కార్యక్రమం నుంచి సాయాన్ని కోరింది. 2021 కంటే 2022లో నార్త్ కొరియా లక్షా 80వేల టన్నుల ఆహారాన్ని తక్కువగా ఉత్పత్తి చేసిందని దక్షిణ కొరియా శాటిలైట్ ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. కరవు, వరదలు వంటి తీవ్రమైన దుర్భర వాతావరణ పరిస్థితుల కారణంగా చలికాలంలో పంటల దిగుబడి తక్కువగా ఉంటుందని గతేడాది జూన్‌లోనే డబ్ల్యూఎఫ్‌పీ ఆందోళన వ్యక్తం చేసింది. దేశం రికార్డు స్థాయిలో రెండో అత్యంత దారుణమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటుందని 2022 చివర్లోనే నార్త్ కొరియా అధికారిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడా అంచనాలన్నీ నిజమవుతున్నాయి.


తీవ్రమైన ఆహార పదార్థాల కొరత కారణంగా చాలా మంది ఆకలితో చనిపోయినట్లు నివేదికలొస్తున్నాయి. కరోనా కట్టడి చర్యలకుతోడు అమెరికా సహా పలు దేశాలు విధించిన ఆంక్షల కారణంగా దిగుమతులకు కూడా అవకాశం లేక.. ఆహార సంక్షోభం తలెత్తిందని పరిశీలకులుచెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ చర్యలు చేపట్టారు. అధికార పార్టీ ప్రముఖులతో సమీక్ష నిర్వహించిన కిమ్.. ఉత్తర కొరియాలో వ్యవసాయ రంగ పరిస్థితులపై చర్చించారు. ఆహారోత్పత్తులను పెంచేందుకు ఇప్పటివరకూ చేపట్టిన చర్యలను సమీక్షించారని నార్త్ కొరియా అధికారిక మీడియా సైతం ప్రకటించింది. అయితే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మాత్రం అధికారిక మీడియా వెల్లడించలేదు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని.. ఇటీవల ఉత్తర కొరియా అధికార పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయం వ్యక్తం చేసింది. 1990వ దశకంలోనూ.. ఇలాంటి సంక్షోభం ఎదురైందని, అప్పట్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసింది. కానీ, ప్రస్తుతం 90ల నాటి దుస్థితి దేశంలో లేదంటోంది. అయితే, వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.ఉత్తర కొరియా ఎక్కువ భాగం మిలిటరీ కోసం ఖర్చు చేస్తుంది. ఫిబ్రవరి నెల ప్రారంభంలో భారీగా క్షిపణి లాంచర్లను ప్రదర్శించింది. మిలిటరీ పరాక్రమాన్ని ప్రదర్శించడం, ప్రచారం కోసమే ఉత్తర కొరియా తన వనరులన్నింటినీ వినియోగిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది ఉత్తర కొరియా రికార్డు స్థాయిలో 70కి పైగా క్షిపణులను ప్రయోగించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అమెరికా భూభూగాన్ని చేరుకోగల సామర్థ్యం ఉన్న ఐసీబీఎంలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన మిలిటరీ పరేడ్‌లోనూ భారీ స్థాయిలో ఐసీబీఎంలను ప్రదర్శించింది. వీటన్నింటి కోసం నిధులను తన సైబర్ క్రైమ్ యూనిట్‌ ద్వారానే సంపాదిస్తోందని పలు నివేదికలు సైతం తేల్చి చెప్పాయి. గతేడాది కిమ్ హ్యాకర్లు అక్షరాలా 13.9వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అలా కొల్లగొట్టిన నిధులను సైనిక బలోపేతానికే వినియోగిస్తున్నారు తప్ప.. దేశంలోని ఆహార సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడంలేదు. ఈ పరిణామాలే కిమ్ జాంగ్ ఉన్ సర్కార్ నియంతృత్వ ధోరణికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.కిమ్ నార్త్ కొరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటికే ఆ దేశంలో ఆహార సంక్షోభం మొదలైనట్టు పరిశీలకులు చెబుతున్నారు. దానికి అమెరికాతో వైరం కారణంగా ఆంక్షలు, కరోనా కట్టడికి రెండేళ్లపాటు కఠిన లాక్‌డౌన్‌లు.. వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపాయని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇంధనం, ఎరువులు, పురుగు మందుల ధరలు అమాంతం పెరగడం వల్ల ఉత్తర కొరియా వ్యవసాయ రంగం కుదేలైందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. గత రెండుమూడేళ్లలో కోవిడ్, యుద్ధం పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. అధికారం చేపట్టిన తర్వాత నుంచీ ఉన్న ఆహార సంక్షోభంపై కిమ్ ఫోకస్ చేయకపోవడమే ప్రస్తుత పరిస్థితులకు కారణంగా చెబుతున్నారు. ఇంత కఠినమైన పరిస్థితుల్లోనూ నార్త్ కొరియా అణ్వస్త్ర ప్రయోగాలకే మొగ్గు చూపింది తప్ప ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తీరా ఇప్పుడు పరిస్థితులు చేయిదాటిపోయిన వేళ.. సమీక్షలూ, సమావేశాలంటూ హైరానా పడుతోంది. దీనివల్ల ఇప్పటికిప్పుడు వచ్చే మార్పులేంటో కిమ్‌కే తెలియాలంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు.మొత్తంగా.. అమెరికా లాంటి దేశానికి తాము ఏమాత్రం తీసిపోమనీ, తమది అణుసామర్ధ్యం కలిగిన దేశం అని చెప్పుకోడానికే మొగ్గు చూపుతున్న కిమ్‌ సర్కార్.. ఆ దేశ ప్రజలను ఆకలితో చంపే పరిస్థితులకు దిగజారిపోతోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 1990ల నాటి ఘోరకలిని మరోసారి అనుభవించక తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కిమ్ పగలూ, ప్రతీకారాలను పక్కనపెట్టి ముందు దేశ ప్రజల ఆకలి తీర్చే ప్రయత్నాలు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మరి నియంత నేత ఆ దిశగా అడుగులేస్తారో.. లేక అంతా నా ఇష్టం అనే అంటారో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...