తరచూ వివాదాస్ఫద, వెరైటీ నిర్ణయాలు తీసుకొని అంతర్జాతీయ మీడియాలో హెడ్ లైన్స్ లో కనిపిస్తూ ఉంటాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఇతడు ఏది చేసినా విచిత్రంగానే ఉంటుంది. తాజాగా కిమ్ తీసుకున్న ఓ నిర్ణయం ఆ దేశంలోని ప్రభుత్వ అధికారుల పీకపై కత్తిలా మారింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరలం కొరియా దేశవ్యాప్తంగా ఆత్మహత్యల రేటు సుమారు 40 శాతం పెరిగిందంటూ ఓ నివేదికను అధికారులు కిమ్ జోంగ్ ముందుంచారు. దీనిపై ఆందోళన చెందిన కిమ్.. ఆత్మహత్యల శాతం పెరిగిపోవటం మంచిది కాదనీ.. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఏం చేయాలో మాత్రం తెలియని కిమ్.. ఇక మీదట ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే దానికి బాధ్యత ఆ ఏరియాలోని ప్రభుత్వ అధికారులదే అంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్యలను ఆపడానికకి ఏం చేయాలో చెప్పని కిమ్.. ఆపకపోతే మీదే బాధ్యత అంటూ అధికారుల పీకలపై కత్తి పెట్టినంత పని చేశాడు.
ఆత్మహత్యలను ఆపటం ఎలాగో తెలియని ప్రభుత్వ అధికారులు.. ఇప్పుడు నానా హైరానా పడుతున్నారు. కిమ్ చెప్పినట్టు నడుచుకోకపోతే ఏం జరుగుతుందో ఆ అధికారులకు బాగా తెలుసు కాబట్టి.. ఎప్పుడు ఎవరు ఆత్మహత్య చేసుకుంటారో.. దాని వల్ల తమకు కిమ్ ఏ శిక్ష విధిస్తాడోనని అధికారులు గజగజ వణికిపోతున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు.. ఆకలి చావుల కంటే ఆయుధాలపైనే ఎక్కువ దృష్టి. దేశంలో ప్రజలు ఆకలితో చస్తున్నా.. అణుబాంబులు తయారు చేయటం మాత్రం ఆపనే ఆపడు కిమ్. ఉత్తర కొరియాలో ఆకలి చావులు, ఆత్మహత్యలే మరణాలకు ప్రధాన కారణాలు. కానీ.. వాటి గురించి పెద్దగా ఆలోచించదు ఆ దేశ ప్రభుత్వం. కేవలం మిసైల్స్ తయారు చేయటం.. అమెరికాను కెలకటం.. జపాన్ వైపు మిసైల్స్ పంపించటం.. ఇవి మాత్రమే ఎక్కువ ఇష్టం కిమ్ కు. తాజాగా కిమ్ తీసుకున్న నిర్ణయంతో ప్రజల ఆత్మహత్యల మాటేమో గానీ.. ఆ భయంలో అధికారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.