HomeINTERNATIONAL NEWS"భారత్ అలాంటి దేశమే" - అమెరికా సంచలన స్టేట్మెంట్

“భారత్ అలాంటి దేశమే” – అమెరికా సంచలన స్టేట్మెంట్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

“ఒక దేశంలో పూర్తి చైతన్యవంతమైన ప్రజాస్వామ్య ఎలా ఉంటుందో చూడాలంటే భారత్ ను చూడండి.. భారత్ అలాంటి దేశమే.. కావాలంటే మీరు ఢిల్లీ వెళ్ళి దీన్ని అను‌భవపూర్వకంగా తెలుసుకోవచ్చు..” ఈ మాటలు మాట్లాడింది అమెరికా వైట్ హౌజ్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అడ్వైజర్ జాన్ కర్బీ. తనకు పోటీ వచ్చే దేశాన్ని ఏదో రకంగా అంతర్జాతీయ సమాజం ముందు అభాసుపాలు చేయటం అమెరికాకు అలవాటు. ప్రపంచాన్ని శాసించాలనీ.. ప్రపంచం మొత్తానికీ అమెరికాయే దిక్కుగా ఉండాలనీ ఆ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు కోరుకుంటారు. అమెరికాలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ఆ ప్రభుత్వ ఆలోచన మాత్రం ఇలాగే ఉంటుంది. కరడుగట్టిన సామ్రాజ్యవాదానికీ.. నియంతృత్వానికీ అమెరికా అధ్యక్షులు పెట్టింది పేరు. తాము పూర్తి ప్రజాస్వామికంగా వ్యవరిస్తామని చెప్తూనే ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి అంతర్యుద్ధం సృష్టించి ప్రభుత్వాలను పడగొట్టడమే అమెరికా ఘన చరిత్రలో అతి ముఖ్య ఘట్టాలు. అలాంటి అమెరికా భారత్ పట్ల తన వైఖరి చాలా వరకు మార్చుకున్నట్టే కనిపిస్తోంది.
త్వరలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్-మోడీ సమావేశం.. భారత్-అమెరికా సంబంధాల గురించి ప్రస్తావించిన జాన్ కర్బ్.. మీడియా ముందు భారత్ ను.. ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని ప్రశంసించాడు. భారత్ తో స్నేహం అనేది అమెరికాకు అత్యంత ప్రాముఖ్యమైన అంశమనీ.. ఇండో పసిఫిక్ వ్యూహంలో భారత్ అత్యంత కీలక భాగస్వామి అనీ వ్యాఖ్యానించాడు కర్బీ. “ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే ఆందోళనకరమైన లేదా అభ్యంతరకరమైన పరిస్థితి ఉంటే దాని గురించి నిజం మాట్లాడటానికి మేం ఎప్పుడూ సిగ్గుపడము. భారత్ గురించి చెప్పాలంటే వంద ఉదాహరణలు చెప్పొచ్చు. మోడీ-బైడెన్ మీటింగ్ అనేది చాలా ప్రాముఖ్యతగలమైన విషయం. భారత్ క్వాడ్ కూటమిలో భాగస్వామి..!” అని కర్బీ వ్యాఖ్యానించాడు. ఓ వైపు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భారత్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనంగా ఉందని ఊదరగొట్టేస్తూ అక్కడా ఇక్కడా తిరుగుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే.. జాన్ కర్బీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.


సరిగ్గా మోడీ అమెరికా పర్యటనకు ముందు రాహుల్ గాంధీ ఆగమేఘాల మీద తన పర్యటనను షెడ్యూల్ చేసుకున్నాడు. అమెరికాలో మోడీ పర్యటిస్తున్న సమయంలో కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కడెక్కడ ఎలాంటి నిరసనలు చేపట్టాలి.. మోడీ ప్రభుత్వంపై ఎలా బురదచల్లాలి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా అప్రతిష్టపాలు చేసి ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి.. అనే వాటిపైనే ముఖ్యంగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. అవసరం లేకపోయినా అప్రస్తుతమైన అంశాలను ఢంకా బజాయించి అమెరికాలో ప్రచారం చేస్తున్నాడు రాహుల్. రాహుల్ వ్యాఖ్యలు ప్రపంచం ముందు భారత్ ను ఓ అప్రజాస్వామిక దేశంగా నిలుపుతాయేమో అని అనుకునేలోపే అమెరికా ప్రతినిథి నోట భారత ప్రజాస్వామ్యంపై ఇలాంటి అద్భుతమైన వ్యాఖ్యలు రావటం నిజంగా భారత్ పరపతి పెరిగిందని చెప్పటానికి నిదర్శనం.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...