HomeNATIONAL NEWSసిసోడియా కోసం అందరి ముందు ఏడ్చేసిన కేజ్రీవాల్

సిసోడియా కోసం అందరి ముందు ఏడ్చేసిన కేజ్రీవాల్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ సభా వేదికపై ఎమోషనల్ అయ్యారు. తన సహచర మంత్రి మనీష్ సిసోదియాను తలచుకొని కంటతడి పెట్టుకున్నాడు. ఢిల్లీ విద్యా శాఖ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన మనీష్ సిసోదియాను జైళ్ళో పెట్టడం అన్యాయం అంటూ ఆక్రోశించాడు పాపం కేజ్రీవాల్. విద్యాశాఖను పూర్తిగా సంస్కరించేందుకు సిసోదియా ఎంతో పట్టుదలతో, కమిట్మెంట్ తో పనిచేశాడనీ.. తాను అనుకున్నట్టే ఎన్నో మార్పులు చేసి విద్యాశాఖను సంస్కరించి అభివృద్ధి చేశాడనీ చెప్తూ.. అలాంటి వ్యక్తిని అన్యాయంగా జైళ్ళో పెట్టారంటూ బాధపడ్డాడు కేజ్రీవాల్. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ సీఎం.. ఇలా అందరి ముందు కంటతడి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈయన ఎవరి కోసం అయితే ఏడ్చాడో ఆయన లిక్కర్ కుంభకోణంతో పాటు మరి కొన్ని నేరారోపణలపై అరెస్టు చేయబడి జైలు శిక్ష అను‌భవిస్తున్నాడు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ వంటి 13 శాఖలకు మంత్రిగా వ్యవహరించేవాడు మనీశ్ సిసోదియా. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు ఇతడే.

అప్పటికే ఢిల్లీలో ఆచరణలో ఉన్న లిక్కర్ విధానాన్ని పూర్తిగా మార్చేసి ప్రభుత్వంపై కాసుల వర్షం కురిపించే ప్రైవేట్ లిక్కర్ పాలసీని రూపొందించిన వారిలో ముఖ్యుడు సిసోదియా. దీని కోసం కోట్లాది రూపాయలు చేతులు మారాయనీ.. దీని ద్వారా వచ్చిన సొమ్మునే పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు చేశారనీ సీబీఐ ఆరోపణ. విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చినా సరిగ్గా స్పందించక పోవటం.. చివరికి విచారణకు హాజరై కూడా సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవటంతో అప్పట్లో వివాదం పెద్దదైంది. “మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా.. నేను ఢిల్లీ డిప్యూడీ ముఖ్యమంత్రిని.. అలాగే 13 శాఖలు నా చేతిలో ఉన్నాయి.. నేను ఒక్క నిముషం కూడా వృధా చేయను.. నాతో కాస్త మర్యాదగా మాట్లాడండి..” అంటూ సీబీఐ అధికారులను సిసోదియా బెదిరించాడు. ఆ తర్వాత పాపం.. తాను మంత్రిగా ఉన్న అన్ని శాఖలకు రాజీనామా చేసి.. చివరకు ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా స్వస్తి చెప్పి.. అదే సీబీఐ అధికారుల ముందు చేతులు కట్టుకొని నిలబడి.. చివరకు జైలుకు వెళ్ళాడే తప్ప.. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసో.. ప్రజా ఉద్యమం చేసో కాదు. కానీ.. ఎంతైనా తనతో పాటు కుంభకోణాల్లో పాలు పంచుకున్నవాడు కాబట్టి.. కేజ్రీవాల్ కు ఆమాత్రం ఆప్యాయత ఉంటుంది మరి.

FOLLOW US

More like this