HomeTELANGANAఎడిటోరియల్ : "ఆరేళ్ళు నిండితేనే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్" రూల్ మంచిదేనా ?

ఎడిటోరియల్ : “ఆరేళ్ళు నిండితేనే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్” రూల్ మంచిదేనా ?

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

భారత విద్యా వ్యవస్థ రూపు రేఖలు మారిపోయే సంచలన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇకపై ఆరేళ్ళు నిండిన పిల్లలకు మాత్రమే ఒకటో తరగతి అడ్మిషన్ ఇవ్వాలనీ.. అంతకు ముందు ఒకటో తరగతిలో చేరినట్టైతే పిల్లల అడ్మిషన్ చెల్లదంటూ కేంద్రం సరికొత్త జీఓ తీసుకొచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆరేళ్ళ పూర్తయ్యే వరకూ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ లేకపోతే పిల్లల కెరీర్ లో సంవత్సరాల కొద్దీ సమయం వేస్ట్ అవుతుందనీ.. దీని వల్ల పిల్లలకు భవిష్యత్తులో నష్టం ఉంటుందనీ ఓ వర్గం జనాలు గోల మొదలుపెట్టారు. మరి కొంత మంది మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆరేళ్ళైనా నిండనిదే పిల్లల్లో మెచ్యూరిటీ రాదనీ.. చదువు కనీసం బుర్రకెక్కని వయసులో చదివించి వాళ్ళ బుర్రలు పాడు చేయటం తప్ప ఒరిగేదేమీ లేదని వీళ్ళ వాదన. అయితే.. ఈ రెండింటిలో ఏది నిజం అనేది ఇప్పుడు తేలాల్సిన విషయం.
ప్రీ స్కూలింగ్ పేరుతో ప్రైవేటు స్కూల్స్ చేసే హడావుడి గురించి ఇప్పుడు మనం ఓసారి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు తరంలో ఒకటో తరగతికి ముందు కేవలం శిశు తరగతి పేరుతో ఒకే ఒక్క సంవత్సరం ప్రీ స్కూలింగ్ ఉండేది. చాలా వరకు పిల్లలు ఇంటి దగ్గరే చిన్న బాలశిక్ష, పెద్ద బాలశిక్ష అంటూ కొంత చదువుకునే వాళ్ళు పెద్దల సహాయంతో. తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల దగ్గరే అసలు చదువు అనేది మొదలయ్యేది పిల్లలకు. కానీ ఇప్పుడు తరం మారింది.. పరిస్థితి కూడా మారింది. తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల దగ్గర పిల్లలు పెరిగే కాలం ఎప్పుడో పోయింది. రెండున్నరేళ్ళకే స్కూల్ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు స్కూళ్ళల్లో లైన్ కడుతున్నారు. డొనేషన్లు కట్టి మరీ పిల్లల బాల్యాన్ని కార్పోరేట్ స్కూళ్ళో తాకట్టు పెట్టేస్తున్నారు. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన పిల్లలను మూడేళ్ళు నిండకుండానే స్కూళ్ళో పడేసి తామేదో పిల్లల భవిష్యత్తుకు రక్తం ధారపోసి మరీ కష్టపడుతున్నట్టు ఫీలవుతున్నారు నేటి తల్లిదండ్రులు. అసలు ఇప్పటి ప్రైవేట్, కార్పోరేట్ ప్రీ స్కూలింగ్ పద్ధతి ఎలా ఉందనేది ఖచ్చితంగా 90 శాతం తల్లిదండ్రులకు తెలియదనే చెప్పాలి. యేడాది మొత్తం ఏబీసీడీలే నేర్పించి లక్షన్నర ఫీజు వసూలు చేసే స్కూళ్ళు.. పిల్లల వికాసం గురించి ఆలోచిస్తాయా..? వ్యాపారం గురించి తప్ప..! ఇది నేటి తల్లిదండ్రులు గ్రహించాలి. “వ్యక్తిగతంలో నుంచి సామాజికం”లోకి వెళ్ళటం వ్యక్తిత్వ వికాసం అవుతుంది.. పిల్లలు ఇంటి గడప దాటి ప్రపంచంలోకి అడుగు పెట్టడం అనేది బాల్యవికాసం అవుతుంది. ఇవన్నీ మనకు తెలియవు.. మనకు తెలిసింది ఒక్కటే..! ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా ఎదురింటి సౌండ్ పార్టీతో పోటీ పడి మరీ మంచి కార్పోరేట్ స్కూళ్ళో పిల్లలను చదివించాలి ఎంత ఖర్చైనా సరే..!!
అమ్మమ్మ, నానమ్మ చెప్పే పాత సంగతులూ, సామెతలూ.. పాటలూ, పద్యాలూ.. ఇవేవీ ఇప్పటి తరానికి తెలియవు. తలంటు పోస్తూ అమ్మమ్మ పాడే లాలి పాట.. పాలిచ్చి పడుకోబెడుతూ అమ్మ పాడే జోల పాట.. ఇప్పుడు లేవ్. అపురూపమైన పిల్లల బాల్యాన్ని కార్పోరేట్ గద్దలు ఎగరేసుకుపోతున్నాయి. ఇది తెలియని పేరెంట్స్ లక్షలు కట్టి పిల్లల బాల్యాన్ని తరగతి గదికి అంకితమిస్తున్నారు. ప్రీ స్కూలింగ్ పేరుతో కొత్త కొత్త కాన్సెప్టులతో ఒకటో తరగతికి ముందే సంవత్సరాల తరబడి పిల్లలను స్కూళ్ళో ఉంచి లక్షలు లాగేసే కార్పోరేట్ విద్యా వ్యవస్థ మారదు. వారి మాయలో పడే పేరెంట్స్ కు అసలు పిల్లలు ఏం కోల్పోతున్నారో అర్థం కాదు. ఇలాంటి సమయంలో ఆరేళ్ళు పూర్తయ్యి ఏడో యేట అడుగు పెట్టిన పిల్లల ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా పిల్లల బాల్యాన్ని కార్పోరేట్ పరం కాకుండా కాపాడుతుందని చెప్పటంలో సందేహం లేదు. ఈ నిర్ణయం వల్ల రెండున్నర, మూడేళ్ళకే పిల్లలను ప్రీస్కూలింగ్ పేరుతో హింసించే ధోరణి మారొచ్చు. ఎందుకంటే.. ప్రీస్కూలింగ్ పేరిట ఎన్నేళ్ళు స్కూళ్ళో చదివించినా.. ఏడేళ్ళు నిండితేనే కదా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ దొరికేది..!

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...