బాలీవుడ్ ప్రేమపక్షులు కియరా అధ్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 6న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కేవలం 100 నుంచి 125 మంది దగ్గరి బంధువులు మాత్రమే అతిథులుగా హాజరవుతున్న ఈ వివాహ వేడుక కోసం జైసల్మేర్ లోని ఓ లగ్జరీ హోటల్ లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. హోటల్ లోని 80 లగ్జరీ రూమ్స్ తో పాటు 70 లగ్జరీ కార్లను అతిథుల కోసం బుక్ చేశారట ఈ యంగ్ కపుల్. కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళిద్దరికీ దగ్గరి స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖులు అయిన కొద్ది మంది మాత్రమే ఈ వేడుకకు అటెండ్ కానున్నారు. వారిలో కరణ్ జోహర్, మనీష్ మల్హోత్రా, ఇషా అంబానీ, అమితాబ్ బచ్చన్ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.
వేడుకలకు వీవీఐపీలు అటెండ్ కానుండటంతో సెక్యూరిటీ సిబ్బంది 3 రోజుల ముందే హోటల్ ను ఆధీనంలోకి తీసుకొని భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. లిమిటెడ్ గెస్ట్ లతోనే వేడుకలు జరగనున్నప్పటికీ ఖర్చు మాత్రం భారీగానే ఉండబోతోందని సమాచారం. అతిథుల కోసం కని వినీ ఎరుగని రేంజ్ లో విందు ఏర్పాటు చేయనున్నారట. అఫీషియల్ గా వీరిద్దరి పెళ్ళి వేడుకల గురించి ఇంకా ఎవరూ ఏ అనౌన్స్ మెంట్ చేయలేదు. రేపో మాపో ఫుల్ డిటైల్స్ ను ఈ యువజంట స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించనుందని బాలీవుడ్ న్యూస్.