టెలీకామ్ దిగ్గజం రిలయన్స్ జియో.. మరో బంపర్ ఆఫర్ తో యూజర్ల ముందుకు రానుంది. వచ్చే ఐపీఎల్ సీజన్ ను ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఐపీఎల్ చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కొనాల్సి ఉంది. కానీ వచ్చే ఐపీఎల్ ప్రసార హక్కులు రిలయన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ సీజన్ స్ట్రీమింగ్ కోసం ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేకుండా ఫ్రీగా చూసేందుకు ఐపీఎల్ ఫ్యాన్స్ కు జియో బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీనిపై అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోయినా.. త్వరలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఫ్రీ సిమ్ కార్డు.. ఫ్రీ ఇంటర్నెట్ అంటూ మార్కెట్లోకి వచ్చి దిగ్గజ టెలికాం కంపెనీలను పక్కకు నెట్టి మార్కెట్ వాటాను ఆక్రమించిన రిలయన్స్ జియోలాంటి పథకమే ఇది. ఐపీఎల్ ఫ్రీగా టెలీకాస్ట్ చేసి.. ఆ తర్వాత విపరీతమైన సబ్ స్క్రిప్షన్ ను సంపాదించాలనేది రిలయన్స్ వ్యూహం. వ్యూహమేదైనా.. ఐపీఎల్ ఫ్రీగా రావటం ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే.