HomeINTERNATIONAL NEWSకిమ్ జోంగ్ కు విచిత్రమైన వ్యాధి.. వణుకుతున్న నియంత !

కిమ్ జోంగ్ కు విచిత్రమైన వ్యాధి.. వణుకుతున్న నియంత !

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ఓ నియంత భయపడుతున్నాడు. వింత వ్యాధితో బెంబేలెత్తిపోతున్నాడు. నిత్యం అణ్వస్త్ర ప్రయోగాలతో ప్రపంచదేశాలను గడగడలాడించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్..ఇప్పుడు ఓ వింత వ్యాధితో తెగ బాధపడుతున్నాడట. వారానికో అణ్వస్ర్త ప్రయోగం చేసి అగ్రరాజ్యం అమెరికానే వణికించిన కిమ్..ఇప్పుడు అంతకుమించిన భయంతో గజ గజా వణికిపోతున్నాడట. ఒంటి చేత్తో ఏకచత్రాధిపత్యంగా దేశాన్ని ఏలుతున్న కిమ్‌కు ఇప్పుడు కొంతంత కష్టం వచ్చిందట. తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఇన్నాళ్లూ వ్యవహరించిన కిమ్..ఇప్పుడు కుక్కిన పేనులా ఇంట్లో ఓ మూలన కూర్చొని గుక్కపట్టి ఏడుస్తున్నాడట. ఒక్కోసారి నిద్ర పట్టక..అర్థరాత్రి వరకు పెగ్గు మీద పెగ్గు తెగ తాగేస్తూ బోరున విలపిస్తున్నాడట. ఈ విషయాలన్నీ చెప్పింది మరెవరో కాదు..మిర్రర్ అనే ఓ పత్రిక తన కథనంలో కిమ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పూసగుచ్చినట్లు వివరించింది.

ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ మిడ్ లైఫ్ సంక్షోభంతో బాధపడుతున్నారని, రోజంతా ఏడుస్తూ, మద్యం తాగుతూ గడుపుతున్నారంటూ ఓ నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ వారంలో 40వ వడిలోకి ప్రవేశించిన ఆయన ప్రజలకు దూరంగా గడుపుతుండడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్..ప్రస్తుతం మిడ్ లైఫ్ సంక్షోభం’తో బాధపడుతున్నాడని ‘మిర్రర్’ ఓ కథనంలో పేర్కొంది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ మిడ్ లైఫ్ సంక్షోభంతో బాధపడుతున్నట్లు వార్తా కథనాలు రావడంతో..అసలు మిడ్‌ లైఫ్ సంక్షోభం అంటే ఏంటి అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. మిడ్ లైఫ్ సంక్షోభం అంటే మరేదో కాదని..ఇది ఒక నిర్దిష్ట మానసిక అనారోగ్యమని వివరించారు. మగవాళ్లు మధ్య వయసులోకి మారినప్పుడు కలిగే అసంతృప్తి, ఆందోళన, నిరాశ, పశ్చాత్తాపం వంటివి మెదడును చుట్టుముట్టి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయట. దీనినే ‘మిడ్ లైఫ్ క్రైసిస్’ అంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. కిమ్ 40 ఏళ్ల వయసులోకి ప్రవేశించారని, అందుకే ఆయన ఇలాంటి వింత పరిస్థితులను ఎదుర్కొంటున్నారని సియోల్‌కు చెందిన నార్త్ కొరియన్ విద్యావేత్త ఒకరు చెప్తున్నారు. కిమ్ రోజులో చాలా వరకు మద్యం తాగుతూ ఏడుస్తున్నట్టు వివరించారు. పెగ్గుల మీద పెగ్గులు తాగుతున్నాడట. అంతేకాదు..ఒక్కోసారి ఒంటరిగా గడుపుతూ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు వివరించారు. అయితే ఇలాంటి మానసిక సంబంధిత సమస్య నుంచి బయటపడాలంటే నిత్యం వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కిమ్ మాత్రం..డాక్టర్లు చెప్పిన సలహాలు, సూచనలను పెడచెవిన పెడుతున్నారని ‘మిర్రర్’ నివేదించింది. తన అనారోగ్య వార్తలపై కిమ్ ఆందోళన చెందుతున్నట్టు పేర్కొంది. అంతేకాదు, కిమ్ విదేశాలకు వెళ్తున్నప్పుడు కూడా సొంత టాయిలెట్‌ను తీసుకెళ్తున్నట్టు ‘మిర్రర్’ ఆ కథనంలో పేర్కొంది. తన ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడానికి గూఢచారులు తన మలమూత్ర విసర్జాల కోసం వెతకకుండా ఉండేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కిమ్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు.

గతేడాది తొలిసారి కిమ్ తన కుమార్తెతో కలిసి బహిరంగంగా కనిపించారు. ఆ సమయంలో కిమ్ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా కన్పించారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో గోప్యంగా ఉంచే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మొట్టమొదటి సారి బహిరంగంగా కనిపించడం అప్పట్లో పెను సంచలనం రేపింది. తెల్లటి జాకెట్ ధరించిన కుమార్తె చేతులు పట్టుకొని నడుస్తూ కిమ్ జోంగ్ కనిపించినట్లు మీడియా వెల్లడించింది. క్షిపణి ప్రయోగం సందర్భంగా కిమ్ తన వెంట కుమార్తెను తీసుకొచ్చినట్లు అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. అంతకుముందు కొన్ని నెలల క్రితం కిమ్ జోంగ్ తన భార్య సోల్ జుతో కలిసి బహిరంగంగా కనిపించారు. అప్పుడు కూడా కిమ్ ఎంతో యాక్టీవ్‌గా కన్పించారు. కానీ ప్రస్తుతం కిమ్..ఎందుకిలా వింతలా ప్రవర్తిస్తున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. మిడ్‌ లైఫ్ క్రైసిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపినా…దీని వెనుక ఇంకా ఏదైనా సీక్రెట్ ఉందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. గతంలోనే కిమ్‌ అనారోగ్యానికి గురైనట్లు స్వయంగా ఆయన సోదరే మీడియా సాక్షిగా ప్రకటించడం అప్పట్లో పలు ఊహాగానాలకు ఊతమిచ్చింది. కరోనా సోకినట్లు కిమ్ సోదరి ప్రకటించినా..అంతకు మించిన అనారోగ్య సమస్యలేవో కిమ్‌ను వెంటాడుతున్నాయనే అనుమానాలు తలెత్తాయి.

మొత్తానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌కు ఏమైందన్న సందేహాలు సర్వత్రా తలెత్తుతున్నాయి. నిత్యం క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టించిన కిమ్..ఇప్పుడు కిమ్మనకుండా ఇంట్లోనే కాలం వెల్లదీస్తుండడంపై అనేక అనుమానాలు, సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పరిమితికి మించి మద్యం తాగుతుండడం, నిద్రలేని రాత్రులు గడుపుతుండడం, ఇంట్లో ఒంటరిగా ఏడవడం వంటి క్రియలు దేనికి సంకేతమన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కిమ్ ప్రస్తుతం మధ్య వయసుతో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రకటించినా..అసలు కిటుకు ఇంకేదో ఉందనే సంకేతాలు విన్పిస్తున్నాయి. కిమ్ ఆరోగ్యంపై గతంలో ఎన్నో వార్తలు పుకార్లు, షికార్లు చేశాయి. ప్రస్తుతం కిమ్‌కు తలెత్తిన అనారోగ్య సమస్య కూడా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...