HomeNATIONAL NEWS"భారత్ మమ్మల్ని బెదిరించింది" : పాత తేనె తుట్టెను కదిపిన జాక్ డోర్సే

“భారత్ మమ్మల్ని బెదిరించింది” : పాత తేనె తుట్టెను కదిపిన జాక్ డోర్సే

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

2020-21లో ఢిల్లీ కేంద్రంగా సుమారు యేడాది పాటు జరిగిన రైతుల ఆందోళనలను మర్చిపోవడం అంత సులువేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా ఏకమై ఉద్యమించారు. ఆ ఉద్యమం చాలా సుదీర్ఘంగా నడిచింది. అంతే వివాదాస్పదమైంది కూడా. ఇదే సమయంలో రైతుల ఆందోళనతోపాటు ట్విట్టర్ వ్యవహార శైలి కూడా అంతే వివాదాస్ఫదమైంది. ఆ సమయంలో ఇండియన్ ఐటీ రూల్స్‌ను ఫాలో అవ్వడానికి ససేమిరా అంటూ వచ్చిన ట్విట్టర్‌.. చిన్న చిన్న కారణాలు చూపిస్తూ ప్రభుత్వ పెద్దల అకౌంట్లకు బ్లూటిక్స్‌ తీసివేయడమో, లేదంటే బ్లాక్ చేయడమో చేసింది. ఈ పరిణామాలపై ట్విట్టర్‌కీ, కేంద్రంలోని మోడీ సర్కార్‌కీ మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. చివరకు రైతు చట్టాలపై మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఫలితంగా రైతులు ఆందోళన విరమించారు. ఆ తర్వాత భారత ఐటీ చట్టాలకు ట్విట్టర్ కూడా తలొగ్గింది. దీంతో ఆ వివాదానికీ ఎండ్‌కార్డ్ పడింది. ఆ తర్వాత ఇంతటి వివాదానికి కారణమైన ట్విట్టర్‌ ఓనర్‌షిప్ మారడం, జాక్ ప్లేస్‌ లోకి మస్క్‌ రావడం లాంటి మార్పులు చకచకా జరిగిపోయాయి. ఇలా ముగిసిపోయిందనుకున్న వివాదాన్ని జాక్ డోర్సే మళ్ళీ కెలికాడు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డోర్సేను.. సదరు యాంకర్.. ప్రపంచం నలుమూలల నుంచి శక్తిమంతమైన వ్యక్తులు మీ వద్దకు వచ్చి అనేక డిమాండ్లు చేస్తారనీ.. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నిస్తే.. ఇండియాను ఎగ్జాంపుల్‌గా చూపించిన జాక్.. రైతు ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టుల గురించి తమ వద్దకు చాలా డిమాండ్లు వచ్చాయన్నారు. ఓ రకంగా తమను బెదిరించారని ఆరోపించారు. ట్విటర్‌కు భారత్‌లో పెద్ద మార్కెట్ ఉందని, దాన్ని మూసివేస్తామని, తమ ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తామని చెప్పారన్నారు. వాళ్లమాట వినకపోతే ట్విట్టర్ ఆఫీస్ మూసేస్తామని బెదిరించారన్నారు. ఇదే ప్రజాస్వామ్య దేశమైన భారత్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దేశ రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి. జాక్ విమర్శ అలా సామాజిక మాధ్యమాల్లో కనిపించిందో లేదో.. విపక్ష పార్టీలు అతడికే మద్దతుగా నిలుస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశాయి.

ప్రధాని మోడీని అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చి మరీ విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్య మాతృ భూమిలో ప్రజాస్వామ్యాన్ని ఎలా హత్య చేస్తున్నారో వెల్లడించడమే తమ లక్ష్యం అంటూ విరుచుకుపడింది. హక్కుల కోసం ఉద్యమించిన రైతులపై తీవ్రవాదులుగా ముద్రవేశారని ఫైర్ అయింది. ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు రైతుల కష్టాలను చూపిస్తే, భారత్‌లో ఆ సంస్థలను మూసేసి దాడులు చేస్తామని హెచ్చరించారని జాక్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ కామెంట్ చేశారు కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియ. ఈ ఎపిసోడ్‌పై హస్తం పార్టీ ఓ కార్టూన్‌ను కూడా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో నియంతలు చరిత్రలో పిరికివారిగా మిగిలిపోతారని ఎద్దేవా చేసింది. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అయితే.. ట్విట్టర్ మాజీ సీఈవో చెప్పిందాంట్లో అవాస్తవమేముందని ప్రశ్నించారు. మోడీ సర్కార్ ట్విట్టర్ మాజీ సీఈఓపై ఒత్తిడి తెచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశాయని ఆయన అన్నారు. అందుకే గతంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను నిషేధించారని ఆరోపించారు.

ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ మాత్రమే కాదు.. చాలా విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించడం మొదలు పెట్టాయి. ఫలితంగా వివాదం ముదురుతున్న సమయంలో బీజేపీ కౌంటర్ అటాక్‌కు దిగింది. జాక్ ఆరోపణలపై స్పంధించిన కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. జాక్ డోర్సే చేసిన ప్రకటనలు పూర్తి నిరాధారమని కొట్టి పారేశారు. ట్విట్టర్ బృందం మీద ఎవరూ దాడి చేయలేదని, జైలుకు పంపలేదని స్పష్టం చేశారు.. అంతే కాకుండా డోర్సే, అతడి బృందం పదేపదే భారతదేశ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. 2020 నుంచి 2022 వరకు ఇదే పద్ధతిని పాటించిందని చెప్పుకొచ్చారు. జాక్ భారత చట్టానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని అంగీకరించేందుకు సుముఖత చూపలేదనీ.. చట్టాలు అతనికి ఏ మాత్రం వర్తించినట్టు ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. అంతేకాక దేశంలో ఉన్న కంపెనీలను చట్టాలు పాటించకుండా చేశారని ఆరోపించారు.. రైతుల నిరసనను డోర్సే ఎందుకు ప్రస్తావించారో అందరికీ తెలుసని రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.


జాక్ డోర్సే ఆరోపిస్తున్నట్టు ట్విట్టర్ విషయంలో భారత్ ఎలా వ్యవహరించిందో పక్కనపెడితే.. అంతకుముందే చాలా దేశాలు ట్విట్టర్‌పై కఠినంగా వ్యవహరించాయి. అలాంటి దేశాల్లో చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. చైనాతోపాటు ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, తుర్క్‌మెనిస్థాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ తదితర దేశాలు శాశ్వతంగా లేదా తాత్కాలికంగా ట్విట్టర్‌ను బ్యాన్ చేశాయి. పలు దేశాలు తాత్కాలికంగా ట్విట్టర్‌పై నిషేధాన్ని విధించి.. ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేశాయి. కానీ, భారత్ ఆ పని చేయలేదు. పైగా మన దేశ ఐటీ చట్టాలను ట్విట్టర్ ఉల్లంఘించినా, కేంద్ర సర్కార్‌తో వాదనలకు దిగినా హెచ్చరికలతోనే సరిపెట్టారు తప్పితే.. జాక్ ఆరోపించిన ఎలాంటి యాక్షన్‌ను తీసుకోలేదు. అలాంటప్పుడు ట్విట్టర్ మాజీ సీఈవో భారత ప్రజాస్వామ్యాన్ని ఎద్దేవా చేయాల్సిన అవసరమేంటనేదే అసలు ప్రశ్న. అణచి వేతలకు కేరాఫ్ అడ్రస్ అయిన చైనాను కూడా కాదని భారత్‌ను విమర్శించడం ఏంటో అతడికే తెలియాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా జాక్ డోర్సే కామెంట్ల వివాదం మాత్రం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...