HomeNATIONAL NEWSఐపీఎస్ లకు కేజ్రీవాల్ బెదిరింపులు : అమిత్ షా ఎంట్రీతో సీన్ రివర్స్

ఐపీఎస్ లకు కేజ్రీవాల్ బెదిరింపులు : అమిత్ షా ఎంట్రీతో సీన్ రివర్స్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

దేశ రాజధాని ఢిల్లీపై పరిపాలన అధికారాలు మొత్తం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి మరియు మంత్రులకు మాత్రమే ఉంటుందంటూ సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు నుంచి ఇలా జడ్జిమెంట్ కాపీ ఢిల్లీ ప్రభుత్వానికి అందిందో లేదో.. ఎగిరి గంతేశాడు సీఎం కేజ్రీవాల్. ఇక తన పెత్తనానికి తిరుగులేదని భావించిన కేజ్రీ.. క్షణం ఆలస్యం చేయకుండా అధికార దుర్వినియోగం మొదలుపెట్టాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ ఎడ్యుకేషన్ స్కామ్ తో పాటు ఇటీవల తన అధికారిక నివాసం కోసం లెక్కలు చెప్పకుండా ఖర్చు చేసిన కోట్లాది రూపాయలకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫైల్స్ ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయో ఆ అధికారులను పిలిచి మరీ వారిని బెదిరించాడు కేజ్రీవాల్. తమ వద్ద ఉన్న సాక్ష్యాలు, ఫైల్స్ ను మర్యాదగా ఇచ్చేయాలనీ లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బెదిరించాడు. విషయం హోమంత్రి అమిత్ షా చెవిన పడింది.. వెంటనే రంగంలోకి దిగిన అమిత్ షా ఢిల్లీ పరిపాలన అధికారాలను ఢిల్లీ ప్రభుత్వానికి కట్టబెడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన పిటిషన్ పై కౌంటర్ ఫైల్ చేయించాడు. దీంతో పాటు ఢిల్లీపై సర్వాధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కు కట్టబెడుతూ అప్పటికప్పుడు ఆర్డినెన్స్ జారీ చేశాడు. దీంతో పట్టుపని పది రోజులు కూడా అధికారం చెలాయించలేని కేజ్రీవాల్.. మళ్ళీ చతికిలపడిపోయాడు. అసలు ఢిల్లీ పరిపాలన అధికారం విషయంలో కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ ప్రభుత్వం మధ్య ఏం జరిగిందో చూస్తే..
ఢిల్లీలో ఎవరి అధికారాలు ఏంటన్నదానిపై వివాదం ఇప్పటిది కాదు. 2015 నుంచే ఈ రచ్చ నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఢిల్లీ పాలనాధికారాలను మొత్తం ఎల్జీ చేతిలో పెట్టింది. అప్పట్లో అప్పుడే కొత్తగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని డమ్మీని చేసేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకొన్నదన్న విమర్శలు వినిపించాయి. కేంద్రం నిర్ణయంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లటంతో.. కోర్టు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ వివాదాన్ని విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఎల్జీ, ఎన్నికైన ప్రభుత్వం మధ్య స్పష్టమైన అధికారాల విభజనను సూచిస్తూ ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. నగరంలో పోలీస్‌ వ్యవస్థ బాధ్యత మాత్రమే ఎల్జీదని, ఇతర శాసన, కార్యనిర్వాహక బాధ్యతలు ఎన్నికైన ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టం చేసింది. ఈతీర్పు వెలువడి వారం తిరక్కముందే కేంద్రం తాజా ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌తో లెఫ్టినెంట్ గవర్నర్‌కు గతంలోకంటే అధిక అధికారాలు వచ్చాయి. శాంతి భద్రతలతోపాటు కార్యనిర్వాహక అధికారాలు కూడా ఎల్జీ చేతుల్లోకే వెళ్లిపోయాయి. ఐతే, దేశ ప్రయోజనాల దృష్ట్యా నగరంలో అధికారాల సమతుల్యం కోసమే ఈ ఆర్డినెన్స్‌ తెచ్చామని కేంద్రం చెబుతోంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఆర్డినెన్స్‌తో ఢిల్లీలో గ్రూప్‌(ఏ)తోపాటు డీఏఎన్‌ఐసీఎస్‌ అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలపై ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా రద్దయ్యాయి. ఇదే సమయంలో నగరంలో పై అధికారుల పోస్టింగ్‌, బదిలీలతోపాటు విజిలెన్స్‌ అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కు దఖలుపడ్డాయి. నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీ పేరుతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి చైర్మన్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యుడిగా, నగర హోంశాఖ కార్యదర్శి మెంబర్‌ సెక్రెటరీగా ఉంటారు. నగరంలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, పోస్టింగ్‌ ఇవ్వాలన్నీ ఈ ముగ్గురూ సమావేశమై, ఓటింగ్‌ నిర్వహించి ఎల్జీకి నివేదించాల్సి ఉంటుంది. ఐనా, ఈ అథారిటీ సిఫారసులను ఎల్జీ గౌరవించాల్సిన పనిలేదు. వాటిని కాదని, తన సొంత నిర్ణయంతో వ్యవహరించే వీలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉంటుంది. ఢిల్లీలోని పోలీస్‌ వ్యవస్థ ఇప్పటికే ఎల్జీ చేతిలో ఉంది. దేశ రాజధానిలో శాంతిభద్రతల బాధ్యత మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్‌దే. సివిల్‌ అధికారులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉండేది. తాజా ఆర్డినెన్స్‌తో ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఆ అధికారాలు కూడా లేవు. సింపుల్‌గా చెప్పాలంటే కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌లో ఉంది ఇదే. మొత్తంగా.. ఢిల్లీ పాలనాధికారాపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. మరి కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...