ఐపీఎల్ 2023 ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం బీసీసీఐ అఫీషియల్ గా షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. మార్చి 31న జరిగే ఫస్ట్ మ్యాచ్ లో ఐపీఎల్ మెగా షో మొదలుకానుంది. మొత్తం 10 టీమ్ లు పోటీ పడుతున్న మెగా టోర్నీ మార్చి 31న అహ్మదాబాద్ లో రాత్రి ఏడున్నర గంటలకు గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో మొదలుకానుంది. మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు ఉండగా.. మే 21న లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి. ఆ తర్వాత జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మే 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, జైపూర్, లక్నో, మొహాలీ, ధర్మశాల, గౌహతిలలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
ఈసారి ఐపీఎల్ లో ఉంటే టీమ్ లు
ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బ్యాంగ్లోర్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జియంట్స్ జట్లు పోటీ పడనున్నాయి.