HomeINTERNATIONAL NEWSచైనాను భయపెడుతున్న ఐఎన్ఎస్ సింధుకేసరి

చైనాను భయపెడుతున్న ఐఎన్ఎస్ సింధుకేసరి

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

దక్షిణ చైనా సముద్రం.. బిలియన్ డాలర్ల విలువైన క్రూడాయిల్, గ్యాస్‌కు నెలవు. 1.3 మిలియ‌న్ల స్క్వేర్ మైళ్ల ఈ ప్రాంతంపై జిన్‌పింగ్ సర్కార్ ఎప్పట్నుంచో కన్నేసింది. ఇందులో భాగంగానే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, తైవాన్‌లపై దాడులకు కూడా వెనుకాడ్డం లేదు. మొన్నటికిమొన్న ఫిలిప్పీన్స్‌ కోస్ట్‌ గార్డ్‌ నౌకపై లేజర్ దాడులకు దిగింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే భారత్ యాక్షన్ మార్చింది. మన శత్రుభీకర ఐఎన్ఎస్‌ సింధుకేసరిని రంగంలోకి దించింది. అఫీషియల్‌గా దీని లక్ష్యం ఆసియా దేశాలతో దౌత్య, సైనిక విస్తరణలే.
పసిఫిక్ మహాసముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతాన్ని తనదని వాదిస్తోంది. ఇక్కడ ఒక కృత్రిమ ద్వీపాన్ని కూడా నిర్మిస్తోంది. ఇందులో చైనా ఒక్క దానికే భాగం ఉంటే సమస్య లేదు. కానీ, తమకు కూడా భాగం ఉందంటూ దక్షిణ చైనా సముద్రం చుట్టూ ఉన్న దేశాలు వాదిస్తున్నాయి. వాటిలో తైవాన్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనై దేశాలు ఉన్నాయి. దాదాపు అన్ని దేశాలు ఇక్కడ తమకూ వాటా ఉందని ప్రకటించుకున్నాయి.
అటు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, నాటో కూటమి ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టులపై చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. అందుకే ఇక్కడ పెరుగుతున్న చైనా జోక్యం ఎప్పుడైనా భారీ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇతర దేశాలపై డ్రాగన్ కంట్రీ దాడులకు సైతం వెనుకాడడం లేదు. దక్షిణ చైనా సముద్రంలో ఇతరులు అడుగుపెట్టడాన్ని ఏమాత్రం సహించబోమని బహిరంగంగానే ప్రకటనలు చేస్తోంది. దీనంతటికీ కారణం ఈ ప్రాంతం లెక్క కట్టలేనంత నాచురల్ రిసోర్సెస్‌కు నెలవు కావడమే.
దక్షిణ చైనా సముద్రంలో వివాదం పీక్స్‌కు చేరుతున్న వేళ.. భారత్ తన జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధుకేసరిని మొదటి సారి ఇండోనేషియా జలాల్లోకి పంపింది. దీని లక్ష్యం ఆసియా దేశాలతో దౌత్య, సైనిక విస్తరణే అయినా.. అసలు ఉద్దేశం మాత్రం బీజింగ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడమే. 3వేల టన్నుల బరువున్న డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ సింధుకేసరి నుండా జలసంధి గుండా ప్రయాణించి జకార్తాకు రీచ్ అయింది. ఐఎన్ఎస్ సింధుకేసరి ఆపరేషనల్ సింధుఘోష్-క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ ఎటాక్ సబ్‌మెరైన్‌లకు సంబంధించింది. దీనిని రష్యాలోని సెవెరోడ్‌విన్‌స్క్‌లో 2018 చివరిలో ఆధునీకరించారు. ఆల్ఫా క్రూయిజ్ మిసైల్‌ సిస్టమ్‌కు అనుగుణంగా క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఈ సబ్‌మెరైన్‌లు 72.6 మీటర్ల పొడవు, 9.9 మీటర్ల బీమ్‌ కలిగి ఉంటాయి. నీటిలోపల 18 నాట్స్‌ వరకు ప్రయాణించగలవు. సుమారు 45 రోజుల పాటు నీటి ఆడుగు భాగంలో ఉండే ఈ జలాంతర్గామికి వెపన్స్‌ సిస్టమ్‌ టార్పెడోలు, యాంటీ షిప్ మిసైల్స్‌ను ప్రయోగించే సత్తా ఉంది.
2020లో కిలో క్లాస్ తరగతి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధువీర్‌ను మయన్మార్‌కు భారత్ పంపింది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌తో పాటు, శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్‌లు, సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను 25 కిలోమీటర్ల పరిధిలో ఛేదించగల స్వదేశీ ఆకాష్ క్షిపణి వ్యవస్థలను కూడా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు విక్రయించాలని భారత్ భావిస్తోంది. ఇక.. ద్వైపాక్షిక విన్యాసాల విషయానికి వస్తే ఇటీవలి నెలల్లో సింగపూర్‌తో భారత్ నేవీ సింబెక్స్, ఆర్మీ అగ్ని వారియర్.. మలేషియాతో హరిమౌ శక్తి, ఇండోనేషియాతో గరుడ్ శక్తి నిర్వహించింది. ఇక, భారత్, ఇండోనేషియా ఏడాదికి రెండు సార్లు నావెల్ పెట్రోల్ నిర్వహిస్తాయి. చివరిసారిగా డిసెంబర్‌లో అంతర్జాతీయ మారీటైమ్ సరిహద్దు రేఖ వద్ద ఇది జరిగింది. ‘భారత్, ఇండోనేషియా తమ వ్యూహాత్మక, రక్షణ సహకారాన్ని విస్తృత శ్రేణిలో విస్తరించాయి.. ప్రత్యేకించి 2018లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కొత్త రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత అది మరింత పెరిగింది.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతం ఎవరికీ చెందదని ఇప్పటివరకు భారత్ చెబుతూ వస్తోంది. ఈ ప్రాంతంలో అమెరికా నౌకల గస్తీకి కూడా ఏ దేశమూ మద్దతు పలకడం లేదు. ఐతే 2015లో ఒబామా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు.. దక్షిణ చైనా సముద్రంలో సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లు భారత్, అమెరికా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆ తర్వాత బైడెన్‌ అధ్యక్షుడయిన తర్వాత కూడా దీనిపై చాలా సందర్భాల్లో ఇరు దేశాలు సంయుక్త ప్రకటనలు చేశాయి. ఈ ప్రకటనలపై చైనా నిరసన తెలిపింది. ఆ తర్వాత ఈ విషయంపై భారత్ నేరుగా స్పందించలేదు. చాలాసార్లు చైనావిస్తరణకాంక్ష గురించి మాట్లాడినా.. దక్షిణ చైనా సముద్రం పేరును నేరుగా ప్రస్తావించలేదు. ఇలాంటి సమయంలో మొదటి సారి ఇండోనేషియా తీరంలో ఐఎన్‌ఎస్ సింధుకేసరిని నిలిపి.. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు అండగా ఉంటామనే సంకేతాలు బీజింగ్‌కు పంపించింది. ఇదే సమయంలో ఫిలిప్పీన్స్, ఇండోనేషియాతో పాటు ఇతర ఆసియా దేశాలకు ఆయుధాల విక్రయం ద్వారా చైనా స్థానాన్ని భర్తీ చేసేలా యాక్షన్ షురూ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలతో భారత్ ఆసియా దేశాలకు చేరువవుతుంటే.. చైనా మాత్రం క్రమంగా దూరమవుతోంది.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...